కదలుదాము రండి మనం జన్మభూమికీ…

Written by

ఆంధ్రప్రదేశ్ లో తొలి పార్టీ ఆఫీస్ ఎవరిది ? సమాధానం దొరికేసిందిప్పుడు. రాష్ట్రం తొలి ఏడాది పూర్తి చేసుకున్నా పొలిటికల్ అడ్రస్ మాత్రం ఇప్పటికీ హైద్రాబాదే అని చెప్పుకోవడం ఇబ్బందిగానే ఉందన్న మాట గట్టిగా వినిపించే సరికి ఆలోచన మారుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు తమ్ముళ్లు. అందుకే టీడీపీ అడుగు ముందుకేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని మించిన హంగులతో… కొత్త పార్టీ ఆఫీస్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తున్నాయ్. రాజధానికి పునాది పడీపడగానే… ఆఫీస్ కి కూడా కొబ్బరి కాయ కొడతారని టీడీపీ వర్గాలంటున్నాయ్.

రాష్ట్ర విభజన తర్వాత పార్టీలన్నీ విజయవాడకో గుంటూరుకో తరలిరాక తప్పని పరిస్థితి. స్థలం కోసం కొందరు… ఇప్పుడే వచ్చి ఏం చేస్తాంలేని కాంగ్రెస్ లాంటి పార్టీలు అనుకొని ఏడాదిగా సాగదీస్తున్నాయ్. తెలంగాణలో సీన్ మారవడం వల్లో.. లేదంటే ఏపీ మీద దృష్టి పెట్టాలని ఇప్పటికైనా

భావించడం వల్లనో టీడీపీ ముందు రంగంలోకి దిగుతుంది అంటున్నారు. అయితే ఇక్కడ బాబు – లోకేశ్ మధ్య ఆఫీస్ ఎక్కడ పెట్టాలనే దానిపై

చర్చ కాస్త గట్టిగానే నడుస్తోందంటున్నారు. చంద్రబాబు బెజవాడవైపు మొగ్గుచూపుతున్నారనేది ట్రస్ట్ భవన్ టాక్. అధికారిక కార్యకలాపాలు అటు గుంటూరులో … రాజకీయ వ్యవహారాలు ఇటు బెజవాడలో అన్నట్టుగా ఉంటుందనే ఆయనలో ఆయన మనసులో ఉందేమో ! లోకేశ్ మాత్రం రెండూ ఒకే చోట కేంద్రీకృతమైనట్టుగా ఉండాలని… గుంటూరే అనువైన ప్రాంతమని భావిస్తున్నారని చెబుతున్నారు.

రాజధాని నిర్మాణం మొదలు అయ్యీ కాగానే… స్థలాలు కేటాయింపులు లాంటి వ్యవహారాలపై దృష్టి పెడతారని అప్పుడే పార్టీ కార్యాలయం రూపు రేఖలకి సంబంధించిన వివరాలు కూడా తెలుస్తాయని అంటున్నారు. ఇప్పటికైతే ఈ సమాచారం కోస్తా లైఫ్ ప్రత్యేకం. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ముందుండాలంటే నిర్ణయం కూడా అందరికన్నా ముందరే తీసుకోవాలన్న ఆలోచనైతే టీడీపీ నాయకత్వంలో కనిపిస్తోంది, అటు తర్వాత మిగతా పార్టీలు కూడా కదులుతాయేమో చూడాలి. విపక్షం వైసీపీ మాత్రం ఇంటికన్నా గుడి పదిలం అన్నట్టు హైద్రాబాద్ అయితే నయం ఏపీలో పరిస్థితి ఎలా ఉంటుందో అన్నట్టు ఆలోచిస్తోందా అంటూ కన్ఫర్మేషన్ కి ముందే కవ్విస్తున్నారు తమ్ముళ్లు. చూడాలి మరి పార్టీలు ఏపీలోకి ఎప్పుడు దిగుతాయో !

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title