మరో ఉత్తర కొరియా & దక్షిణ కొరియా – History repeats in Telugu States

Written by

ప్రపంచంలో మనిషిని పోలినమనుషులు ఏడుగురుంటారు అంటారు. అలాంటిది..ప్రాంతం లాంటి ప్రాంతాలు కనీసం రెండు మూడన్నా లేవా?

ఎందుకు లేవు. ఒకే జాతి రెండు ముక్కలైతే పరిస్థితులు ఎలా ఉంటాయో… పరిణామాలు ఎలా మారతాయో చూపించే ఉదాహరణలు అల్లంత దూరంలో తూర్పు తీరంలో కనిపిస్తున్నాయ్. కొరియాల రూపంలో ! విద్వేషం చిమ్మడమే లక్ష్యంగా ఓ దేశం.. ఎందరాపినా ఎదగడమే తెలుసంటూ మరో దేశం కనిపిస్తున్నాయ్ ఉత్తర దక్షిణాలుగా. అక్కడ దేశాలు… ఇక్కడ రాష్ట్రాలు. దిక్కుల్ని బట్టీ చూస్తే ఇక్కడా… ఉత్తరంగా ఓ రాష్ట్రం దిగువకి దక్షిణంగా మరో రాష్ట్రం. విషం చిమ్ముతూ ఓ రాష్ట్రం… వెలుగులు విరజిమ్ముతూ… పడినా పైకి లేవాలని మరో రాష్ట్రం.

కేపిటల్ కట్టుకొని పునాదుల నుంచి ప్రయాణం మొదలుపెట్టిన ఏపీకి చరిత్రతవ్వకాల్లో అద్భుతాలు బైటపడ్డాయ్. తూర్పు ఆసియా వైపు చూస్తున్న రాష్ట్రానికి అదే ప్రాంతంలో ఓ ఇన్ స్పైరింగ్ స్టోరీ కనిపిస్తోంది. అదే దక్షిణ కొరియా. పేజీలు తిరగేస్తున్నకొద్దీ ఏపీకి … దక్షిణ కొరియాకీ పోలికలు కనిపించడం కాదు బలపడ్డం మొదలైందా అనిపించింది. భౌగోళికంగా దక్షిణాన ఉండడమే కాదు తీర ప్రాంతాన్ని అద్భుతంగా వాడుకోవడం తీరంలో పచ్చదనం పరుచుకొని ఉండడం… ఫిషింగ్ ఉద్ధృతంగా సాగించడం… మూడు పంటలు పండించే భూములుండడం..ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లున్న ప్రాంతం కావడం… ఈ గవర్నెన్స్… విదేశాల్లో స్థిరపడిన జనాభా వారీగా టాప్ ఫైవ్ లో ఉండటం… ఇలా చెప్పుకుంటూ పోతే లక్షాతొంభై పోలికలు.

సియోల్ టు అమరావతి :

ముందు కొత్తగా కట్టుకుంటున్న రాజధాని సంగతి చూద్దాం. మన అమరావతి లాగే… సియోల్ కూడా 2వేల ఏళ్ల కిందటే ఆ ప్రాంతానికి కేపిటల్.

మధ్యలోనే పునరుద్ధరించినా…రష్యా అమెరికా యుద్ధంలో నేలమట్టమైంది. మళ్లీ రూపుదిద్దుకున్నది కొత్తగా దక్షిణ కొరియా ఏర్పడిన తర్వాతే !

ఇక్కడా అదే జరుగుతోంది. వేల ఏళ్ల తర్వాత మళ్లీ రాజధాని అమరావతి. కాకపోతే అక్కడ యుద్ధంలో ధ్వంసమైంది. ఇక్కడ విభజన ధ్వంసం చేసింది. మళ్లీ కట్టుకునేందుకు యుద్ధం చేస్తున్నాం. అదొక్కటే తేడా ! మిగతాదంతా సేమ్ టు సేమ్. సియోల్ కేపిటల్ ఏరియా ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్. కనీవినీ ఎరుగనంత విస్తృతిలో… జన భాగస్వామ్యంతో ప్రపంచంలోనే ది బెస్ట్ కేపిటల్స్ లో ఒకటిగా రూపుదిద్దుకుంది. సియోల్ ఆశ్చర్య పరుస్తోంది. చూట్టూ గ్రీనరీ… దాదాపు సగం జనాభా చుట్టుపక్కల ఉండేలా అద్భుతంగా ప్లాన్ చేసిన నగరం సియోల్. మన అమరావతి కూడా అచ్చం అలాంటిదే ! కోటిమంది జనాభా కోసం ప్రణాళిక..వ్యవసాయ భూములు, ప్రోసెసింగ్ యూనిట్లు…నివాస ప్రాంతాలు అందుకునేంత దూరంలోనే ఉంటాయ్. దేశంలో మరేయిత రాష్ట్రంలోనూ ఆ మాటకొస్తే మరే దేశంలోనూ ఇంత పర్ఫెక్ట్ గా లేదని గర్వంగా చెప్పుకోదగ్గ నమూనా కనిపిస్తోంది క్రిష్ణా తీరంలో ! ఏపీ ఒకప్పుడు జన్మభూమి లాంటి ప్రోగ్రామ్స్ ని దక్షిణ కొరియా నుంచి ఆదర్శంగా తీసుకున్నట్టు ఇపుడు కూడా స్పిరిట్ అందిపుచ్చుకొని ఫినిక్స్ లా ఎగరబోతోంది. ఎదగబోతోంది.

ఏం లేని స్థాయి నుంచి ఎంట్రప్రెన్యూర్ షిప్, పెట్టుబడుల్ని నమ్ముకొని ఎదిగింది సౌత్ కొరియా. పారిశ్రామిక రంగంతోపాటు జనం ఎడ్యుకేటెడ్ అవ్వడం… పశ్చిమ దేశాలతో సంబంధాలు కలిసొచ్చాయ్. వాతావరణం, ఆహ్లాదకరమైన కోస్ట్ అడ్వాంటేజ్ అయ్యాయ్. ఎలాగూ పూర్తిగా ధ్వంసం అయిపోయింది కాబట్టి.. పునాదులు నుంచి సియోల్ ని, దేశాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. మనం ఇపుడు ఆ పని చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. ఇవన్నీ భౌతిక, భౌగోళిక పోలికలు. యాటిట్యూడ్… డెవలప్మెంటల్ పాలసీల విషయంలోనూ దక్షిణ కొరియాకీ ఏపీకి బాంధవ్యాలు చాలానే ఉన్నాయ్. స్కిల్ పెట్టుబడిగా ఎదిగిన అతికొద్ది దేశాల్లో ద.కొరియా ఒకటి. టెక్నిక్, టెక్నాలజీ, టెక్నోక్రాట్ షిప్ ఉన్న దేశాల్లో ముందు వరస. ఇక్కడా అంతే ! సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్ కోర్ ఇండస్ట్రీ ఎక్కడుంటో ఏపీ రిప్రజంటేషన్ కచ్చితంగా అక్కడక్కడ ఉంది. లెక్క చూసుకోండి. రైట్ ఫ్రమ్ అమెరికా టు టాంజానియా.

ఇదంతా ఓకే. దెబ్బతినడంలో…పక్కదేశం నుంచి ఒత్తిడి,దాడి ఎదుర్కోవడంలో సాంస్కృతిక హననాన్ని ఓర్చుకోవడంలోనూ చాలా పోలికలున్నాయ్ ఏపీకి. దక్షిణ కొరియాకీ. ఉత్తర కొరియా నిజానికి పక్కలో బల్లెం కాదు కొరివి. బల్లెం అయినా దిగడంలో ఆలస్యం అవుతుంది. కొరివి అలా కాదు కాచుకోకపోతే… కాల్చుకుతింటుంది. ఇక్కడ మనం ఎదుర్కొంటున్న పరిస్థితి అదే ! అక్కడ టికాణా లేకపోయినా పక్కనోడి దుకాణాన్ని దెబ్బతీయాలని ఉత్తరకొరియా ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. హైఓల్టేజ్ ఉద్రిక్తతలున్న అంతర్జాతీయసరిహద్దుల్లో ఉభయకొరియా విభజన రేఖ ఉండి తీరుతుంది. హ్యాకింగ్ తో అలజడి రేపుతుంది. ఇక్కడా అంతే సరిహద్దు వివాదం ఉన్న రాష్ట్రాల్లో ఇపుడు ఏపీ – దాని పక్క రాష్ట్రం మందు వరసలో ఉన్నాయ్. ఏడు మండలాల చుట్టూ ఎన్నో గొడవలు. తలనొప్పులు. విభజన సమయంలో మత్తులో జోగి…విభజన తర్వాత సెంటిమంటల కోసం వాడుకుంటోంది పక్క రాష్ట్రం. వికీలీక్స్ అంటూ మన ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేయడంలోనూ విద్వేషం చిమ్మడంలోనూ ఉ.కొరియాకి తక్కువేం లేదు మన పొరుగు సరుకు.

విడిపోతే… పడిపోతే… వ్యవహారం చెడిపోతే…

1945 నుంచి 48 మధ్య రగిలిపోయింది కొరియా. రెండుకొరియాలు ఏర్పడ్డాయ్ అంటుంది ఐక్యరాజ్యసమితి. నార్త్ కొరియా లీడర్లు సౌత్ పై కాలు దువ్వుతూనే ఉన్నారు. సౌత్ కొరియాకి అమెరికా సాయం కోరింది. పరిస్థితి సద్దుమణిగినట్టే కనిపించినా ద్వేషం పెరిగి ఉత్తర కొరియా 1950లో దాడి చేసింది దక్షిణ కొరియాపై . ఆర్థికంగా ధ్వంసమైపోయింది. మళ్లీ మొదటి నుంచి ప్రయాణం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఆశ్చర్యపరిచింది. సింపుల్ గా మూడు ముక్కల్లో ఇదీ స్టోరీ. ఇక్కడా అంతేగా. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయంటారు… కొన్నాళ్లు ఉమ్మడి రాజధాని హక్కులంటారు. ఏడాది తిరక్కముందే పొగబెట్టేందుకు బెదరకొట్టేందుకు కక్కని విషమంటూ లేదు. ట్యాపింగ్ తో సహా తొక్కని అడ్డదారంటూ లేదు. మిగులు రాష్ట్రానికి తెగులు పట్టించుకుంటూ ఓ పక్క… విద్వేషంతో చలికాచుకుంటూ మరో పక్క ఉత్తర కొరియా పాలసీకి ఇక్కడ ఊపిరి పోస్తోంది పొరుగు పొగరు.

చరిత్ర నుంచి చీకటిలోకి…

విడిపోక ముందూ పోలికలు చాలా ఉన్నాయ్… నార్త్ కొరియా నిరంకుశ చైనా అధీనంలో ఉండేది. సౌత్ కొరియా అమెరికా ఏలుబడిలో. ఇక్కడా అంతే. నిజాం పదఘట్టనలకింద ఓ ప్రాంతం నలిగిపోతుంటే… బ్రిటిష్ ఏలుబడిలో పరిమితుల నుంచి పాలన నేర్చుకుంది ఏపీ. చిత్రంగా పక్కన సీఎం నిజాంని పొడిగినట్టే… అణిచేసిన చైనాని, రష్యానే ఉత్తర కొరియా నెత్తికెత్తుకుంటుంది. స్టాలినిస్ట్ పాలన మాదంటుంది. ఇందులో కూడా పోలికలున్నాయ్. అంతేనా… సంస్కృతి, సంప్రదాయాల పేరుతో దాష్టీకం, కళ్లకి గంతలు కట్టడంలోనూ చాలా లక్షణాలు ఒక్కటిగా కనిపిస్తాయ్ అక్కడా… పక్కన !

మన బతుకు మనదంటూ ఓ చీకటి గుహలోకి జాతిని నడిపించేసింది ఉత్తర కొరియా. మన కల్చర్ మీద దాడి జరుగుతోందంటూ కలరిచ్చి ఓ దారుణ సామ్రాజ్యాన్ని సృష్టించింది. ఇక్కడ వాళ్లుచెప్పిందే శాసనం. బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలియదు ఎవరికీ. ఇక్కడా ఇలాంటి దృశ్యమే కనిపిస్తుంది. మన సంస్కృతిని తక్కువ చేస్తున్నారంటూ… మిగతా ప్రపంచం నుంచి ఆ నాల్గు కోట్ల మందిని వేరు చేసే విఫలయత్నం. మనల్ని వెక్కిరిస్తున్నారు… మనమేదో తక్కువ… అనే లేనిపోని ఫీలింగ్ దట్టించి పబ్బం గడుపుకునేందుకు అగాధం సృష్టిస్తోంది ఉత్తరం వైపున్న  ఉపద్రవం. అక్కడ మిలటరీ ఫస్ట్ అనేది పాలసీ. ఇక్కడా ఇంచు మించు ఇలాంటిదే . మిలటరీ లేదు కాబట్టి ఫస్ట్ ఫ్యామిలీనే ఫస్ట్. వాళ్లతర్వాత అందరూ లాస్ట్.

(లాస్ట్ అంటే చివర, పోగొట్టుకోవడం రెండు అర్థాలున్నాయ్) పరిపాలనలోనూ పోలికలున్నాయ్. ఉత్తరకొరియా నియంతృత్వం. హక్కులుండవ్. మానవహక్కుల సంఘాలు గగ్గోలు పెడుతుంటాయ్ ప్రాణాలు పోతున్నాయని. ప్యాంగ్ యాంగ్ నాయకత్వం ఫిడేలు వాయిస్తుంది. ఇక్కడా అంతే. రైతు ఆత్మహత్యలతో అల్లాడిపోతోంది రాష్ట్రం. ఘోరాన్ని అంకెలతో సహా మానవహక్కుల సంఘాలు బైటపెడతాయ్, కనీసం ప్రభుత్వం వాటిని మాట వరసకి ప్రస్తావించిన దాఖలా ఇప్పటిదాకా లేదు. నియంతృత్వంలోనూ చాలా పోలికలున్నాయ్ నార్త్ కొరియాకి పక్క రాష్ట్రానికీ. అక్కడ హక్కులు అడిగితే శిక్షలు పడతాయ్. ఇక్కడ వ్యతిరేకులని ముద్రవేస్తారు.

భౌగోళికంగా కూడా ఉత్తరకొరియా లాంటిదే పక్కరాష్ట్రం. అక్కడ చెప్పుకోదగ్గ ఏకైక సిటీ ప్యాంగ్ యాంగ్. అది దాటి వెళితే అసలు రంగు బైట పడ్తుంది. కాకపోతే జియోగ్రఫీ నార్త్ కొరియాకి పెద్ద అడ్వాంటేజ్. భూ గృహాలు, కొండలు గుట్టలుంటాయ్. అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. అమెరికా నిఘా శాటిలైట్ కూడా డీ కోడ్ చేయడం అంత ఈజీ కాదు. ఇక్కడా అంతే. ఓన్లీ రాజధాని మాత్రమే వజ్రపు తునక. ఆ వెనక ఏం లేదు మళ్లీ. ఇక్కడ వాతావరణం ఎత్తైన ప్రాంతం కావడం మాత్రమే అడ్వాంటేజ్. అది లేకపోతే ఇక్కడంతా సీన్ రివర్సే. భవిష్యత్ ఎంటో ఊహించలేకపోవడం ఇక్కడి మిస్టరీ.

ఇదంతా ఆకాంక్షో… కల్పనో కాదు. కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. ప్రసార మాధ్యమాల్లో ప్రచార సాధనాల్లో… ఆఖరికి ప్రపంచ స్థాయి సినిమా విడుదలైనా ప్రాంతం పేరుతో విషయం కక్కుతున్న వాళ్లకి వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నమే ఇదంతా ! కుటుంబ సభ్యులకి తప్పూఒప్పూ చెప్పి నచ్చజెప్పినట్టే ఇక్కడా ఓ ఉదాహరణతో వివరించామంతే ! యాన్యువల్ డే నాడు దక్షిణ కొరియా కొరియా పిల్లలు సరిహద్దుల్లో గులాబీలు అందిస్తారు ఉత్తర కొరియాకి ! మాలాగా మారండి… మాతో కలిసి రండి అని ! ఇది కూడా అలాంటి విజ్ఞప్తే ! రాతను మార్చలేం.

-అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title