కిక్‌ను గట్టెక్కించేది అతనొక్కడే..!

Written by

హిట్‌ సినిమాలకు సీక్వెల్‌ వస్తుందంటే ఆ హంగామా మాములుగా ఉండదు. ఆ సినిమాకు క్రేజే కాదు.. బిజినెస్‌ పీక్స్‌లో ఉంటుంది. అయితే అంతకు మించిన అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది కిక్‌2. కానీ సినిమా రిలీజ్‌ దగ్గరికొస్తున్నా.. ఇప్పటికీ ప్రమోషన్‌ స్టార్ట్‌ కాలేదు. ఆగస్ట్‌ 21న రిలీజ్‌ ప్లాన్‌ చేసుకున్న కిక్‌ టీమ్‌.. ఎక్కడా ఆ హంగామాను చూపించట్లేదు. కళ్యాణ్‌ రామ్‌ ఫస్ట్‌ టైమ్‌ వేరే హీరోతో సినిమా నిర్మిస్తున్నారు. కానీ తన మూవీ విడుదలకు సిద్ధమవుతుందన్న ఇంట్రెస్ట్‌ కూడా లేనట్లు కనిపిస్తోంది. కిక్‌ 2పై కొన్ని ఇంట్రెస్టింగ్‌ వార్తలు వినిపిస్తున్నాయి. అనుకున్న దానికంటే బడ్జెట్‌ను మించిపోవడంతో.. డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డికి, కళ్యాణ్‌ రామ్‌కు తేడాలొచ్చయంటున్నారు. ఫైనాన్షియల్‌ మేటర్స్‌.. ఇద్దరి మధ్య మంటపెట్టాయని చెబుతున్నారు.

ఇపుడు కిక్‌ 2 రిలీజ్‌కు ఓ పెద్ద అండ అవసరమన్న టాక్‌ వినిపిస్తోంది. తమ్ముడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మొదట్లో అన్నకు తోడుగా ఉన్నా.. ఇపుడు తన సినిమాతో బిజీ అయిపోయాడు. ఆడియో ఫంక్షన్‌లో తప్ప ఇంకెక్కడ కనిపించలేదు. అయితే ఇపుడు కిక్‌ను గట్టేక్కించే అతనొక్కడు బాలక్రిష్ణేనట. నందమూరి ఫ్యామిలీలో ఎపుడు ముందుండేది బాలయ్యే కాబట్టి.. కిక్‌ క్రైసిన్‌ను గట్టెక్కించేది ఆయనే అంటున్నారు. బాలక్రిష్ణ రంగంలోకి దిగితే.. సినిమాకు పెద్దగా ఇబ్బందులుండవు, శ్రీమంతుడు సందడి ఉన్నా.. థియోటర్లకు ప్రాబ్లమ్‌ రాదు. సో ఇపుడు కిక్‌ను ఆదుకునే హీరో బాలక్రిష్ణే అన్న వార్తలు వినిపిస్తున్నాయి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో…

ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరమని స్టార్టింగ్‌లోనే ప్రకటించేశాడు కళ్యాణ్‌ రామ్‌. తన పటాస్‌… రీసౌండ్‌ భారీగా ఉండడంతో పాటు తమ్ముడు టెంపర్‌ కూడా దుమ్మురేపింది. దీంతో బాబాయ్‌ సపోర్ట్‌తో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో వస్తున్న కిక్‌2 కూడా నందమూరి ఫ్యామిలీ హిట్‌గా నిలిపేందుకు కష్టపడుతున్నాడు.

-పవన్

Comments

comments

Article Categories:
Entertainment
Menu Title