అద్భుతాలకు అడ్రస్ అమరావతి

Written by

వజ్రాల్లో కోహినూర్ లా… కార్లలో రోల్స్ రాయిస్ లా… దేవతల్లో ఇంద్రుడిలా… రాజధానుల్లో అమరావతి అలరారబోతోందన్న అంచనాలు పెరిగి ఆకాశాన్నంటుతున్నాయ్. సీడ్ కేపిటల్ పడీపడగానే శాఖోపశాఖలు విస్తరిస్తుందని విరాజిల్లుతుందన్న ఆకాంక్షలు పెరిగిపోతున్నాయ్. సింపుల్ గా ఓ మాటలో చెప్పాలంటే ఇది మహిష్మతిని మించిన అద్భుతం. ఇదే ఆధునిక అమరావతి. రాయల్ క్రౌన్ లాంటి కేపిటల్… దానికి మద్దతుగా ఏడు ప్రాకారాల్లాంటి మినీ నగరాలు. కేపిటల్ సామర్థ్యం ఏంటో చెప్పడానికి ప్రణాళికలో ఈ ఒక్క పాయింట్ చాలు. మిగతా ప్రాంతాల్ని కలుపుకొంటూ ఇంజిల్ లా రాష్ట్రాన్ని నడిపించేందుకు రాజధానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలన్నీ అమర్చే ఎనర్జీ కనిపిస్తోందీ వ్యూహంలో !

పాపిట దువ్వినట్టు కనిపిస్తున్న రోడ్లు.. ఆకాశాన్ని అందుకోవాలన్నట్టు ఎదిగిన భవనాలు… తీర్చిదిద్దిన లేఅవుట్లు…ఐటీ, ఫినాన్స్ అడ్మినిస్ట్రేషన్, సిటిజన్ లివింగ్ ఇలా ఎక్కడికక్కడ ప్రత్యేకించిన ప్రాంతాలు. అహో…అమరావతి ఆధునిక అద్భుతం. ఇది ఆంధ్రప్రదేశ్ కే కాదు ఇండియాకి కూడా ఓ కిరీటం కాబోతోందని అనిపిస్తోంది. మాకూఇలాంటి రాజధాని ఒకటుందని ఇండియా సగర్వంగా చెప్పుకోవచ్చని తొలిదశ ప్లాన్ బైటకి రాగానే విశ్వాసం బలపడుతోంది. కొత్త ఆకాంక్షలకి కబురెడుతోంది.

కేపిటల్ అంటే ఫెసిలిటీస్ కి కేరాఫ్ లాంటి గ్రేటర్ మునిసిపాలిటీ. అన్ని హంగులూ ఉంటాయ్ కాబట్టి పరిపాలన అక్కడి నుంచి జరుగుతుంది. అంతేనా ? రాజధాని రాష్ట్రానికి గుండెకాయ. రాష్ట్రం ఎలా ఉంటుందో ఫ్యూచల్ ఎలా ఉంటుందో చెప్పేందుకు నమూనా కూడా. కేపిటల్ అంటే ఫేస్ ఆఫ్ ద స్టేట్. అన్ని హంగులూ అంటే అసలు ఏముండాలి… వరల్డ్ క్లాస్ కేపిటల్ కావడానికి అమరావతికి ఉన్న అర్హతలేంటి ? ఈ సంగతి తెలియాలంటే అసలు ప్రపంచస్థాయి రాజధాని ఎలా ఉంటుందో తెలియాలి. అదే డీటైల్డ్ గా చూద్దాం ! మథించి… శోధించి.. అద్భుతాలని తేల్చిన ప్రపంచ టాప్ టెన్ కేపిటల్స్ లో మరీ ప్రత్యేకంగా చెప్పుకునేవి ఓ ఐదారున్నాయ్. భౌగోళిక ప్రాధాన్యం, సదుపాయలు అంతకు మించిన ప్రత్యేకతలు వాటికున్నాయ్. అందుకే అవి అద్భుతాల్లో కెల్లా అద్భుతాలయ్యాయ్. అవి ఎందుకు అద్భుతాలయ్యాయో.. వాటి ప్రత్యేకతలేంటో బ్రీఫ్ గా చూద్దాం. ఆ తర్వాత అమరావతి విషయానికొద్దాం

రోమ్ : 

View-of-Rome అద్భుతాలకు అడ్రస్ అమరావతి
ప్రపంచ నాగరికత పురుడు పోసుకున్న పట్టణాల్లో ఒకటైన రోమ్ ఇప్పటికీ అంతే ప్రత్యేకం. అంతే విశిష్టం. చిన్న కేపిటల్. చింతలేని కేపిటల్ అనేది రోమ్ బేస్ లైన్. ఇపుడు కాదు వేల ఏళ్ల కిందటే. ఓ రకంగా ఇది వెస్ట్రన్ ఫిలాసఫీ. రాజధానంటే లిమిటెడ్ నంబరాఫ్ పీపుల్ ఉండే ప్రాంతం అని ఓ అభిప్రాయం స్థిరపడిపోయింది. కులీనులు అంటారు వీళ్లని. రాజకీయంగా పలుకుబడి, పెద్దరికం ఉన్నవాళ్లు మాత్రమే ఉంటారిక్కడ. తర్వాత  మిగతా యూరోపియన్ నగరాలు కూడా  అదే లైన్ మీద నిర్మించారు. అయితే… చూపు తిప్పుకోనివ్వని నిర్మాణాలు, కలోసియం లాంటివన్నీ ఓ మహాద్భుతాన్ని మన ముందు నిలుపుతాయ్. ప్రపంచంలోనే రోమ్ ఓ ఐ కాచింగ్ సిటీ. రోమ్ ని చూస్తుంటే బంగారు హారం మన చుట్టూ అల్లుకున్న ఫీలింగ్ కల్గుతుందంటూ వైభవాన్ని వర్ణిస్తారు చాలా మంది. అందుకే ఇది మోస్ట్ బ్యూటిఫుల్ కేపిటల్ లిస్ట్ లో ఉండి తీరుతుంది.

లండన్ :

london-night అద్భుతాలకు అడ్రస్ అమరావతి
ప్రపంచాన్ని తనలో ఇముడ్చుకున్న నగరం లండన్. విశ్వ సంప్రదాయానికి మీనియేచర్ లాంటి సిటీ ఇది. ప్రపంచాన్ని ఏలిన ప్రఖ్యాతి అడుగడుగునా కనిపిస్తుంది. మోస్ట్ పీస్ ఫుల్ ఏరియా. ప్రాచీనతతో వెలిగిపోతూనే ఆధునికతను అద్దుకుంటూ అద్భుతమనిపించే తీరు లండన్. రీసెర్ట్ అండ్ డెవలప్ మెంట్, ఫినాన్స్, ఆర్ట్స్, ఎంటర్ టైన్మెంట్ ఇలా ప్రతి కోణంలోనూ లండన్ దృక్కోణం సింప్లీ ది బెస్ట్ అనిపిస్తుంది. అందుకే బెస్ట్ కేపిటల్ ఎలా ఉండాలంటే లండన్ లా అని చెప్పడం చాలా సింపుల్.

బెర్లిన్ :

berlin అద్భుతాలకు అడ్రస్ అమరావతి
పశ్చిమ దేశాల్లో పీస్ ఫుల్ నగరాల్లో బెర్లిన్ ముందు వరసలో ఉండి తీరుతుంది. యూరోపియన్ యూనియన్ లో రెండో అతి పెద్ద సిటీ అద్భుతాలకినిలయం. జర్మనీ రెండో ప్రపంచయుద్ధంలో నేలమట్టం అయిపోయాక అమాంతం లేచినిలబడినట్టు వేగంగా పుంజుకుందీ నగరం. మగ్గింగ్ ఇక్కడ కనిపించదు. విదేశీయుల్ని దోచుకోవడం, జాతి వైరాలతో కక్షసాధింపులు లాంటివన్నమాట. జనాభా డెన్సిటీ ఎక్కువ ఉన్నా ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా చూసుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటే బెర్లిన్ ఓ కేస్ స్టడీ. డ్రగ్స్ లాంటి వెస్ట్రన్ సెడ్ ఎఫెక్ట్స్ కి దూరంగా… అందుకోలేని స్టాండర్డ్స్ కి దగ్గరగా ఉంటుంది బెర్లిన్. అందుకే రియల్లీ సుపర్బ్.

టోక్యో :

Tokyo అద్భుతాలకు అడ్రస్ అమరావతి
సేఫ్,క్లీన్ అండ్ డైవర్సిఫైడ్ సిటీ టోక్యో. క్యోటో నుంచి రాజధాని టోక్యోకి మారి వందేళ్లు దాటింది. అప్పటి నుంచి దశలవారీగా, క్రమంగా ఎదిగింది. మధ్యమధ్యలో ధ్వంసం కూడా అయ్యింది. అయినా అపూర్వం అనిపించే రూపురేఖలు నిర్మాణం ఉన్న నగరం టోక్యో. నాజూకు నగరం అదే మన స్మార్ట్ సిటీ అనే కాన్సెప్ట్ టోక్యోని చూసే పుట్టిందా అనిపించినా ఆశ్చర్యం లేదు. నోరూరించే ఫుడ్, మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అండ్ అప్పీల్ టోక్యో స్పెషాలిటీస్ లో కొన్ని. మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ టోక్యో నైట్ వ్యూ. పగలంతా వేరు… చీకటి పడ్డాక టోక్యో చూపించే దృశ్యం వేరు అద్భుతం కళ్లు తెరిచినట్టు ఉంటుందా సిటీ. అందమొక్కటే కాదు… వ్యవస్థలన్నీ ఓ చోట కేంద్రీకృతం కావాలి… కావొచ్చు అని తెలియజెప్పిన తొలినగరం టోక్యోనే. ఫైనాన్షియల్ యాక్టివిటీ, బిజినెస్, అడ్మినిస్ట్రేషన్, యూనివర్సిటీలు, టెక్నికల్ హబ్ అన్నీ ఒకేచోట ఉంటాయిక్కడ. కేపిటల్ అంటే జనాభాతక్కువ ఉండాలన్న వెస్ట్రన్ ఫిలాసఫీని మర్చిన తొలి నగరం కూడా ఇదే. ఆ తర్వాతే సియోల్ లాంటి నగరాలు ఫాలో అయ్యాయ్. అమరావతీ అదో దోవలో ఉందిప్పుడు. భౌగోళికంగా కూడా వైవిధ్యం చాలా ఉంటుంది టోక్యోలో చుట్టుపక్కల అటవీప్రాంతమే కాదు ఫుజీ లాంటి అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయ్. మన మంగళగిరి తరహాలో ! (పోలికలో సెంటిమెంట్… టేకిట్ లైట్..)

ఇస్లామాబాద్ :

Pakistan-Islamabad అద్భుతాలకు అడ్రస్ అమరావతి

 

పాకిస్థాన్ రోగ్ స్టేట్. అరాచకానికి కేరాఫ్. ఓకే. కానీ కేపిటల్ ఇస్లామాబాద్ మాత్రం సమ్ థింగ్ డిఫరెంట్. బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ అంటారే అలాగన్నమాట. నవాబీ షాన్… మోడ్రన్ పెహచాన్… రెండు కళ్లు ఇస్లామాబాద్ కి. పాకిస్థాన్ లో షైనింగ్ జ్యూయెల్ లాంటి నగరం ఒకటి ఉందా అని ఆశ్చర్యమనిపిస్తుంది ఇస్లామాబాద్ని చూస్తే. వైశాల్యం లో తక్కువే అయినా డెప్త్ లో మాత్రం ఇస్లామాబాద్ ది బెస్ట్. ఇస్తాంబుల్, కైరో లాంటి అరబ్ నగరాలకిలేని ప్రత్యేకత ఏదో ఇక్కడ ఆకర్షిస్తుంది. సంప్రదాయంలో నిలబడి ఆధునికతవైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది పాకిస్థాన్ కేపిటల్. టాప్ ఫైవ్ బెస్ట్  కేపిటల్స్ లో ఇస్లామాబాద్ కి బెర్త్ లేదనడం కష్టం.

ఒట్టావా, మాస్కో లాంటి నగరాలూ కేపిటల్ లిస్ట్ లో ప్రత్యేకమే ! కాకపోతే వాటికి కొన్ని పరిమితున్నాయ్. పరిమితులన్నీ అధిగమించి బెర్లిన్ లాంటి ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీ… అమరావతిలో ఉండబోతోంది. రింగ్ రోడ్ కనెక్టివిటీ, మెట్రోరైల్ ఫెసిలిటీతోపాటు ఇంటర్నల్ గా రాపిడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ని చూపించబోతోంది మన రాజధాని. టోక్యో లాంటి ఐ కేచీ అప్పీల్ కనిపిస్తోంది అమరావతిలో. పరిపాలన కోసం బహుళ అంతస్థుల భవనాలు, తెలుగు వైభవాన్ని చాటే కళాకేంద్రాలకి నిలయమిది. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడంలో… ఆహ్వానించడంలో లండన్ కి ఏ మాత్రం తగ్గని రీతి, రోమ్ లాంటి చారిత్రక వైభవం కలగలుపుకొని ఆవిర్భవిస్తోంది నవ్యాంధ్ర రాజధాని. ఇస్లామాబాద్ లా సంప్రదాయబద్ధంగా కనిపిస్తూ.. ప్రపంచాన్ని మెప్పించబోతోంది మన అమరావతి. ప్రపంచ స్థాయి నగరాలకున్న వైభవాలన్నీ ఒక చోట కనిపిస్తే… ఇంత గొప్పగా ఉంటుందా అనిపించే రూపు రేఖలు ఇపుడు గ్రాఫ్ లు, డయాగ్రామ్ లు దాటి మన కళ్ల ముందుకొస్తున్నాయ్. మహోన్నత అమరావతి ఏపీ నడిబొడ్డున మొలకెత్తబోతోంది. ఇంత భారీస్థాయిలో ఆలోచించడం… ఆ ఆలోచనను పక్కా ప్రణాళికగా మలచడం, అమలు పరిచేందుకు సిద్ధపడడమే తిరుగులేని సక్సెస్. మంచి ఆలోచనచేస్తే సగం సక్సెస్ అయినట్టే అనేమాట అందుకే పుట్టింది. రాజధాని విషయంలో అక్షరాలా అదే జరుగుతోంది.

amaravathi-gov-caridar అద్భుతాలకు అడ్రస్ అమరావతి

చెప్పుకోదగ్గ భారీ పరిశ్రమ లేదు. సాఫ్ట్ వేర్ లాంటి ఇండస్ట్రీలు రావడానికి ఇంకెంత కాలం పడుతుందో ? పట్టుమని ఓ నగరం కూడా జాతీయ స్థాయిలో లేదు. ఇలా మైనస్లు తల్చుకొని మథనపడిపోతున్న ఏపీ ఆవేదనకి సమాధానం అమరావతి. పక్కవారి విద్వేషాలతో అక్కడ దెబ్బతిన్నాం మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదని మనుసులో మెదులుతున్న ఆలోచనల ఫలం అమరావతి. హైద్రాబాద్ లేకపోతే మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలి ? మహానగరం అంటే మన దగ్గరలో చెన్నై బెంగళూరో అనుకోవాలా అనుకుంటున్న వాళ్ల సందేహాలకి సమాధానం అమరావతి. భవిష్యత్ కి భరోసారా… ఆంధ్రుల సామర్థ్యానికి నమూనాగా… ప్రపంచం ఇటు చూడబోతోందని చెప్పేందుకు సింబల్ గా… ఠీవీగా కనిపిస్తోంది ఈ ఆధునిక అమరావతి. పడదోసిన కుట్రల నుంచి ఒక్కో మెట్టూ ఎక్కి శిఖలాల్ని అధిరోహించబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రైడ్… అమరావతి.

amaravathi-water-front అద్భుతాలకు అడ్రస్ అమరావతి

రాజధానంటే ప్రదేశం మాత్రమే కాదు… ప్రజలు, జీవన విధానాలు, ఆశలు, ఆకాంక్షలు కలబోసిన జీవన ప్రమాణం అని చాటి చెబుతున్నాయ్ తూర్పు తీరంలో ఉన్న కొరియా జపాన్ లాంటిదేశాలు. ఇపుడు ఏపీ కేపిటల్ కూడా అదే సందేశాన్ని ప్రపంచానికి అందించబోతోంది. విశేషాలన్నీ గుదిగుచ్చి … అచ్చుగుద్దితే అదే అమరావతి అనిపిస్తోంది లేఅవుట్ చేస్తూంటే. ఇది పట్టాలెక్కడం, మరో మూడు నాలుగేళ్లలో తొలి విడత కళ్ల ముందు కనిపించడమే మిగిలింది. ఏపీ ఆకాశమే హద్దుగా అవకాశాల్ని అందుకోబోతోందని, అంచనాలను మించిపోతోందని ఆ నమూనా చూస్తే నమ్మకం కల్గుతోంది.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title