పుష్కర సంబరంలో తేలుదామా ? వివాదంలో మునిగిపోదామా ?

Written by

అద్భుతాన్ని ఆకాశానికి వదిలేసి… రాళ్లకి కొట్టుకొని కాళ్లకి ఎదురుదెబ్బలు తింటుంటాం కొన్నిసార్లు మనం. ఎందుకంటే... తప్పులు వెదికి పట్టాలనో లేదంటే ఎవరినో తక్కువ చేయాలనో దుగ్ధతో మనశ్శాంతిని మన గొప్పదనాన్ని గోదాట్లో కలిపేసుకుంటాం. మాట వరసకి అనట్లేదు. గోదావరి పుష్కరాల గురించే ఇదంతా ! తొలి రోజు జరిగిన ఘోర తప్పిదాన్ని పదేపదే గుర్తుచేస్తూ కళ్ల ముందు వైభవాన్ని మన ప్రజ్ఞాపాటవాల్ని గాలికి ఇలా వదిలేస్తున్నామా అనిపిస్తోంది సాయంత్రాల్లో చల్లగాలికి కూర్చొని ఆలోచిస్తే! లేజర్ వెలుగుల్నిచూసి మురిసిపోయి చెప్తున్నమాట కాదిది. వాస్తవాలు తెలుసుకుందాం… కాస్త పాజిటివ్ గా ఆలోచిద్దాం అని చెప్పడమే ఉద్దేశం.

గోదారిని జానా బెత్తలతో కొలవలేం. పుష్కర ఏర్పాట్లని ఒకట్రెండు ఘటనలతో సరితూచలేం. బాధగా, భారంగా… రాజకీయంగా అయితే కాస్త నొప్పినా అనిపించినా ఒప్పుకుని తీరాల్సిందే ! విడిపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న ఏపీ… అద్భుతమనిపించే రీతిలో చేస్తోంది పుష్కర మహాసంరంభం.ప్రతి ఏర్పాటూ క్లినికల్. ప్రతి ఏర్పాటూ వరల్డ్ క్లాస్. ప్రతి అడుగులోనూ భారీతనం హుందాతనం… ఏదో తెలియని హాయిని పంచాలనే ప్రయత్నం కనిపిస్తోంది చూస్తుంటే.
11739552_968281533193037_820518570_n పుష్కర సంబరంలో తేలుదామా ? వివాదంలో మునిగిపోదామా ?

ఇలాంటి అద్భుతాల్ని కేన్వాస్ మీద తీర్చిదిద్దినంత సొగసుగా గోదారి గట్టుకు తీసుకురావడం అంటే మాటలు కాదు. సరైన ఆలోచన లేకపోతే, కమిట్మెంట్ కనిపించకపోతే పనులు ఎలా ఉంటాయో పక్కకి తొంగిచూస్తే తెలుస్తుంది. ఫోటోల్లో కళ్లకి కడుతున్నట్టున్నాయ్ తెలంగాణలో పుష్కరం
ఎంత సొగసుగా ఉందో !
11749805_968281559859701_503035634_n పుష్కర సంబరంలో తేలుదామా ? వివాదంలో మునిగిపోదామా ?

సోలార్ కుక్కర్లతో వంటలు… వేల మందికి భోజనాలు… గట్టి రాళ్లలో ఘాట్లు… ఆహ్లాదాన్ని ఎగజిమ్మే ఫౌంటెయిన్లు… లేజర్ జిలుగులు… వెలుగుల వంతెనలు కట్టే లైటింగ్ లు… ఎక్కడికక్కడ సమాచారా కేంద్రాలు…. అందుబాటులో సిబ్బంది. పాతిక లక్షల మంది భక్తులు వచ్చినా సాధారణంగా కూడా అసౌకర్యం కలగుండా చేసిన ఏర్పాట్లివి. ఒక రోజులోనో ఓ పూటలోనో అయిపోయేవి కాదు పన్నెండు రోజుల కోసం.. ఆగమేఘాల మీద అద్భుతమనిపించే స్థాయిలో తీరాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఇలాంటివి చెప్పుకుంటామా… కనీసం ఒప్పుకుంటామా ? లైఫ్ బోట్లు.. బట్టలు మార్చుకునే ఏర్పాట్లు… ఇలా ఏవి చూసినా వంకపెట్టలేని సౌకర్యాలే. అన్నిటికీ మించి తీరాన్ని, పుష్కర ఘాట్ ని కమర్షియల్ దోపిడీకి చోటులేని ప్లేస్ గా తీర్చిదిద్దాలంటే ఎంత ప్లాన్ కావాలి ? ఎంతలోతైన ఆలోచన ఉండాలి. ఇంత ఆలోచించి తీర్చిదిద్దితే మనం చెప్పుకుంటున్నామా కనీసం ? ఒక్కమాటలో చెప్పాలంటే… వాషింగ్టన్ ఒడ్డున పొటమాక్ నదికి పుష్కరాలు జరిగినా కూడా అమెరికా ఇంత అద్భుతంగా ఇంతమందికి స్వాగత సత్కారం ఇంత సమర్థంగా చేయలేదేమో ! అతిశయోక్తి కాదు.. అక్కడున్న జనం, గ్రావిటీని కొలిచి చూస్తే తెలుస్తుంది వాస్తవం.

10893834_968281683193022_1213054064_n పుష్కర సంబరంలో తేలుదామా ? వివాదంలో మునిగిపోదామా ? 11741796_968281629859694_1660481182_n పుష్కర సంబరంలో తేలుదామా ? వివాదంలో మునిగిపోదామా ? 11756490_968281573193033_1351768182_n పుష్కర సంబరంలో తేలుదామా ? వివాదంలో మునిగిపోదామా ?

ఏపీ ప్రభుత్వంతో చంద్రబాబుతో ఓ సమస్య ఉంది. ఏం చేసినా… వరల్డ్ క్లాస్ గా ఉండాలన్న తాపత్రయం, ప్రయాస కనిపిస్తాయ్. శక్తి మించి పనిచేయడం అలవాటు ముందు నుంచి. ఒకటో అరో మిస్ ఫైర్ కావడానికి కూడా కారణం ఇదే. ఓ మగువ ముఖారవిందాన్ని తీర్చిదిద్దుకున్నంత అందంగా గోదారిని సిద్ధంచేశారు. అనుకోకుండా తొలిరోజు ఓ ఘోరం జరిగిపోయింది. అక్కడే ఆగిపోదామా ? పుష్కరాలు రద్దుచేసుకుంటామా ? గోదారిలా జీవితాలు కూడా నిత్యచలన శీలమైనవే ! మిట్టపల్లాలు దాటుకుంటూ ముందుకు సాగాల్సిందే. ఆ సాగే ప్రయాణంలో గుండెను మెలిపెట్టే విషాదాలతోపాటు… చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అద్భుతంగా చేసిన ఏర్పాట్లని మన శక్తి సామర్థ్యాల్ని ఎలుగెత్తి చాటుకుంటూ, వెలుగులు విరజిమ్ముకుంటూ వెళ్లాల్సిందే !

11758980_968281589859698_312715089_n పుష్కర సంబరంలో తేలుదామా ? వివాదంలో మునిగిపోదామా ?

ఎక్కడికక్కడ రెస్క్యూ బృందాలు, లైఫ్ బోట్ లు… వచ్చే యాత్రికులకి సరిపడా ఏర్పాట్లు… ఎక్కడికో రాజమండ్రి వెళ్లాం ఇబ్బంది పడ్డాం అనే మాట లేకుండా, రాకుండా జాగ్రత్తపడాలన్న తపన ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. ప్రత్యేకించి మఖ్యమంత్రి శ్రద్ధతీసుకుంటూ ఒక్కరితో ముఖాముఖి మాట్లాడుతున్న దృశ్యం పుష్కరానికి కొత్త అందం తెస్తోంది. తొక్కిసలాట ఎంత బాధిస్తోందో చంద్రబాబు ముఖంలో కనిపిస్తోంది. మృత్యుఒడిలోకి జారిన కుటుంబాల ఆవేదన ఆయన ప్రతిచర్యలో కనిపిస్తోంది. నిజానికి యంత్రాంగం వైఫల్యమనో అధికారులు సమర్థించలేకపోయారనో చెప్పి చర్యలు తీసుకొని తంతంగం కానివ్వొచ్చు. కానీ చిత్తశుద్ధి, అంతరాత్మకి జవాబుదారీ తనం ఉన్నాయ్ కాబట్టే నా తప్పు ఉంటే మన్నించండి అంటూ చేతులెత్తి యాత్రికుల్ని వేడుకన్న దృశ్యం గోదారి తీరంలో కనిపించింది. గోదారి గుండె కూడా కరిగి నీరైపోయే సందర్భమిది. ఎప్పుడైనా, ఎవరైనా దేశంలో ఇలాంటి సన్నివేశం చూశారా ? నాయకుడైనా ఇలా వేడుకున్నాడా ?

11739724_968281649859692_818127123_n పుష్కర సంబరంలో తేలుదామా ? వివాదంలో మునిగిపోదామా ?

తలదీసి మొలేస్తారా ఏం ఈ జనం ? ఇంతకు ముందు పేలుళ్లు జరగలేదా హైద్రాబాద్ లో ? ఇప్పుడే ఎందుకు హడావుడి పడుతున్నారు ? విచారణ జరుగుతుంది… చర్యలు తీసుకుంటాం… ఇదీ నింపాదిగా… లుంబినీ, గోకుల్ చాట్ పేలుళ్లపై అప్పటి సీఎం వైఎస్ రియాక్షన్. గుండెలు మండాయ్. ఎప్పుడు ఎంతమందిమి మనం నిలదీశాం… ఆలోచించాం ? ఇక రెండోది. ఒంగోలులో ఓదార్పు యాత్ర కాన్వాయ్ కింద పడి రెండు నిండు ప్రాణాలు పోయాయ్. యాత్ర ఆగిందా ? జగన్ ని జైల్లో పెట్టారా ? మూడో ఘటన మరోటుంది. ఠాగూర్ సినిమా రిలీజ్ తొక్కిసలాట చిత్తూరులో ముగ్గుర్ని చంపేసింది. సినిమా ఆపేశారా ? వ్యాపారం చేసుకోవడం ఆపేశారా ? ఇప్పుడు పేలుతున్న, పెట్రేగుతున్న కాలక్షేపం నాయకులు అప్పుడు ఏం చేశారు ? ఇవన్నీ తొక్కిసలాటని… ఆ కుటుంబాల దు:ఖాన్ని తూచడానికో, తక్కువ చేయడానికో చెప్పడం కాదు. వాస్తవం. విషాదంతో రాజకీయం ఎలా చెలగాటమాడుతోందో చెప్పే ప్రయత్నమే ఇదంతా !

11748593_968281673193023_1781148728_n పుష్కర సంబరంలో తేలుదామా ? వివాదంలో మునిగిపోదామా ?

11749355_968290583192132_1076461586_n పుష్కర సంబరంలో తేలుదామా ? వివాదంలో మునిగిపోదామా ? 11741776_968290623192128_502412198_n పుష్కర సంబరంలో తేలుదామా ? వివాదంలో మునిగిపోదామా ? 11124202_968290576525466_1431419316_n పుష్కర సంబరంలో తేలుదామా ? వివాదంలో మునిగిపోదామా ?

పీతలు ఈతలు కొట్టినట్టు బురదలోనే స్నానాలు చేసి బాడి కాళ్లతో గట్టెక్కుతున్నారు పక్కరాష్ట్రంలో యాత్రికులు. కనీస ఏర్పాట్లు లేవు. సౌకర్యాలనేది
చాలా పెద్ద మాట అక్కడ. ఏదో డ్రోన్ కెమెరా వాడి మేమూ ఉన్నాం అని చెప్పుుకునే ప్రయత్నాలు తప్ప ఇంకేం లేవ్. నువ్ సన్మానించిన గవర్నర్, నువ్ స్నేహహస్తం చాచిన సీఎమ్మే ఉన్నారు కదా. అయినా మహారాష్ట్ర నుంచి చుక్క నీరు తెచ్చుకోలేకపోయిన చేతగాని తెలంగాణ రేవుల్లో కనిపిస్తోంది. అక్కడి ప్రభుత్వ వైఫల్యాన్ని అడ్డంగా వెక్కిరిస్తోంది. మనం మాత్రం మన ఘనతని వైభవాన్ని విస్మరిస్తూ వివాదాల ఉచ్చులో పడుతున్నాం. రొచ్చులో దిగుతున్నాం. ఇపుడు చేయాల్సింది అది కాదు.

11748715_968281729859684_157761457_n పుష్కర సంబరంలో తేలుదామా ? వివాదంలో మునిగిపోదామా ?

పుష్కరం ఓ జీవితకాల సంబరం. మళ్లీ ఎన్నాళ్లకో… అప్పటికి కిందెవరో మీదెవరో ! సంతోషిద్దాం… సంబరం చేద్దాం… చేదు కూడా జీవన ప్రవాహంలో భాగమేనని అంగీకరిద్దాం… గోదారికి నమస్కరిద్దాం… మన సౌకర్యానికి శ్రమించిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేద్దాం !

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title