ఈ బాబు … అదో ర‌కం!!

Written by

అంద‌రిలా ఓపెన్ కాదు.. మిగ‌తా హీరోల్లా రిలేష‌న్ మెయింటైన్ చేయ‌డు.. సింపుల్‌గా ఉంటాడు.. స్ట్రైట్ గా త‌న ప‌ని చేసుకొని పోతాడు సూప‌ర్ స్టార్ మ‌హేశ్.

ప్ర‌తి సినిమాకు వేరియేష‌న్.. న‌ట‌న‌లో ప‌ర్ఫెక్ష‌న్ ఈ రాకుమారుడి సొంతం. మ‌హేశ్ అంద‌రిలా కాదు.. ఎక్కువ‌గా మీడియాలోనూ క‌నిపించ‌డు. కానీ అంద‌రి కంటే టూ ఢిఫ్రెంట్. సినిమాల్లో అత్యుత్సాహం చూపించే హీరోలున్నాఇండ‌స్ట్రీలో.. ఒదిగి ఉంటూనే.. సూప‌ర్ స్టార్ రేంజ్ కి ఎదిగాడు. సింగిల్ సెంటేన్స్ లో చెప్పాలంటే మ‌హేశ్ బాబు మినిమ‌మ్ స్టామినా.. మిగ‌తా బాబుల మ్యాగ్జిమ‌మ్ తో స‌మానం. మ‌హేశ్ బాబు గురించి చెబుతుంటే ఎగ్జాగిరేష‌న్ అనుకుంటారేమో.. కానీ మ‌నోడిని చూస్తే ఎగ్జాక్ట్ ఉన్నాడనిపిస్తుంది. ఈ జ‌న‌రేష‌న్ హీరో్ల్లోనూ అదో ర‌కం స్టార్ మహేశ్. సిక్స్ ప్యాక్ ఉంటుంది.. కానీ టీ ష‌ర్ట్ లోప‌లే ఉంటుంది. బాడీ బ‌య‌టికి క‌నిపించేలా ఉండాలి కానీ బ‌ట్ట‌లిప్పి చూపించాల్సిన అవ‌స‌రం లేద‌నేది ప్రిన్స్ సూత్రం. సీన్ ఎంత వ‌ర‌కు అవ‌స‌ర‌మో.. అక్క‌డివ‌ర‌కే న‌టించ‌డం ఇత‌ని స్పెష‌ల్.

అతికి పోడు.. అన‌వ‌స‌ర విష‌యాల జోలికి అస్స‌లు వెళ్ల‌డు. టాలీవుడ్ లో క్యారెక్టరైనా.. క‌మిట్మెంట్ అయినా మ‌హేశ్ త‌ర్వాతే ఎవ‌రైనా.. అనేంత‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మ‌హేశ్ మ్యాసివ్.. అత‌ని క్రేజ్ మైండ్ బ్లోయింగ్… ప‌ర్ఫామెన్స్ మెస్మ‌రైజింగ్. మ‌హేశ్ బాబు ఎపుడు నిజాయితీగా ఉంటాడు.. సినిమా క‌లెక్ష‌న్ల గురించి అత‌నికి అవ‌స‌రం లేదు.. సినిమా ఆడిందా.. నిర్మాత‌లు సేఫా.. అభిమానులకు న‌చ్చిందా.. త‌న సినిమలు ఫ్లాప్ అయితే త‌న‌దే బాధ్య‌త అంటాడు.. హిట్టైతే డైరెక్ట‌ర్ కి క్రేడిట్ ఇస్తాడు. మీరు బాగా న‌టించారంటే … నాదేం లేదండి.. డైరెక్ట‌ర్ చెప్పింది చేశాను అనే.. హీరో మ‌హేశ్ బాబు ఒక్క‌డే. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల‌ను కూడా స‌ర్ అని సంబోధించే సంస్కారి ఈ శ్రీమంతుడు.

ఏ హీరో సినిమా అయినా స‌రే న‌చ్చితే అభినందిస్తాడు.. త‌న సినిమా ఫ్లాప్ అయితే ఆ విష‌యాన్ని బ‌హిరంగగానే చెప్పేస్తాడు. ఈ సూప‌ర్ స్టార్ ప్ర‌జెంట్ జ‌న‌రేష‌న్ వండ‌ర్. మ‌హేశ్ సింప్లిసిటీకి ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. నేష‌న‌ల్ వైడ్ పాపులారిటీ ఉన్న రిజీన‌ల్ స్టార్. మ‌నోడి యాడ్ ఎండార్సింగ్ లే మ‌నోడి రేంజ్ ఏంటో నిరూపిస్తున్నాయి. థ‌మ్సాప్ కి నేష‌న‌ల్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన సౌత్ హీరో మ‌హేశే.. బాలీవుడ్ హీరోయిన్లందరూ ఈ అంద‌గాడితో న‌టించాల‌ని ఉత్సాహ ప‌డుతుంటారు. కానీ మ‌నోడు మాత్రం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ దాటి బ‌య‌టికి వెళ్ల‌నంటాడు.. మాములుగా సినిమా హిట్టైతే ర‌చ్చర‌చ్చ చేసే హీరోలెంతో మంది ఉన్నారు. టీవీల ముందుకొచ్చి హంగామా చేస్తారు.. కానీ శ్రీమంతుడు బ్లాక్ బ్లాస్ట‌రైనా.. సైలెంట్ గా ఉన్నాడు. టాలీవుడ్ దొరికిన అణిముత్యం మ‌హేశ్ బాబు. సింగిల్ హ్యాండ్ తో సినిమాను గ‌ట్టెక్కించే అతికొద్ది హీరోల్లో మ‌హేశ్ బాబు ముందుంటాడు.

40 ఏళ్ల వ‌య‌స్సుల్లోనూ పాతికేళ్ల య‌వ్వ‌నం సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుది. న‌ల‌భై ఏళ్ల యువ‌కుడికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.

Srimanthudu Official Theatrical Trailer HD || Mahesh Babu, Shruthi Haasan

Comments

comments

Article Categories:
Entertainment
Menu Title