వల్చర్ కి తెలుసా… ఆంధ్రా వర్క్ కల్చర్ అంటే ఏంటో ?

Written by

బాధుంటే… ఆవేదన రగిలితే… దు:ఖం నిన్ను ముంచెత్తుతుంటే… రోజూ చేసే పని ఇంకాస్త ఎక్కువచెయ్. కష్టపడి చెయ్. ఆ కష్టంలో పడి నిన్ను నువ్వు… మర్చిపోతావ్. వెంటాడుతున్న బాధ వెనకబడిపోతుంది – వర్క్ కల్చర్ కి కలామ్ ఇచ్చిన కొత్త డెఫినిషన్ ఇది. అందుకే వారం రోజులు సంతాపనదినాలు ప్రకటిస్తూనే ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం పనిచేస్తాయంది కేంద్రం. కలాంకి నివాళిగా మరో గంట అదనంగా పనిచేద్దాం అంటూ ఏపీ ప్రతిన చేసింది. భావోద్వేగం ఉప్పొంగే క్షణాల్లోనే బైటపడుతుంది ఎవరేంటో. ముఖ్యమంత్రులు ప్రధానులు ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ దిగ్గజాలు దు:ఖాన్ని పంటిబిగువున పట్టి… కలాంకి సలాం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ మత్రం తీరిగ్గా ఆలోచించి… ఎనిదిన్నరకి జీవో జారీ చేసింది ఇవాళ సెలవు అని.

రెండుపూటలు గడిచినా మహా మనీషికి సంతాప సందేశం చెప్పడానికి కూడా నోరు పెగలని సీఎంలుంటారని పక్క రాష్ట్రంలో చూస్తే అర్థమవుతోంది. కల్చర్ గురించి. వర్క్ కల్చర్ గురించి స్పీచ్ లిచ్చే పక్క రాష్ట్ర సీఎం ఏమైపోయినట్టు ? నిద్రలోకి జారుకున్నాడా ? బజ్జుంటేనేగా బంగారు తెలంగాణ కలలో కనిపించేది ! ఇలాంటి నాయకుడా ఆంధ్రా కల్చర్ గురించి స్పీచ్ లిచ్చాడు మూడ్రోజుల కిందట ?

ఆంధ్రాకి తెలంగాణకి అదే తేడా !

ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక హైద్రాబాద్ లో వర్క్ కల్చర్ మొదలైంది. ఆ తర్వాత 95 నుంచి సాఫ్ట్ వేర్ హడావుడి అందుకుంది. ఇపుడు నిద్ర పోని నగరంగా అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ఇదంతా మేం నేర్పిన వర్క్ కల్చర్ అని చంద్రబాబు అంటే…నరం లేని నాలుకని అడ్డ గోలుగా మడతేశాడు పక్క రాష్ట్ర సీఎం. హైద్రాబాద్ కి కొత్తగా ఎవరూ నేర్పలేదన్నాడు. మరి పన్నెండు గంటలకి దుకాణాలు తెరిచిన రోజులు…రాత్రి తొమ్మిది దాటితే భయపడి కొట్లు కట్టేసుకున్న రోజులు మర్చిపోయినట్టున్నారు. అయినా… నిన్నమొన్టని దాకా మధ్యాహ్నం రెండు గంటలకి నిద్రలోచినోడు కూడా వర్క్ కల్చర్ గురించి మాట్లాడితే వినే దౌర్భాగ్యం పట్టింది మనకి ! ఇపుడు హైద్రాబాద్ లో ఆంధ్రోళ్లు యాక్టివ్ గా లేరుగా… సిటీనీ సీఎంని నిద్ర లేపేందుకు. ఇదే తెలంగాణ ముద్ర.

అసలు వర్క్ కల్చరేంటో… ఏం జరుగుతోందో తెలంగాణ చూస్తుంటే అర్థమవుతోంది. ఫుల్ వాలెట్ లాంటి రాష్ట్రం… ఏడాది తిరిగే లోపే నెలాఖరు జేబులా తయారైంది. ఎత్తులో ఉన్న రాష్ట్రం ఏడాదికే కూరుకుపోయింది. పక్క రాష్ట్రం మ్మీద పడి ఏడిస్తే పనులయ్యే అవకాశమే ఉంటే తెలంగాణలో ఈ పాటికి అద్భుతాలు జరిగుండేవి. కానీ అలా కుదరదు కదా. అందుకే… కేసీఆర్ వర్క్ కల్చర్ కలరేంటో… కేలిబర్ ఏంటో తెలంగాణ ఖజానా చూస్తే తెలుస్తోంది.

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title