హైద్రాబాద్ లో ఆగొద్దు… డైరెక్ట్ వచ్చేయండి…

Written by

ఏపీకి వింగ్స్ ఆఫ్ ఫైర్…

నాల్రోజులు విజయవాడనుంచే పరిపాలన సాగించేందుకు సిద్ధమైన ప్రభుత్వం కనీస సౌకర్యాలమీద దృష్టిపెడుతోంది. చంద్రబాబుని కలవాలన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా ఎవరైనా బెజవాడ రావాల్సిందేనన్న మెసేజ్ అయితే ఇప్పటికే ఆల్ ఓవర్ ఇండియా అందింది. అందుకే జీ గ్రూప్ సుభాష్ చంద్ర లాంటి వాళ్లు కూడా ఇపుడు ఇక్కడకొచ్చే కలుస్తున్నారు. ఇదో పాజిటివ్ సిగ్నల్ కచ్చితంగా. సింగపూర్ నుంచి వచ్చినా… జపాన్ డెలిగేషన్ అయినా ఇక మీటింగ్ ఇక్కడే ! ట్రాఫిక్ పెరగడం… ఇక్కడి అవకాశాలు తెలియడం… హాస్పిటాలిటీ లాంటి అనుబంధ రంగాలు అన్నీ డెవలప్ అవుతాయ్. అన్నిటికీ మించి ఏపీకి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది.

ఇదే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేందుకు రెక్కలు తొడగాలని ఏపీ ప్రభుత్వం సన్నాహాలు స్పీడప్ చేస్తోంది. రెండ్రోజులు విజయవాడలో ఉన్నారో లేదో బాబుకి అప్పుడే ఏమేమి కావాలో ఆర్థమవుతోంది. ముందు కనీస సౌకర్యాలుంటే మిగతా వన్నీ చకచకా అవుతాయని గన్నవరం ఏర్ పోర్ట్ ని నేషనల్ లెవెల్ కి అభివృద్ధి చేయాలని ఆయన పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. కేంద్రంలో ఉన్న మంత్రి రాష్ట్రానికి చెందినవారే. ఇప్పటికే ఫైలు కదిలినా భూ సేకరణ దగ్గర కాస్త స్లో అయ్యింది వ్యవహారం. భూ సేకరణకి ఉన్న అడ్డంకులు అధిగమించి పనులు మొదలుపెడితే ఓ పనౌతుంది.
కేంద్రం లిస్ట్ లో తిరుపతి, వైజాగ్ ఏర్ పోర్టులున్నా… వాటికన్నా ముందు బెజవాడకి ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు చెబుతున్నారు.

వయా హైద్రాబాద్ లేకుండానే…

విదేశీ ప్రతినిధులు రావాలన్నా… ఢిల్లీ నుంచి రాకపోకలు ఉద్ధృతంగా జరగాలన్నా ఇప్పటి సదుపాయాలు సరిపోవు. మినీ డొమెస్టిక్ టెర్మినల్ స్థాయి నుంచి గన్నవరం రేంజ్ ఇప్పటికిప్పుడు పెరగాలి. రాజధానికి దగ్గరగా ఉండడం… విజయవాడ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఇది కంపల్సరీ. దీనికి తోడు ముందు ముందు మరో ఆలోచన కూడా ఉందంటున్నారు. ప్రస్తుతం ఎవరైనా విజయవాడకి రావాలంటే హైద్రాబాద్ లో ఆగడం కంపల్సరీ అయిపోతోంది. అక్కడి నుంచి ఫ్లైట్ లోనో… లేదంటే హెలికాప్టర్ లోనో వస్తున్నారు. అలాంటి బ్రేక్ జర్నీ లేకుండా… విదేశీ ప్రతినిధులు అయినా దేశీ అయినా… డైరెక్ట్ ఏపీలో ల్యాండ్ అయ్యేలా చూడాలని కూడా ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. కేంద్రం సాయంలో ఈ ఏర్ పోర్ట్ రినొవేషన్ కి ప్రయారిటీ ఇవ్వాలని సీఎం సూచించారంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయ్.

శంషాబాద్ లాంటి భారీ విమానాశ్రయం 300 కిలోమీటర్ల దూరంలో ఉంటే చుట్టుపక్కల ఏర్ పోర్టుల విస్తరణకి కొన్ని పరిమితులు ఉంటాయ్. రష్ తక్కువ ఉంటుందనో లేదంటే పక్కపక్కనే మరోటి ఎందుకనో అభ్యంతరాలు సహజంగా వస్తాయ్. అందుకే భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలు అని ఆలస్యం చేయకుండా గన్నవరానికి హంగులు అద్దే పనిలో పడుతోంది ఏపీ ప్రభుత్వం. విశాఖను ఇంటర్నేషనల్ లెవెల్లో తీర్చి దిద్దాలని… తిరుపతికి కూడా అలాంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అంటే మొత్తానికి ఏపీకి కొత్తగా రెక్కలు రాబోతున్నాయ్.

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title