రికార్డు బద్దలుకొట్టబోతోంది ఏపీ..!

Written by

ఏపీకి హ్యాపీ న్యూస్. ఇండస్ట్రీ కోసం పెట్టుబడుల విశ్వప్రయత్నం చేస్తున్న సమయంలో అద్భుత అవకాశం ఏపీ తీరాన్ని తాకబోతోంది. గల్ఫ్ నుంచి రాష్ట్రానికి నిధుల వరద పారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మేనిఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ కెమికల్ కాంపొనెంట్స్ కి ఆరిజిన్ లాంటి పెట్రో కెమికల్ ఇండస్ట్రీ పునాదులు రాష్ట్రంలో పడబోతున్నాయ్. గుజరాత్ తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో యాక్టివిటీ ఏపీలోనే జరిగే అవకాశం ఉంది వచ్చే పదేళ్లలో అంటున్న అంచనాలు ఆశలు రేపుతున్నాయ్. కచ్ తీరంలో జిరిగిందే ఏపీ విషయంలోనూ నిజమవుతుందా ? సత్తాఉంటే అదృష్టం వరించితీరుతుందని రుజువవుతుందా ? పెట్రోకెమికల్ హోప్స్… అవునంటున్నాయ్. ఏపీ కాన్ఫిడెన్స్ కి బూస్టప్ ఇస్తున్నాయ్.

లూసియానా… జామ్ నగర్… ఆ తర్వాత మన ఏపీ కోస్ట్…

ఏపీలో లక్షకోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ కంపెనీ ముందుకొచ్చింది. నెల్లూరు తీరంలో భూములు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే అక్కడ, లేదంటే ప్రకాశం తీరంలో పెట్రోకెమికల్ హబ్ ఎస్టాబ్లిష్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భూములు, వాతావరణం లాంటి విషయాలపై సర్వే మొదలైంది. ఎలా ఉండాలి ఎస్టాబ్లిష్ మెంట్… ఎంత భూములు కావాలి… రవాణా ఎలా లాంటి విషయాలపై స్పష్టత త్వరలోనే వస్తుందని చెబుతున్నారు. మరో అడుగు ముందుకు పడినా… పెట్రో కెమికల్ హబ్ గా ఏపీ మాస్టర్ స్ట్రోక్ కొట్టినట్టే ! కాకినాడ దగ్గర ఇప్పటికే 52 వేల కోట్లతో హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రిపరేషన్స్ చేస్తోంది. విశాఖ కాకినాడ బెల్ట్ ని పెట్రోకెమికల్ హబ్ గా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావించడం ఓ రకంగా అక్కడ కలిసొచ్చింది. దీంతోపాటు… కాకినాడ సెజ్ లో పెట్రోకెమికల్ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు జీఎంఆర్ గ్రూపు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే సుమారు 3 వేల కోట్లు పెట్టుబడులుగా వచ్చినట్టే. భారీస్థాయిలో ఉద్యోగాలుతో పాటు ఇన్ ఫ్రా, మేనిఫ్యాక్టరింగ్ సెక్టర్లో ఏపీ రూపురేఖలే మారిపోతాయ్.

సపోజ్..దుబాయ్ కంపెనీ పెట్టబోయే పెట్రోకెమికల్ ఇండస్ట్రీనే తీసుకుంటే సొంతంగా పోర్ట్ కూడా ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ సై అంటోంది.రోడ్లు చుట్టుపక్కల సదుపాయాలు పెరగడం లాంటివి ఎలాగూ ఉంటాయ్. పెట్రోకెమికల్ హబ్ ఇన్ ప్లూయెన్స్ కి ఇదంతా అదనం. పెట్రోకెమికల్ ఇండస్ట్రీ నిజానికి భాగ్యరేఖ. యాక్టివిటీ మొదలైయ్యిందంటే అభివృద్ధి ర్యాపిడ్ గా గేర్ అందుకుంటుంది. గుజరాత్ ఈ స్థాయిలో పుంజుకోడానికి ప్రధాన కారణం పెట్రోకెమికల్ ఇండస్ట్రీనే. అక్కడికొచ్చే పెట్టుబడులు… ప్రోసెసింగ్… ఎగుమతులకి సంబంధించిన కార్యకలాపాలు, వాటితోపాటు… అనుబంధ రంగాలు అభివృద్ధి చెందాల్సి ఉంటుంది… అందుకే తీరప్రాంతాల్లో పెను మార్పులు రావడం ఖాయం. రిలయన్స్, ఇండియన్ ఆయిల్ లాంటి సంస్థలు గుజరాత్ – జామ్ నగర్ లో కొత్త ఇండియాను ఆవిష్కరిస్తున్నాయ్.

ఏపీ భాగ్యరేఖ పెట్రో కెమికల్స్…

పెట్రోకెమికల్స్ లో ఆల్ఫీన్స్ అండ్ ఆరోమాటిక్ అని రెండు రకాల ప్రొడక్షన్ అండ్ ప్రోసెసింగ్ నడుస్తుంది. పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి తీసే ఉపరసాయనాలతో సబ్బులు, రెసిన్స్, గమ్స్ లాంటివి చేస్తారు. ఇవన్నీ ఫ్యూయెల్ నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్. విదేశాల నుంచి రా-ఫ్యూయెల్ దిగుమతి, ఇక్కడ ప్రోసెసింగ్, తిరిగి ఎగుమతులు చేయడంతోపాటు… రీ డిస్ట్రిబ్యూషన్ కూడా చుట్టుపక్కలే జరుగుతుంది. అందుకే పెట్రో కెమికల్ ఇండస్ట్రీ రెండు మూడొందల ఎకరాలతో సరిపెట్టుకోదు. ఇంటిగ్రేటెడ్ మాన్యుఫాక్చరింగ్ ఉంటుంది. సెజ్ గానో అంత కంటే పెద్దది గానో విస్తరిస్తుంది. తీరం ఉన్న చోటే ఇది పునాది వేసుకుంటుంది.

కావాల్సిన ముడిసరుకు దిగుమతి… ప్రోడక్ట్స్ ఎగుమతి కోసం పోర్ట్, భారీ రోడ్లు విమానాశ్రయం లాంటివి అందుబాటులో ఉండాలి. గుజరాత్ లో జామ్ నగర్ ప్రాంతంలో రిలయన్స్ గ్రూప్ పెట్రోకెమికల్స్ కోసం ప్రత్యేకంగా సెజ్ నే ఏర్పాటుచేసింది. ఇప్పటివరకూ దేశంలో ఇదే అతిపెద్ద యూనిట్. తీరానికి దగ్గరగా ఉండడం.. అన్నిరకాల పారిశ్రామిక కార్యకలాపాలకి అనుకూలంగా ఉండేసరికి గుజరాత్ లో ఈ ఇండస్ట్రీ పాతుకుపోయింది. 80ల మొదట్లో పెట్రో కెమికల్ ఇండస్ట్రీ మొదలయ్యే వరకూ ఉన్న గుజరాత్ వేరు. ఆ తర్వాత కనిపించిన ఇండస్ట్రియల్ గ్రోత్ వేరు. అదంతా ఈ ఇండస్ట్రీ ఎఫెక్టే ! మహారాష్ట్ర లో కూడా ఉన్నా యాక్టివిటీ జామ్ నగర్ తో పోలిస్తే చాలాతక్కువే. ప్రపంచవ్యాప్తంగా లూసియానా లాంటి కొన్ని చోట్ల మాత్రమే ఇలాంటి భారీ పెట్రోకెమికల్ ఎస్టాబ్లిష్ మెంట్స్ ఉన్నాయ్. మళ్లీ అంతటి స్థాయిలో ఏపీలో అవకాశాలకి ద్వారం తెరుచుకోబోతున్నట్టు కనిపిస్తోంది.

ఫ్యూచర్ ఫేస్ ఆప్ ఏపీ…

మిగతా ఇండస్ట్రీ అంతా ఓ ఎత్తు. టెక్నాలజీ పరంగా చూసినా… సైజ్… స్పాన్… ఇంపాక్ట్ పరంగా చూసినా పెట్రోకెమికల్స్ ఓ ఎత్తు. తీరం అండతో పాలసీ పుషింగ్ తో ఏపీలో యాక్టివిటీ మొదలైతే దాన్ని ప్రారంభమని కాదు ప్రభంజనం అని చెప్పుకోవాలి. మిగతా రాష్ట్రాలకీ మనకీ తేడా ఏంటో చూపించే మూవ్ కాగలదు. క్రిష్ణా జిల్లా మల్లేశ్వరం ప్రాంతంలో పెట్రోలియం నిక్షేపాలు… విశాఖ ప్రాంతంలో ఖనిజాలు… రాయల సీమ ఐరన్ ఓర్ లాంటివన్నీ భారీ ఎస్టాబ్లిష్ మెంట్స్ కి అవకాశం కల్పించేవే ! ఒక్కసారి విదేశీ సంస్థలు ఏపీ గడప తొక్కితే నిధుల ప్రవాహానికి అదే మొదలు ! ఇప్పటికైతే సంకేతాలు స్పష్టం. పూర్తిగా పాజిటివ్. మరి ముందు ముందు కూడా అడుగులు ఇలాగే పడితే… అవకాశాల తీరం ఏపీ అని రుజువు కావడానికి ఎంతో సమయం పట్టదు.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title