మండేలా టు మండే… పవన్ ట్వీట్స్ స్టోరీ ఏంటి ?

Written by

 మీరు పట్టుకుంటే పాదాలు… మేం పట్టుకుంటే చరణాలు. రాజకీయాల్లో ఇదో లైన్. దెబ్బకొట్టాలన్నా ఇదే… దెబ్బతిన్నాక తిరిగి లేవాలన్నా ఇదే ! అసలు ఇపుడు రాజకీయం భగ్గుమనడానికి కూడా కారణం ఇదే ! ఏ వైపూ బెండ్ అవ్వకుండా ట్రెండ్ ని చూస్తే అర్థమయ్యే విషయం ఇది. దీనికి ఏ పార్టీ రంగూ వేయాల్సిన అవసరంలేదు. అప్పటివరకూ జరుగుతున్నదే అవతల పార్టీ చేద్దామనుకుంది. అక్కడే కథ అడ్డం తిరిగింది.

ఆ ఇరవైపాతిక మంది ఎమ్మెల్యేలసంగతి వదిలేయండి..ఇది మాత్రమే మేం మాట్లాడతామనడం కచ్చితంగా అవకాశవాదమే! బహుశా ఇదే విషయం చెప్పాలనుకున్నాడా పవన్ ? ఫిలాసఫీని లోతుగా విశ్లేషిస్తే మొదట అర్థం అయ్యే విషయం ఇదే. మొదటి ట్వీట్స్ తో పోలిస్తే…మండే నాటికి కాస్త ఛేంజ్ కనిపిస్తోంది. మండేలా నుంచి మండే నాటికి బండి రూటు కాస్త మారినట్టే అర్థమవుతోంది. ట్రెండ్ ని ఫాలో అవ్వను సెట్ చేస్తా… అని డిఫరెంట్ గా ట్వీట్ చేశారని మొదట అనుకుంటే… ఇదో పిల్లల పంచాయతీ అన్నట్టు పెద్దమనిషి తరహాలో రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారా అని రెండో ట్వీట్స్ తో డౌటొస్తోంది ! ట్వీట్స్ సీక్వెల్ చూస్తే కొత్త స్టోరీ కనిపిస్తోంది.

నెలరోజులైనా రెస్పాన్స్ లేదు. ఉన్నది సస్పెన్సే ! పవన్ మాట్లాడతాడా లేదా అని ఫ్యాన్స్… మాట్లాడడేంటీ ? అంటూ హేట్ చేసే ఫ్యాన్స్ (కరక్టే… పవన్ లాంటి పర్సనాలిటీని హేట్ చేసేందుకు లాయల్ గా కొందరుంటారు వాళ్లని ఫ్యాన్స్ అనే అనాలి.) పోటీ పడుతున్నారు. కొందరేమో బాబుకి పవన్ కీ చెడింది… తొందర్లోనే మూడిందని కూడా అనేశారు. అసలు ఎందుకు చెండింది. ? పోనీ.. ఎందుకు మూడిందంటే సమాధానం లేదు. ఉన్నది ఓన్లీ ఎమోషన్. పవన్ లాంటి పోలరైజింగ్ కేరెక్టర్ ఏది చేసినా ఉప్పెనే ! ఈసారి మాత్రం యోగా డే ఎఫెక్టో ఏమో… కంపోజ్డ్ గా స్పందించాడు. ఆ తర్వాత కాస్త టోన్ మార్చి… డైరెక్ట్ కామెంట్స్ చేశాడనిపిస్తోంది. నాయకులే తిట్టుకుంటుంటే జనం తన్నుకోవాలా ? జనరేషన్స్ ఏమైపోవాలన్న ట్వీట్స్ రెండు పక్కలా మెక్యూరీ లెవెల్స్ ని రైజ్ చేస్తున్నాయ్.

అసలు మొదట మండేలా ప్రస్తావన ఎందుకు ? ఇక్కడ ఎవరు మండేలా ?

ఆలోచిస్తే పెద్ద పజిలేం కాదు. నల్లజాతీయుల కోసం పోరాడారు… ఆపార్థీడ్ అని చెప్తారు దాన్నే ! మండేలా జీవిత కాలంలో అరవైయ్యేళ్లకిపైగా కనిపించేది అదే ! ముప్ఫై ఏళ్ల జైలు జీవితం. ప్రపంచ చరిత్రలో ఇదో శిలాక్షరం. సరే. నల్ల జాతీయులు ఆయన్ని వ్యతిరేకించినా ఆయన మాత్రం వారి కోసం పోరాటం చేశారు. కుట్రల్ని భరించారు. హింసించినా సహించారు. అదే నల్లజాతి మండేలా గొప్పదనాన్ని అర్థంచేసుకోడానికి దశాబ్దాలు పట్టింది. ఇలాంటి విలువలకా మనం శిలువ వేసిందంటూ వ్యతికేతను నిప్పులతో కడిగేసుకుంది. జాతి పితను చేసి యోధుణ్ని గుండెకి హత్తుకుంది. ఇది నిన్నమొన్నటి చరిత్రే ! ఇక్కడ కూడా ఇంచుమించు అదే జరుగుతుండొచ్చు. స్పిరిట్ వరకూ తీసుకుంటే ! జాతి పోరాటం లేదు కానీ కొందరు రాజేసిన వైరంఉంది. విభేదాలు రగిలించి ఆ కొందరు రాజకీయం నడుపుతుంటే… అభివృద్ధి ఎవరు చేశారో, చేస్తారో చూడండి… అంటూ నచ్చచెప్పేందుకు, తెలియజెప్పేందుకు మరో పక్క నుంచి ప్రయత్నం జరుగుతోంది.

నిజానికి ఆ పని చేయాల్సిన అవసరం లేదు. మనకి అప్పజెప్పిన బాధ్యత వేరు. మన రాష్ట్రంవేరు అనుకుంటే అసలు గొడవే లేదు. అలా అనుకోకపోవడం మూలానే తలనొప్పులు, ఏదో రకంగా పరువు తీసి పక్కకు తోసేందుకు అలవిమాలిన ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు. అందుకే పవన్ ట్వీట్ మండేలాని గుర్తుచేసిందా ? వ్యతిరేకించే వాళ్ల కోసం పోరాడుతున్నదెవరు ఇక్కడ ? వ్యతిరేకించే వాళ్ల తరపున కూడా మాట్లాడుతున్నది ఎవరు ఇద్దరిలో ? తెలుస్తూనే ఉంది కదా ! మైండ్ బ్లోయింగ్ మండేలా !

ఇలాంటి ఆలోచన మొదట రెస్పాన్స్. ట్వీట్ స్టోరీ-1. మరీ అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయ్ సినిమాల్లోనేమో రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటూ డైలాగ్ లు వాడేశాం… ఇక్కడ మాత్రం డైరెక్ట్ కౌంటర్ లేకపోతే ఎలా ? అని కాస్త ఆలోచన 48 గంటలు నలిగింది. అందుకే ఆ పీడనం తీరాన్ని దాటింది. మండేలా తర్వాత మండే కామెంట్స్ బహుశా ఆ ఎఫెక్టే !

బాబు – పవన్ మధ్య జరుగుతున్నదేంటి ?

చాలామంది క్రియేటివిటీకి పదును పెడుతున్నారు లాజిక్ వదిలేసి. నిజానికి పవన్ వైఖరేంటి అనేది ఇక్కడ సంబంధం లేని విషయం. పవన్ రాజ్యాంగబద్ధమైన ఏ పదవిలోనూ లేడు కాబట్టి. కాకపోతే… ఎట్రాక్టివ్ ఫిగర్, ప్రశ్నిస్తానన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం అంతే ! ఏపీలో బీజేపీ నాయకుడు సోంవీర్రాజుకి ఎమ్మెల్సీఛాన్స్ ఇచ్చినపుడే అర్థమమైపోయింది అండర్ కరెంట్ ఏంటో ! సోం అభ్యర్థిత్వాన్ని ఓకే చేసింది బీజేపీ ఢిల్లీ నాయకత్వమే అయినా చేయించింది మాత్రం చంద్రబాబే అంటారు. బాబు ఢిల్లీ టూర్ లో అమిత్ షాను కలిసిన రెండ్రోజులకి నామినేషన్ వేశారు వీర్రాజు. ఇంతకీ వీర్రాజెవరు… ?పవన్ వెనక ఉండి సపోర్ట్ చేసిన వాళ్లలో ఒకరని చెబుతారు. మోడీతో ములాఖత్, పొలిటికల్ స్పీచ్ ల రచనలో ఓ చేయి వేడయడం, రాజధాని టూర్ కి గ్రౌండ్ ప్రిపరేషన్ లాంటి వన్నీ చేశారనేది కొందరికి తెలుసు. ఇది ఇండికేషన్ నంబర్ వన్.

రెండోది. రెండు రాష్ట్రాల మధ్యా భగ్గుమన్నాక… పవన్ ఫోన్ లో పలకరించారు చంద్రబాబుని అంటున్నారు సన్నిహితులు. ఏం జరుగుతోంది ? అని తెలుసుకున్నారని అంటారు. అస్తిత్వం మీద దాడి జరుగుతున్నప్పుడు ఆ మాత్రం మాట సాయం మామూలే అంటూ ఆయన పక్కనున్నవాళ్లు తేలిగ్గా తీసేశారు. ఇక మూడోది. పవన్ ఫామ్ హౌస్ లో పండిన మామిడి పళ్లు ప్రత్యేకంగా బాబుకి పార్శిల్ పంపారు. అన్నదమ్ములకి మరో ఒకరిద్దరికీ మాత్రమే ఆయన పంపుతారని దగ్గరగా ఉండేవాళ్లకి తెలుసు. బాబుకి పార్శిల్ తో పంపడంతోపాటు… అనుకున్న పనులన్నీ పక్వానికి రావాలని ఆకాంక్షిస్తూ… అనే మెసేజ్ కూడా ఉంది. అంటే నిప్పు లేనట్టే. పొగరానట్టే ! అనుకోవాలి. కానీ రాజకీయ రుతుపవనాల గమనం, గమ్యాన్ని అంత తేలిగ్గా ట్రాక్ చేయలేం. ట్వీట్ కూడా చేయలేం !

మొత్తానికి కొందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ… ఇంకొందరికి సర్ ప్రైజ్ ఇస్తూ… మరికొందరిని ఆలోచనలో పడేస్తూ పవన్ ట్వీట్స్ హీట్ పెంచుతున్నాయ్. మండేలా లైన్ కీ… మండే ట్వీట్స్ కి తేడా ఏమైనా ఉందా ? ఉద్దేశం మారిందా ? అవసరమైతే ప్రెస్ మీట్ కూడా పెడతా ! అని ఎందుకన్నారనేది ఇపుడు సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు. అవసరమైతే ఏంటి ? అవసరమో కాదో ఇప్పటికీ ఓ నిర్ఱయానికి రాలేదా ? అనే సందేహం కూడా వస్తోందిప్పుడు. ఎమోషనల్ గా ఉంటేప్పుడు… మార్చుకోడానికే అభిప్రాయాలు అనుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ కామన్. కానీ… ఏపీ యాంగిల్ వదిలేసి

ఎవరికి వాళ్లు… మన మైలేజ్, మన ఇమేజ్ అనుకున్నప్పుడే స్టోరీ గ్రాడ్యువల్ గా మారుతుంది. అయన “జానీ” సినిమాలా ఏమి అర్ధంకావట్లేదు.

అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title