కుప్పం నియోజకవర్గం అనగానే అందరికి గుర్తుకు వచ్చేది చంద్ర బాబు నాయుడి కంచుకోటని. అలాంటి కంచుకోటలో ప్రస్తుతం బాబుకు ఓటమి భయంతో వణుకు పుడుతోంది. అది ఈరోజు కుప్పంలో చంద్రబాబు సభతో తేటతెల్లం అయింది. చంద్ర బాబు గత 40 ఏళ్లుగా కుప్పంను సొంత నియోజవర్గంగా చేసుకొని తన రాజకీయాలను రాష్ట్రమంతట చేస్తున్నారు. ఎప్పుడైతే వైఎస్సార్సీపీ పార్టీ పుట్టిందో ఆరోజు నుండి కుప్పంలో బాబుకు ఎదురీత మొదలు అయింది. 2014 లో కొద్దిగా తగ్గిన మెజారిటీ 2019 […]
రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ప్రకటన తర్వాత ప్రచారం ఆపేసిన అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు. ఎన్నికల ప్రక్రియ మొదలైతే చాలు గతంలో జరగని సంఘటనలు బోలెడు చూస్తూనే ఉంటాం, కానీ ఇది అన్నిటికంటే భిన్నమైంది అని చెప్పొచ్చు. కూటమి పొత్తులో భాగంగా బీజెపీ రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకటించింది. అభ్యర్థి ప్రకటన జరిగిన వెంటనే రాజంపేట పార్లమెంట్ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మూకుమ్మడిగా ప్రచారం ఆపేశారు. పార్లమెంట్ సీటు […]
బీజేపీ టీడీపీ జనసేనల ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో స్పెషల్ స్టేటస్ పెట్టాలి అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నెల్లూర్ పార్లమెంట్ అభ్యర్థి విజయ సాయి రెడ్డి సవాల్ విసిరారు.ఈ సందర్బంగా నెల్లూర్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే పనిని ఈ కూటమి ఎట్టి పరిస్థితిలోనూ చేయదు అని మండి పడ్డారు. ప్రజలుకు మేలు చేకూర్చే ఎటువంటి పని ఈ కూటమి చేయదు అని పేర్కొన్నారు. 2014 లో ఇదే కూటమి అనేక […]
వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాస్ ఇమేజ్ ఎక్కువ.. ఊరి పేరు చెబుతూ చేతిని ఊపే సమయంలో ప్రజల నుంచి వచ్చే ఉత్సాహం ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రజాసంకల్ప యాత్ర, 2019 ఎన్నికల సమయంలో జగన్ సభలకు జనం పోటెత్తారు. కనుచూపు మేర జనమే కనిపించేవారు. మళ్లీ ఆరోజులు వచ్చేశాయి. 2024 ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రంలోని నాలుగుచోట్ల సిద్ధం సభలు పెట్టింది. వీటికి లక్షల మంది తరలివచ్చారు. ఈసీ షెడ్యూల్ ప్రకటించాక […]
టికెట్ల కేటాయింపులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణి ప్రదర్శించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు అవాక్కవుతున్నారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న వారి విషయంలో రూల్స్ పెట్టిన బాబు కొందరి విషయంలో మాత్రం బ్రేక్ చేశారు. ఈసారి కూడా గెలిచే పరిస్థితి లేదని నారా వారు జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇది టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఏ మాత్రం ఇష్టం లేదు. అయినా కాదనలేని పరిస్థితి. కుటుంబానికి ఒక టికెట్ ఇస్తామని, […]
తెలుగుదేశం పార్టీ వరుసగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన పనులు చేసుకుంటూ పోతుంది. ఈసారి గెలవకపోతే మళ్ళీ తన జన్మలో అధికారాన్ని అందుకోలేనని నిర్ణయించుకున్న బాబు కూడా ఈ చర్యలను ఆపించకుండా వేడుక చూస్తున్నారు. తీవ్ర అసంతృప్తితో, గత అయిదేళ్ళుగా అధికారానికి దూరమయి మొహం వాచిపోయి ఉన్న టీడీపీ అనుచరులు కూడా అధికారాన్ని ఎలా అయినా చేజిక్కించుకోవాలనే ఆశతో తప్పుడు దారుల్లో తెగబడుతున్నారు. మొన్నటి వరకూ అనుమతులు తీసుకోకుండా సభలు నిర్వహించి, అభ్యంతరం తెలిపిన అధికారులపై దాడులు చేసినందుకు […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. ఇటీవలే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ చిత్రాన్ని ప్రారంభించిన రామ్ చరణ్ వెనువెంటనే ఆర్సీ 17 ను కూడా ప్రకటించడం విశేషం.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విభిన్న చిత్రాలను రూపొందించే సుకుమార్ తో మరోసారి రామ్ చరణ్ పని చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందబోయే ఈ మూవీని హొలీ సందర్భంగా ప్రకటించడం విశేషం. కాగా గతంలో రామ్ చరణ్ సుకుమార్ […]
వాలంటీర్లపై టీడీపీ దుష్ప్రచారం ఆగడం లేదు.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటి గడపకు చేరువ చేసేందుకు సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. కాగా మొదటినుండి వాలంటీర్ వ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన టీడీపీ నాయకులు తాజాగా మరోసారి వారిపై బురదజల్లేందుకు ప్రయత్నించారు. వలంటీర్లను స్లీపర్ సెల్స్ & టెర్రరిస్టులంటూ టీడీపీ నేత బొజ్జల సుధీర్ తీవ్రమైన విమర్శలు చేసారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. […]
రానున్న సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే 18 స్థానాలకు అభ్యర్థులును ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి వ్యతిరేఖ గాలులు వీస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేయదలచిన ఒక అయిదు, ఆరు నియోజక వర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజక వర్గాలలో జనసేన నాయకులు, జన సైనికులు నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు.ఒక నియో జక వర్గంలో ఒక నాయకుడిని నాలుగు సంవత్సరాలు పార్టీ కోసం పని చేయించుకొని […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. మరికొద్ది రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా అనుమానాస్పద వాహనాలను ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో లోకేష్ వాహనాన్ని కూడా ఆపి పోలీసులు తనిఖీ చేశారు. కానీ పోలీసులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అవడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. డీజీపీకి టైమ్ దగ్గర పడింది అంటూ ఆయన […]