రాజమండ్రి పుష్కర ప్రమాదాల్లో విలన్స్ వీళ్లేనా ?

Written by

సముద్రంలో ఇండియా, చైనా ఓడలు యూరప్ దేశాలకి కప్పల ఎగుమతి చేస్తున్నాయ్. నడి మధ్యలో తుఫానొచ్చి… సుడిగాలికి కప్పల డబ్బాలకున్న మూతలు ఎగిరిపోయాయ్. చైనా సిబ్బంది కంగారుపడి మూతలు పెడుతున్నారు. మనోళ్లు మాత్రం తాపీగా కూర్చున్నారు. అదేంటలా వదిలేశారు అంటే దటీజ్ ద సీక్రెట్ ఆఫ్ ఇండియా అని చెప్పారు. చైనా సిబ్బంది వచ్చి ఓ కప్పని పైకి లేపి చూసి ఆశ్చర్యపోయారు. దాని రెండు కాళ్లూ పట్టుకొని రెండు కప్పలు… ఆ రెండింటినీ పట్టుకొని మరో నాల్గు కప్పలు అలా అన్నీ ఒకదాన్నొకటి పట్టుకున్నాయ్. ఎందుకలా అంటే..పైకప్ప ఎగిరిపోయి ఎక్కడ బతుకుతుందోనన్న భయంతో మిగతావి దాన్ని ఆపేశాయ్. ఏదీ ఎగరదు. ఏదీ బతకదు. దటీజ్ అవర్ సైకాలజీ.

రాజమండ్రి రేవులో ఇలాంటి కప్పల సీనే కనిపించింది. తొక్కిసలాట కొందరి పాపం. అగ్ని ప్రమాదం ఇంకొందరి కడుపుమంట అనేందుకు అనుమానాలే సాక్షి. అధారాలు కూడా ఒక్కొక్కటిగా బైటపడుతున్నాయ్. ఎవరో షాక్కొట్టి చచ్చిపోయారు వైర్లు తెగిపడ్డాయంటూ ప్రచారం చేసి తొక్కిసలాట సృష్టించి ప్రాణాలు తీసేశారు. ప్రశాంతంగా వెలిగిపోతున్న తీరంలో మంటలు మండించి అలజడి రేపాలనుకున్నారు. క్రైమ్ సీన్ ఇదే సంగతి చెబుతోందని ప్రాథమిక నివేదిక రెడీ అయ్యింది. అంటే ఒక్కడి మీద కసితో… రాజకీయ పగతో జనం ప్రాణాలు తీయడం, రాష్ట్ర పరువు ప్రతిష్టల్ని పణంగా పెట్టడం ఎంత దుర్మార్గం? ఐఎస్ఐఎస్ కి ఏ మాత్రం తక్కువ కాని రాక్షసత్వం మన రాజకీయంలో ఉందనేందుకు ఇంతకన్నా ఆధారం ఇంకేం కావాలి ?

ఇసకంటని రేవులు, ఇసకేస్తే రాలని జనం… ఏ దిక్కుకి తిరిగి ఇచ్చినా ధగద్ధగాయమానంగా వెలిగిపోయిన హారతి ఇవన్నీ మనకి గర్వకారణాలు. మనకేం తక్కువ అనిపించే ఆశాదీపాలు. ఇలాంటివి కూడా ఆర్పేసి… కొంపని గుండం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని 29 ప్రాణాలు పోయాక బైటపడుతోంది. ఇలాంటి వాళ్లని ఉపేక్షిస్తే… ముందుముందు పరిస్థితి ఇంకెంత విషమిస్తుంది ? అయినా ఓ వ్యక్తి మీద వ్యక్తిగతంగా కక్షకట్టడం ఉన్మాదం. ముఖ్యమంత్రి ఓ వ్యక్తి అనుకోవడం బుర్రతక్కువతనం. సీఎం అంటే ఓ సిస్టమ్. అలాంటి వ్యవస్థకి లోతెక్కువ… చేతుల పొడవెక్కువ… ఆలోచనలకి దూరమెక్కువ. అలాంటప్పుడు… దుర్మార్గానికి బాధ్యులెవరో బైటపడి తీరాలి. జనానికి తెలియాలి.

పుష్కరం గురించి పాజిటివ్ గా ఒక్క ముక్క రాయలేని పత్రికలు… హారతి ఇస్తే ఆకాశానికి మసి అవుతోందంటూ వార్తలు వేసే టీవీలు… సంబరం జరుగుతుంటే 144 సెక్షన్ కోరుకునే అసూయాపరులు మన దగ్గరే … మన చుట్టుపక్కలే ఉన్నారు. ఇలాంటి వాళ్లని ఏం చేయాలో ఇప్పటికైనా తేల్చుకోవాలి. లేకపోతే ఉస్మాద స్వార్థానికి ఏపీ మరోసారి బలి కావాల్సిఉంటుంది.

Read More:

అమ్మ తోడు అమ్మ పేరు ఎత్తితే ఒట్టు

కార్మిక సంక్షేమం గురించి జగనా మాట్లాడేది ?

లక్ష్యంపై గురిపెడితే ఏపీలో ప్రతి ఒక్కడూ బాహుబలే…

హైద్రాబాద్ నుంచి మనల్ని గెంటేస్తున్నారా ?

అద్భుతాలకు అడ్రస్ అమరావతి

ఎందుకీ విష ప్రచారం… నిజం తెలుసుకోండి

 

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title