ఆయన నిద్రపోడు… ఇంకెవర్నీ నిద్రలేపడు… దటీజ్ చంద్రబాబు…

Written by
chandrababu-naidu

పర్ఫెక్ట్ టీమ్ లో యావరేజ్ ప్లేయర్ కూడా అద్భుతంగా ఆడతాడు. అద్భుతమైన ఆటగాడు కూడా యావరేజ్ టీమ్ లో సగటు ఆటగాడి లాగే కనిపిస్తాడు. మిల్లీనియమ్ మొదట్లో వెస్టిండీస్ కి లారా కెప్టెన్సీ మీద ఆసీస్ సారధి స్టీవ్ వా కామెంట్ ఇది. లారా క్వాడ్రాఫుల్ (400) సెంచరీ చేసి అప్పటికి ఎన్నో రోజులు కాలేదు. అంతటి ఆటగాడు కూడా సగటు ఆటగాళ్ల మధ్య తేలిపోయినట్టు కనపిించేసరికి కరీబియన్ సిరీస్ లో స్టీవ్ వా చేసినకామెంట్లు. స్టీవ్ కేవలం క్రికెట్ టీమ్ కి కెప్టెన్ మాత్రమే కాదు. స్పోర్ట్స్ వరల్డ్ కి మైల్ స్టోన్స్ సెట్ చేసిన మెంటర్. అద్భుత ఫలితాలు సాధించిన

ఎంట్రప్రెన్యూర్. ఛారిటబుల్ యాక్టివిటీస్ లో ఛాంపియన్. మెనీసైడెడ్ పర్సనాలిటీ. అందుకే స్టీవ్ చేసిన కామెంట్స్ కి అంత వెయిటేజ్. ఆలోచించాల్సిందే !

ఇప్పుడు స్టీవ్ గా ఎందుకు ? ఆ కామెంట్లు మనకి సరిగ్గా సరిపోతాయనిపిస్తోంది టీవీలో కొన్ని దృశ్యాలు చూస్తుంటే. పుష్కరాల పేపర్ క్లిప్పింగ్స్ చదువుతుంటే ! ఓ సీఎం రేవుల్లో తిరిగి పుష్కరాల పనులు పరిశీలిస్తాడా ? భక్తులతో దగ్గరుండి మాట్లాడుతూ మంచీచెడ్డా కనుక్కుంటాడా ? ఒకట్రెండు రోజులు కాదు… మొత్తం 12 రోజులూ ! ఏం జరుగుతోంది ? రాజకీయ నాయకుడిగా కన్నా అడ్మినిస్ట్రేటర్ గానే ఎక్కువ మార్కులు పడే చంద్రబాబు ఇలాంటి సందిగ్ధంలో పడటం చిత్రంగా కనిపిస్తోందిప్పుడు.

జరగకూడని ఘోరం జరిగిపోయింది. 29 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయ్. వైభవంగా మొదలైన పుష్కరాల్ని వెంటాడే విషాదమే ఇది. అయితే మాత్రం మనం ఏంనేర్చుకున్నాం? అసలు అలా ఎందుకు జరిగింది ? ఏపీలో చంద్రబాబు తప్ప పనిచేసేవాళ్లెవరూ లేరా ఇంకా ? కేబినెట్ ఏం చేస్తున్నట్టు ? గోదారి గట్టున మకాం పెట్టిన మంత్రుల జవాబుదారీ ఎటు పోయింది ? ఇవన్నీ సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు. చంద్రబాబు కంట నీరు పెట్టుకోవడం చూస్తే గుండె తరుక్కుపోతోందంటున్నారు పీఠాధిపతులు. సగటు యాత్రికులు. ఆయనేం చేత్తారండి… ముఖ్యమంత్రిది అవ్వుద్దా బాధ్యత… ఎంత బాగా చేశారని… ఇంతా చేసి ఏడుస్తంటే ఏంటోగా ఉందండి… టీవీలో ఓ  భక్తురాలి స్పందన ఇది. ఇలాంటి మాటలు

సానుభూతి మిగిలిస్తేనో…ముఖ్యమంత్రే రేవులో ఉండి పనిచేస్తున్న అనుభూతిని రగిలిస్తేనో జరిగిపోవు పనులు. కన్నీరొస్తే కాన్ఫిడెన్స్ కరిగి నీరైపోద్ది. కన్నీరు తుడవాలి కానీ కార్చకూడదు. ఓ లీడర్ కచ్చితంగా ఫాలో కావాల్సిన ప్రిన్సిపల్. చంద్రబాబుకి ఇది తెలియదని కాదు. కానీ ఫాలో అయ్యే వీలు లేకపోయిందని ఆయన అనుకుంటున్నారు అంతే ! ప్రస్తుతం ఏపీలో పరిస్థితులకి అసలు కారణం ఇదే !

ఏపీకి జిందా తిలిస్మాత్ పనిచేస్తుందా ? 

అన్ని రోగాలకీ ఒకటే మందు జిందాతిలిస్మాత్ అని ఆ మధ్య ఓ యాడ్  వచ్చేది. ఏపీ విషయంలో చంద్రబాబు రోల్ కూడా అలాగే అయిపోతోంది ఉన్నకొద్దీ ! మంచిదే ! సీఎం పర్యవేక్షణ పాత్రత ప్రతివిషయంలోనూ ఉండడం. అదే బలం కూడా ! కానీ అదే బలహీనత కాకూడదు. తొక్కిసలాట జరిగిన తర్వాత రియాక్షన్స్ చూస్తే ఇలాగే అనిపించింది. అందరూ సీఎంని బాధ్యుణ్ని చేస్తారా ? విపక్షాలన్నీ ఆయన పైనే ఎందుకు గురిపెట్టాయ్. ఇక్కడే లాజిక్కుంది. ఎందుకంటే పనిచేస్తున్నది ఆయనొక్కడే. కనిపిస్తున్నది ఆయనొక్కడే. అదే టీమ్ ఉండుంటే సమర్థులెవరైనా రంగంలోకి దిగి అసలుదుర్ఘటన జరక్కుండా ఆపగలిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అది లేకపోవడమే అసలు సమస్య.

జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్… మాస్టర్ ఆఫ్…? 

పెట్టుబడులకోసం విదేశీ టూర్లకి ఆయనే. కేంద్రంనుంచి నిధులు రాబట్టేందుకు శాఖలవారీ రిపోర్టులు తీసుకునివెళ్లేది ఆయనే. పోర్ట్ ఫోలియో రివ్యూలు ఆయనే చేయాలి. అధికారులతో సమీక్షలు ఆయనే జరపాలి. ఆఖరికి ఎమ్మెల్యేలు కొంపమీదకి తెచ్చే ఇసక తగువులు కూడా తీర్చాల్సింది ఆయనే ! పార్టీలో కొట్లాటల నుంచి రాజధాని లేఅవుట్ల వరకూ అంతా ఆయనే అయితే పనులు జరుగుతాయా ? సర్వాంతర్యామి అంటే అర్థం డ్రైవింగ్ నుంచి పంక్చర్లేసే పని వరకూ ఆయనే చేస్తాడని కాదు. చేయిస్తాడని. చంద్రబాబు మిస్ అవుతున్న లాజిక్ ఇదే. ఎంత పని చేసినా…ఎంత కొత్త ప్లాన్స్ పట్టాలెక్కించాలనుకుంటున్నా…. గ్రౌండ్ లెవెల్లో దెబ్బ పడుతోంది. గోదావరి పుష్కరమైనా అంతే…పరిపాలనైనా అంతే !

ఏం చేయాలి బాబూ…?

నేం నిద్రపోను… మిమ్మల్ని నిద్రపోనివ్వను అనే రోజులు పోయాయ్ అని ఆయన అనుకుంటున్నారు. అందుకే అందులో ఆయన ఫస్ట్ హాఫ్ ఫాలో అవుతున్నారు. నిద్రపోవట్లేదు. మిగతావాళ్లతో కూడా అలాగే పనిచేయించాలి. అన్నిటికీ మించి సమర్థమైన టీమ్ సెట్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఇది. జనం అర్థం చేసుకున్నారు. పరిస్థితి ఏంటో… కళ్ల ముందు కనిపిస్తోంది ఎక్కడున్నామో..పరిమితులు తెలుసు. కొత్తగా ఎవరి అనుమతులు అక్కర్లా ఏ పనిచేయాలన్నా…! ప్రజల ఆశీస్సులున్నప్పుడు మిగతా అడ్డంకులన్నీ పెద్ద లెక్కే కాదు ! ఆశల ప్రయాణం ఇప్పుడే మొదలైంది. బలహీనతేంటో బైట పడుతోంది. సరిదిద్దుకునేందుకు సమయం ఉంది. పునాదులు పటిష్టంగా ఉంటేనే

నిర్మాణం నిబ్బరంగా చేయగలం. మరి ఆ నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిన పాలుపంచుకోవాల్సిన టీం ఇంకెంత గొప్పగా ఉండాలి ? ఉందా ? మీ కేబినెట్ కి మీరెన్ని మార్కులేస్తారంటే రాజకీయాలీదిన చంద్రబాబు సమాధానం చెప్పలేరిప్పుడు. వాస్తవం. సమర్థులైన నాయకులే ఏపీకి సైనికులు. అందుకే మీకు పట్టంగట్టింది. ఆ జెండా నిలబెట్టాలంటే విజన్ కి తోడయ్యే లోతైన ఆలోచన… కాంప్రమైజ్ కాని కమిట్మెంట్ ఉన్నవాళ్లు ఉండితీరాలి. అన్నిటికీ మించి ఈక్వేషన్స్ లెక్కలు పక్కనపెట్టండి. మీరేం బంతి భోజనాలు వడ్డించడం లేదు అందరినీ సంతృప్తి పరచడానికి.

సమస్యల్ని ఎదురొడ్డి నిలబడాలన్నా ఏపీ చేస్తున్న యుద్ధం గెలవాలన్నా కవచంలా కాసుకునే నాయకులు, అధికారులు ఉండి తీరాలన్న వాస్తవాన్ని కఠినంగా చూపించండి. మీ నుంచి ఏపీ ఆశిస్తున్నది ఇదొక్కటే. ఇది చేస్తే మిగతా పనులన్నీ ఆటోమేటిగ్గా అవుతాయ్.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title