అమితాబ్… రజనీ… ఆ తర్వాత బాలక్రిష్ణే…

Written by

సినిమా హీరోలవ్వడం వేరు. హీరోలే సినిమాగా రావడం వేరు. మొదటికి ఎవరైనా కావొచ్చు. రెండోది జరగాలంటే స్టార్ స్టేటస్, స్టామినా మించి కల్ట్ లెవెల్ కి ఎదిగిపోవాలి. అప్పుడే సాధ్యం. అమితాబ్, రజనీకాంత్ లాంటి వాళ్లది కల్ట్ లెవెల్. ఇపుడు తెలుగులో ఆశ్చర్యం అనిపించే న్యూస్ ఒకటి కనిపిస్తోంది. డెప్త్ ఉన్న సినిమాల హీరో నాని ఇపుడు కొత్త మూవీ మొదలు పెట్టాడు. అందులో హీరో బాలక్రిష్ణ ప్యాన్. అందుకే ఆ సినిమాకి జై బాలయ్య అని పెట్టాడు. ఇపుడు హిందూపూర్ పరిసరాల్లో షూటింగ్ కూడా జరుగుతోందట. మా బాలయ్య కూడా కూడా తండ్రి అంతటి వాడైపోయాడంటూ ఫ్యాన్స్ ఆనందబాష్పాలు తుడుచుకుంటున్నారు సీమలో !

అసలు స్టోరీ ఏంటి ?

ఫ్యాన్స్ స్టోరీలతో ఇపుడు సినిమాలు రావడం ట్రెండ్ అయిపోయింది. షారుక్ కూడా ఫ్యాన్ పేరుతో ఓ సినిమా తీస్తున్నాడు. అసలు స్టార్ ని కలిసేందుకు ఓ సామాన్యుడు పడే కష్టమే FAN సినిమా. ఇలాంటిదేదో చూసి స్ఫూర్తి పొందారో లేదంటే మరోటో తెలియదు గానీ ఇపుడు నానీ జై బాలయ్య లైన్ మీద షూట్ మొదలుపెట్టేశాడు. ఆగడుతో దెబ్బతిన్నాక… గ్యాప్ తీసుకొని 14 రీల్స్ చేస్తున్న సినిమా ఇది. అన్నీ ఆలోచించి ప్రస్తుతం ఉన్న వాతావరణం, ట్రెండ్ అన్నీ పసిగట్టి అడుగేస్తామన్న నిర్మాతలు ఇప్పుడు సర్ ప్రైజింగ్ గా ఈ డెసిషన్ కొచ్చారు. మరి నిజంగా థ్రిల్ ఇచ్చేందుకు బాలయ్యని కూడా ఇందులో గెస్ట్ రోల్ లో తీసుకొచ్చినా రావొచ్చంటున్నారు.

లెజెండ్ లాంటి ఎనర్జిటిక్ హిట్ వచ్చాక… సినిమాటిక్ గా బాలయ్యలో పునరుత్తేజం వచ్చింది. బాలయ్య డైలాగులతో మేనరిజమ్స్ ఏకంగా భారీ భారీ హిట్ ఇచ్చే స్టఫ్ అయిపోయాయ్. శౌర్యం లాంటి సినిమాలు చూస్తే ఆ సంగతి అర్థమైపోతోంది. మళ్లీ ఇపుడు జై బాలయ్య ప్రయత్నం. నాని యంగ్ హీరోస్ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న నటుడు. ఏం చేసినా ఏదో కాస్త కొత్తదనం తప్పనిసరి అనే టైప్. మరి ఇందులో ఏం చూపించబోతున్నాడు ? ఏకంగా చేతి మీద బాలయ్య అనే పచ్చబొట్టుతో కూడా కనిపిస్తాడని అంటున్నారు. మరి ముందు ముందు ఇంకెన్ని సిత్రాలు చూపిస్తాడో !

అమితాబ్ అభిమానుల బ్యాక్ గ్రౌండ్ లో ఇప్పటి వరకూ ఏడెనిమిది సినిమాలు వచ్చుంటాయ్. లేటెస్ట్ గా అనురాగ్ కశ్యప్ కూడా ట్రై చేశాడు. సౌత్ రజనీ మానియా కూడా అంతే ! స్టార్ హీరోలు కూడా రజనీ ఫ్యాన్స్ మని చెప్పుకుంటారు వాళ్ల సినిమాల్లో. రజనీ పంచ్ డైలాగో సీనో పెట్టడం కూడా కామన్. ఇక తెలుగులో చిరంజీవి కూడా ఇదే స్టేటస్ ఉండేది. చిరు ఫ్యామిలీ హీరోల సినిమాలతోపాటు మిగతా వాళ్లు కూడా ఫాలో అయ్యారు. ఇక జై చిరంజీవ, శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ లాంటి సినిమాలొచ్చాయ్ కానీ బ్యాక్ గ్రౌండ్ వేరు. చిరంజీవా… మెగా స్టార్ సినిమానే. శీను గాను…. చాలా చిన్న మూవీ. నోటెడ్ బేనర్ కాదు. హీరో కూడా కాదు. అందుకే జై బాలయ్య కాస్త డిఫరెంట్ వైబ్రేషన్ ఇస్తోంది. పైగా ఇప్పుడు రాజకీయం కూడా బాలయ్య అండ్ ఫ్యాన్స్ కి అనుకూలంగా ఉంది. ఈ మూమెంట్ లో రావడం అంటే ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ప్రతి సినిమాకీ ఏదో ఓ డిఫరెంట్ పాయింట్ పట్టుకునే నాని… మరి జై బాలయ్యలో ఏం చేస్తాడు… ఏం చెప్తాడో చూడాలి.

Comments

comments

Article Categories:
Entertainment
Menu Title