తెలుగు సినిమా కి దారేది? – Part 1

Written by

ఇప్పుడు తెలుగు పరిశ్రమ ఒక సంధి కాలంలో ఉంది. తన భవిష్యత్తు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వెతుక్కోంటోంది.

నిజానికి తెలుగు పరిశ్రమ కు హైదారాబాద్ తో అనుబంధం ఎక్కువ రోజులనుండి ఏమీ లేదు, 1936 నుండి 1996 వరకు అంటే 60 సంవత్సరాలు తెలుగు సినిమా రాజధాని మధ్రాసే, దాని అనుబంధం మద్రాసుతోనే. 1996 నుండి 2014 అంటే కేవలం 18 సంవత్సరాలు మాత్రమే హైదారాబాద్ తో పరిశ్రమ కు ఉన్న అనుబంధం .

తెలుగు సినిమాకు రాజా పోషకులు, విపరీతమైన సినిమా అభిమానం చూపే ప్రేక్షకులు ఉంది కోస్తా, రాయలసీమల్లోనే . గత దశాబ్దంన్నర గా నైజాం( సినీ పరిభాష లో తెలంగాణా ) లో కలెక్షన్స్ పెరిగినా అవి ముఖ్యంగా హైదారాబాద్ సిటీ నుండి వచ్చేవే. హైదరబాద్ ను వదిలేస్తే మిగిలిన నైజాం లో కలెక్షన్స్ పెద్ద స్థాయి లో ఏమీ ఉండవు, ఆంధ్రా, సీడెడ్( సినీ పరిభాషలో రాయలసీమ) లు కలిసి 60 % కలెక్షన్స్ ఇస్తే నైజాం 40% కలెక్షన్స్ ఇస్తుంది . ఆ 40 % లో 15 % కేవలం హైదారాబాద్ నుండి వస్తుంది . ఇంకా వివరంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న  13 జిల్లాలు కలిపి 60 %, హైదారాబాద్, రంగారెడ్డి జిల్లాలు కలిపి 15% , మిగతా 8 జిల్లాలు కలిపి 25% కలెక్షన్స్ ను అందిస్తాయి . ఇందులోనూ హైదారాబాద్ , రంగారెడ్డి జిల్లాలలో ఆంధ్రా ప్రజలు ఉండే ఏరియాలు, మల్టీప్లెక్స్ లలో నే ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి . ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక, వైజాగ్, విజయవాడ, తిరుపతి , కర్నూల్, గుంటూర్ , రాజమండ్రి లాంటి చోట్ల కూడా మల్టీప్లెక్స్ వస్తే ఆంధ్రా, సీడెడ్ ల వాటా ఖచ్చితంగా పెరుగుతుంది. అందుకే తెలుగు సినిమాకు నమ్మకమైన ప్రేక్షకులు, కలెక్షన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్ లోనే .

ఇక తెలుగు సినీ పరిశ్రమ గురించి ఆలోచిద్దాం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత తెలుగు బాష మాట్లాడే ప్రజలకు ఒక రాజధాని ఏర్పడింది, తెలుగు సినిమా కూడా హైదారాబాద్ కే తరలి రావాలి అన్న ఆలోచనతో ప్రారంభమయిన సారధి స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, భాగ్యనగర్ స్టూడియోస్, ఆ తర్వాత ప్రారంభమయిన రామానాయుడు, పద్మాలయా స్టూడియోస్ లలో అడపాదడపా కొన్ని షూటింగ్స్ జరిగినా, 1996 వరకు సినీ పరిశ్రమ హైదరబాద్ కు రాలేదు ,1996 వచ్చేసరికి దాదాపు గా అందరు హీరోలు, దర్శకులు, నిర్మాతలు హైదారాబాద్ కు తరలి వచ్చారు, 1999 లో ప్రారంభమైన రామోజీ ఫిల్మ్ సిటీ తో పరిశ్రమ పూర్తిగా హైదరబాద్ లో స్థిరపడింది. దీనికి ఆద్యుడుగా అక్కినేని నాగేశ్వరరావు నే మొదటగా చెప్పుకోవాలి . ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన వెంటనే ఆయన తన నివాసాన్ని హైదరబాద్ కు మార్చుకొని , పరిశ్రమ ఇక్కడికే రావాలని చాలా తపించాడు .

1996 లో పరిశ్రమ ఇక్కడకు వచ్చి స్థిరపడినా, అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు గడిచినా ఇంకా హైదరబాద్ లో చాలా బాలారిష్టాలు ఉన్నాయి, మధ్రాసు తో పోల్చుకుంటే ఇక్కడ వనరులు చాలా తక్కువ . ఇక్కడ హీరోలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, కానీ కావాల్సిన స్కిల్డ్ మ్యాన్ పవర్ పూర్తి స్థాయిలో లేదు, ఉదాహరణ కు హైదారాబాద్ సిటీ మొత్తం మీద సినిమా పాటకు కానీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం కానీ వీణ కావాల్సి వస్తే ఆ స్థాయి ప్రావీణ్యత కలిగిన వ్యక్తి ఒకే ఒక్కరు ఉన్నారు, ఏ సంగీత దర్శకుడు అయినా ఆయన కోసం వేచి చూడాల్సిందే, అదే మద్రాసు లో అయితే కనీసం స్టూడియో కి ఒక్కరైనా ఉంటారు . తోలు డప్పు కావాల్సి వస్తే ఇక్కడ ఎవ్వరూ లేరు అందుకే చాలా మంది పెద్ద పెద్ద సంగీత దర్శకులు పాట రికార్డింగ్ ,బ్యాగ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ మద్రాసులో చెయ్యటానికే ఇష్టపడతారు . అలాగే ఫైటర్స్ , మద్రాసు ఫైటర్స్ కంపోజిషన్ కి , హైదారాబాద్ ఫైటర్స్ కంపోజిషన్ కి చాలా తేడా  ఉంటుంది .

అందుకే చాలా మంది మద్రాసు నుండి కొంత మందిని, హైదరబాద్ నుండి కొంత మందిని తీసుకొని ఫైట్స్ ముగిస్తుంటారు, డాన్సర్స్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది,అంతెందుకు చివరకు లైట్ మ్యాన్స్ కూడా ఇక్కడ కంటే మద్రాసు లో బాగా పని చేస్తారు అని కేమరామాన్ లు గొణుక్కోవటం చూస్తూనే ఉంటాం . డి‌టి‌ఎస్ మిక్సింగ్ లో దర్శకుడు, సంగీత దర్శకుడు అనుకున్న అనుభూతి కరెక్ట్ గా కంపించాలి అంటేమ హైదరబాద్ సిటీ మొత్తం మీద ఒకే ఒక వ్యక్తి ఉన్నారు,దురదృష్టవశాత్తూ ఆయన ఇటీవలే మరణించాడు, అంటే ఈ నెల రోజుల్లో కనీసం 10 సినిమాలు అయినా డీటీయస్ కోసం మద్రాసు వెళ్ళి ఉంటాయి అని ఒక అంచనా .

అందుకే మద్రాసులో ఉన్నప్పుడు చల్లగా, ఆరోగ్యకరంగా ఉన్న చిత్ర పరిశ్రమ హైదరబాద్ వచ్చాక ఒకరకమైన డైలామా లో పడింది, ఖచ్చితంగా చెప్పాలంటే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న తెలుగు పరిశ్రమ పునాదులు లేని అందమైన భవంతి . మరి ఈ భవంతి ఎంతకాలం నిలబడుతుందో  వేచి చూడాలి.

(To be continued..)

Comments

comments

Article Categories:
Entertainment

Comments

Menu Title