బాలయ్యకు పెద్ద రోల్

Written by

బాలయ్యకి రాజకీయం ఒంటబట్టిందండోయ్… బ్లడ్ లోనే రాజకీయం ఉన్న బాలయ్యపై ఏంటీ బ్లడీ ఫూల్ డైలాగ్. తండ్రి ప్రచార రథం మొదలు ప్రభంజనం వరకూ ప్రతిదాంట్లోనూ తనవంతు పాత్ర పోషించిన బాలయ్యకి నిజానికి రాజకీయం కొత్త కాదు. ప్రత్యక్షంగా రంగంలోకి దిగడమే కొత్త. ఇపుడు హిందూపూర్ ఎమ్మెల్యే కూడా అయిన బాలయ్య… ఇపుడు ఓ నిఖార్సైన డైలాగ్ కొట్టారు. జెండా పండగ చేసుకున్నాక… రాజధాని కూడా లేని రాష్ట్రంలో మనం ఇలాంటి వేడుక చేసుకున్నాం అంటూ సెంటిమెంట్ ని టచ్ చేశారు. నిజమే. రాజధాని లేదు. పరిస్థితి బాగా లేదు. అయితే ఇది చాలా పెద్ద విషయం. మామూలుగా ఏదడిగినా బావగారు చూసుకుంటారనో… ముఖ్యమంత్రి గారు చెబుతారనో సింపుల్ గా వెళ్లిపోయే బాలయ్య ఇలా నిశితమైన వ్యాఖ్య చేసే సరికి అభిమానులు సంబపడుతున్నారు.

బాలయ్యకి భారీ బాధ్యతలు…

నిజానికి బాలయ్యకి భారీ బాధ్యతలే ఉన్నాయ్. ఇప్పుడే అవసరం లేదనో… లేదంటే సినిమాల్లో బిజీగా ఉన్నాననో ఆయన మెల్లగా దాట వేస్తున్నట్టు కనిపిస్తున్నారు. సీమజిల్లాల్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషించాలని చంద్రబాబు కోరుకుంటున్నట్టు చెబుతారు. స్వయంగా సీమ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం… అక్కడ ఫాలోయింగ్ భారీగా ఉండడం… పార్టీకి కూడా అండదండలు కావాల్సిన పరిస్థితి ఉండడం ఇవన్నీ కారణాలే అంటారు సన్నిహితులు. నిజానికి ఏ హీరోకీ లేనంత ఫాలోయింగ్ సీడెడ్ ఏరియాలో బాలయ్య సొంతం. అందుకే మొన్నటికి మొన్న లెజెండ్ కూడా అక్కడే రికార్డులు బద్దలుకొట్టింది. ఇపుడు రాజకీయంగా కూడా అదే స్థాయిలో పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలన్నది బాబు వ్యూహం అంటున్నారు. దీని కోసం వార్మప్ కూడా జరుగుతోందంటున్నారు.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య సుదీర్ఘ ప్రసంగం చేయబోతున్నారన్న మాట వినిపిస్తోంది. పట్టి సీమ అప్పటికి ప్రారంభమైపోవచ్చు. సీమకి నీళ్ల కరువు తీర్చి చరిత్ర సృష్టించామని టీడీపీ ప్రకటించుకోవానుకుంటోంది. ఇదే పొలిటికల్ పాయింట్. నీళ్లొస్తే మైలేజ్ రావొచ్చన్న భయంతోనే పట్టిసీమకి విపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయని ప్రభుత్వం ముందు నుంచి ఎదురుదాడి చేస్తోంది. ఇపుడు ప్రాజెక్ట్ పూర్తయితే అసెంబ్లీలో ఘనంగా చెప్పుకోవాని భావిస్తోంది. ఆయన లిస్ట్ లో బాలయ్య కూడా ఉండబోతున్నారని ఇక నుంచి ఆయన క్రియాశీలకంగా కనిపిస్తారని పార్టీ వర్గాలంటున్నాయ్. బహుశా దానికి ముందు శాంపిల్ గానే చూడాలేమో… బాలయ్య వ్యాఖ్యల్ని. చూడాలి మరి బాలయ్య డైలాగులు రియల్ లైఫ్ లోనూ ఏం రేంజ్ హిట్ అవుతాయో !

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title