ర్యాగింగ్ కి కులం ఉందా?

Written by

ప్రపంచంలో, నిజం కన్నా, అబద్దం కనీసం అరవై రెట్లు వేగంగా పరిగెత్తుతుంది. అపోహల తో కూడిన అసంబద్ద ప్రచారానికి వచ్చే స్పందన, నిజాయితీ కి రాదు, అబద్దంలో ఒక అందం ఉంటుంది, ఒక నాటకీయత ఉంటుంది. నిజం లో ఆ అవకాశం ఉండదు, అందులో నాటకీయతకు అవకాశం లేదు. నిజం డాక్యుమెంటరి లా ఉంటే అబద్దం కమర్షియల్ సినిమా లా ఉంటుంది. కమర్షియల్ సినిమా సక్సెస్ అవుతుంది, డాక్యుమెంటరి ఎవ్వడు చూడడు, రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో కూడా జరిగింది ఇదే!!

నిజానికి సమాజంలో నూటికి తొంభై మంది ఆ అమ్మాయి మరణాన్ని జిర్ణించుకోలేక పోయారు, సమాజం ఒక్కసారి ఉలిక్కి పడింది, చాపకింద నీరులా రాగింగ్ భూతం మన విద్యావ్యవస్థను ఎలా కప్పేసిందో తెలిసి వచ్చింది. కానీ కొంతమంది ఆ అమ్మాయి ఆత్మహత్యను ఎలాక్యాష్ చేసుకోవాలా అనే కోణం లో ఆలోచించారు, ఒక అబద్దాన్ని ప్రచారం లోకి తీసుకువచ్చారు. ఒక సామాజిక వర్గం మీద విషం చిమ్మటానికి వాడుకున్నారు. వీరికి ఆ అమ్మాయి మీద ఎలాంటి ప్రేమా లేదు, అక్కడ ఆ అమ్మాయి శవం వీరికో ఉపాధి, ఆ అమ్మాయి మరణం వీరికో ఆయుధం.

రాగింగ్ చేసింది, ఆ అమ్మాయి చావు కి కారణం ఒక సామాజిక వర్గం అంటూ విషప్రచారం ప్రారంభించారు, కానీ నిజానిజాలు తెలిసిన తర్వాత, ఆ అమ్మాయి ని రాగింగ్ చేసిన ముగ్గురులో ఏ ఒక్కరిది ఆ సామాజిక వర్గం కాదు, ముగ్గురిది మూడు వేరు వేరు సామాజిక వర్గాలు, ముగ్గురువి కనీసం ఒక ప్రాంతం కూడా కాదు , మూడు వేరు వేరు ప్రాంతాలు , ముగ్గురి సామాజిక నేపధ్యాలు వేరు వేరు, ఇక్కడ నేను వేరు వేరు సామాజిక వర్గాలు అని చెప్పింది , ఆ సామాజిక వర్గాలను వేలెత్తి చూపించాలని కాదు . ప్రతి సామాజిక వర్గంలోనూ. మంచి వారితో పాటు , చెడ్డ వారు కూడా ఉంటారని చెప్పటానికే నేరానికి కులం ఉండదు అని చెప్పటానికి మాత్రమే. రాగింగ్ అనేది ఒక మానసిక జాడ్యం . ఆ మానసిక జాడ్యానికి కులంతో, మతంతో, ప్రాంతం తో పని లేదు, ఆయా వ్యక్తుల మానసిక ప్రవర్తనను బట్టి మాత్రమే ఉంటుంది. కాకపొతే ఇక్కడ ప్రిన్సిపాల్ అందరూ వేలెత్తి చూపిన సామాజిక వర్గానికి చెందినవాడు. రాగింగ్ ని అదుపు చెయ్యటంలో అతను పూర్తిగా విఫలం అయ్యాడు, ప్రిన్సిపాల్ గా సరైన చర్యలు తీసుకోలేదు, అందుకు అతను శిక్షార్హుడే. అందులో ఎలాంటి అనుమానం లేదు.

ప్రభుత్వం రాగింగ్ చేసినారిని కాని, అందుకు సహకరించిన వారిని కఠీనంగా శిక్షించాలి . రాగింగ్ లాంటివి జరగకుండా మాననసిక నిపుణులను కాలేజ్ లో వార్దేన్స్ గా నియమించాలి, రాగింగ్ కు తీవ్రమైన శిక్షలు ఉండాలి. సున్నిత మనస్తత్వాలు ఉన్న వారి మీద వార్దేన్స్ ప్రత్యేక శ్రద్ద పెట్టాలి . రాగింగ్ చేసే మనస్తత్వం ఉంది అనుకున్న వారిని అదుపు చెయ్యాలికులాలు , మతాలు, ప్రాంతాలు , క్యాంపస్ లో కి అడుగు పెట్టకుండా చూడాలి . అది ఏ కులం అయినా, కుల ప్రస్తావన కాలేజ్ లలో , యూనివర్శిటి లలో ఎక్కడా కనిపించకుండా చూడాలి . విద్యార్ధులే కాదు, కొంత మంది ప్రొఫెసర్స్ కూడా ఈ కుల రాజకీయాలను, ప్రోత్సహిస్తున్న వారు ఉన్నారు. ఏ కులం వారు దీనికి మినహాయింపు కాదు అలాంటి కుల రాజకీయాలు నడిపే ప్రొఫెసర్స్ ఏ కులానికి చెందినవాడు అయినా వెంటనే సస్పెండ్ చేయాలి . ఇలాంటి వారికి వత్తాసు పలికే విద్యార్ధి సంఘాల గుర్తింపు రద్దు చెయ్యాలి . యూనివర్శిటి లలో మన విజ్ఞానానికి మరింత పదును పెట్టుకోవాలి కానీ, కుల గజ్జి నెత్తిన పెట్టుకొని రాకూడదు, ముఖ్యంగా అన్ని యూనివర్శిటిలకు వైస్ ఛాన్సలర్స్ ని వెంటనే నియమించాలి . ఆ ఎంపిక పారదర్శకంగా ఉండాలి . యూనివర్శిటి లలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదు , ప్రభుత్వం మారినప్పుడు ముఖ్యమంత్రి నో, మరో మంత్రి నో ప్రసన్నం చేసుకొనే పరిస్థితి ప్రొఫెసర్ల కి రాకూడదు . ప్రొఫెసర్లు కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండి విద్యార్ధుల భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి తప్ప . స్వార్ధ ప్రయోజనాల కోసం విద్యార్ధులను బలి చెయ్యకూడదు , విద్యార్ధుల మధ్య ఏదైనా ఘర్షణ జరిగే పరిస్థితులు వస్తే పరిస్థితులను చక్కదిద్దే విధంగా ఉండాలి కానీ, ఆ గొడవల ద్వారా నాకు ప్రమోషన్ లభించే అవకాశం ఏమైనా ఉందా అని ఆలోచించే ప్రొఫెసర్స్ ని వెంటనే తొలిగించాలి .

ఇలాంటి కుల రాజకీయాల వాళ్ళ కేవలం యూనివార్శిటిలే కాదు, మొత్తం రాష్ట్రానికే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది, ఈ రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకోని, ఈ విచారణ పారదర్శకంగా జరపాలి, వీలైతే ఈ విచారణ మీడియా లో లైవ్ ఇవ్వాలి . దీని ద్వారా కులం మన చదువు మీద ఎంత ప్రభావం చూపుతుందో అటు విద్యార్ధులు, ఇటు తల్లిదండ్రులు తెలుసుకోగలుగుతారు. ,ఆ కులం అనే పదం వల్ల వ్యవస్థ కు జరుగుతున్న నష్టాన్ని తెలుసుకోగలుగుతారు . అప్పుడైనా కులం, కులం అనే మత్తు మందు ని తమ పిల్లలకు ఎక్కించకుండా ఉంటారు . తద్వారా భవిష్యత్ తరాలు ఈ కులాల రొంపి లోకి దిగకుండా ప్రశాంతంగా ఉంటాయి.

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title