శిధిలం నుంచి శిఖరం వైపు : టార్గెట్ 2018

Written by

1996. హైద్రాబాద్ ఓల్డ్ సిటీ. సీఎం చంద్రబాబు ఆకస్మిత తనిఖీ. ఓ స్లమ్ లో జనం, పిల్లలతో ఇంటరాక్షన్. ముఖ్యమంత్రి ఓ చిన్నారిని పిలిచారు. కిత్ నా స్కూల్ హై? అనిఅడిగారు. ఒక్క క్షణం అక్కడున్నవాళ్లకి ఏం అర్థంకాలేదు. వెంటనే పక్కనున్న దేవేందర్ గౌడ్ తేరుకొని.. కౌన్ సా స్కూల్ హై అని అడుగుతున్నారు సార్ అని కవర్ చేశారు. ఇంతకు ముందు వచ్చినపుడు ఇక్కడ పడిపోతున్న స్కూల్ ఉండేది ఎలా మారిందని సీఎం అడిగారు. పడిన స్కూలు పడినట్టు ఉండదు గా… మీరు కట్టించారని మా టీచర్ చెప్పిందని ఆ పిల్ల ఉర్దూలో చెప్పింది. మళ్లీ గౌడ్ ట్రాన్స్ లేషన్.

చంద్రబాబుకి ఉర్దూరాదని చెప్పడానికి కాదు ఈ ఎగ్జాంపుల్. ఆ పిల్ల అన్నమాట తీసుకొని తర్వాత ప్రభుత్వం భారీ కేంపైన్ చేసింది. పఢావో… బఢావో అని. అది స్పిరిట్. పడిన స్కూళ్లు… పడిన గోడలు పడినట్టుండవ్. కూలిన రాష్ట్రం కూడా !

ఏపీ ఇదే చేసి చూపించబోతోంది. కుప్పకూలిన రాష్ట్రం రాకెట్ లా లేవబోతోంది. గ్రాఫిక్స్, డిజైన్లు చూపిస్తున్నారని ప్రచారం చేస్తున్న వారికి చెంప పెట్టులాంటి సమాధానం రాబోతోంది. ఎప్పుడో కాదు. 2018 నాటికే! గట్టిగా మరో రెండున్నరేళ్లు. ఈలోపే కనీసం రెండు భారీ నిర్మాణాలు,

ఏడెనిమిది ఇతర పరిపాలనా భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. రెండు భారీ నిర్మాణాల్లో ఒక్కో దాంట్లో 46 స్టైర్స్ ఉంటాయ్. మిగతావి పది అంతస్థుల బిల్డింగ్ లు. సెక్రటేరియెట్, ఇతర పరిపానా అవసరాల కోసమే ఆ స్కై స్ర్కాపర్స్. మిగతావి కూడా ఏపీ పాలన కోసం ఆయువు పట్టులాంటి నిర్మాణాలే. ఇప్పటికే ఆలస్యం అవుతోందని… భారీ లక్ష్యం పెట్టుకొని లేటైపోతున్నామన్న అభిప్రాయం జనంలో ప్రబలకముందే తేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుందని చెబుతున్నారు. సీడ్ కేపిటల్ రూపు రేఖలు కూడా చాలా వరకూ ఈ రెండు మూడేళ్లలోనే అమరావతిలో ఓ కొలిక్కి వస్తాయని చెబుతున్నారు.

ఏపీ ఠీవీలా.. స్టామినా ఏంటో తెలిసేలా నిర్మించాలని కంకణం కట్టుకుందట ప్రభుత్వం. మూడేళ్లలోనే లేచి ఈ స్థాయిలో నిలబడితే ఇండియాలో ఇదో రికార్డ్ సృష్టించినట్టే ! భారీ నిర్మాణాలు… సొంత ప్రాంతం నుంచి పాలన… ఇదీ అమరావతి అంటే చూపించేందుకు మీనియేచర్ లాంటి నమూనా అన్నీ 2018 నాటికే చేతికొస్తాయ్ అంటున్నారు. కబుర్లు చెబుతారు… చాలా చూశాం అనేందుకు, అనుమానించేందుకు కూడా ఇందులో పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఆ మరుసటి ఏడాదే ఎన్నికలు కూడా ఉంటాయ్. ఇది మేం చేసింది… ఇదీ చేయబోతున్నది అని చెప్పుకోడానికి కూడా ఆసరా కావాలి ప్రభుత్వానికి. అందుకే ఇటు రాజకీయం అటు రాష్ట్ర కోణం అన్నీ ఆలోచించి పగ్గాలు పట్టి పరుగులు తీయించేందుకు రంగం సిద్ధమైయ్యిందంటున్నారు. సీనియర్ మంత్రులు… కీలక బ్యూరోక్రాట్లు… రాజధాని కన్సార్టియం కి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని… పెద్ద హడావుడి చేయకుండా పనులు మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని అంటున్నారు.

నిప్పున్న కట్టెని తలకిందులు చేసినా… అగ్ని ఆకాశంవైపే చూస్తుంది. అది దాని నేచర్. నిప్పు లాంటి మనిషి అనే పోలికలన్నీ అలా వచ్చినవే. ఏం చేసినా ఎంత కిందకి లాగినా వాడెక్కడుండాలో అక్కడ ఉండి తీరతాడన్నమాట. ఇపుడు ఏపీ కూడా అంతే. పడగొట్టినా… తొడగొట్టి నిలబడబోతోంది. పందొమ్మిదేళ్ల కిందట హైద్రాబాద్ లో పఢావో బఢావో అన్నట్టు… బఢావో… తడాఖా దిఖావో అనాలేమో ఇపుడు ! ఏపీ వాళ్లం కాబట్టి అర్థమయ్యేలా తెలుగులో చెప్పుకోవాలంటే… ఇదీ ఏపీవోడి తడాఖా అని చెప్పుకోవాలి 2018 నాటికల్లా !

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title