బాబుని కలవాలంటే బెజవాడ రండి…

Written by

ఇక మాటల్లేవ్ మాటాడుకోడాల్లేవ్. హైద్రాబాద్ కాదు ఇక అన్నిటికీ బెజవాడే. మూడ్రోజులు కాదు ఏకంగా నాలుగు రోజులు ఇక్కడే మకాం. ఇక్కడే దుకాణం కూడా. కేబినెట్ మీటింగ్ బెజవాడలోనే. సమీక్షలు సంప్రదింపులు సాగేదంతా ఇక విజయవాడలోనే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫస్ట్ ప్రోడక్ట్ ని లాంచ్ చేసిన తర్వాత పగడ్బందీ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇంతకు ముందు ఒకటికి పదిసార్లు బెజవాడ బెజవాడ అని చెప్పినా అవేమీ వర్కవుట్ కాలేదు. ఈసారి మాత్రం ఇక అంతా అక్కడే అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు కూడా ఏపీలోనే నిర్వహించే ఊపు వచ్చేసింది కాబట్టి ఇక పాలన మేడిన్ ఏపీ అనుకునే రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయ్.

విదేశీ ప్రతినిధుల్ని కలవాలన్నా పెట్టుబడులు ప్రణాళికలు రూపొందించాలన్న ఇక ఇక్కడికే వచ్చేయండి దాని కోసం ఏర్పాట్లు చూడండి అంటూ సన్నిహితులకి చెప్పారట సీఎం. రెండు మూడు లింక్డ్ శాఖల వ్యవహారాలు ఉన్నప్పుడో… హైద్రాబాద్ లో ఉన్న సంస్థల వ్యవహారాలకి సంబంధించో అయితే మాత్రమే అక్కడ నడుస్తుందట పాలన. నాలుగు రోజులు బెజవాడలో అంటే… ఇక ఒకట్రెండు రోజులు ఎలాగూ జిల్లాలటూర్లు ఉండనే ఉంటాయ్. అంటే మొత్తం అంతా యాక్టివిటీ ఇక ఏపీకి వచ్చినట్టే చెప్పుకోవాలేమో ! శంకుస్థాపన సమయానికి అంతా ఏపీ నుంచే జరుగుతోందనే ఇంప్రెషన్ వచ్చేలా చేయాలన్నది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోందిప్పుడు.

పార్టీ కార్యాలయం గుంటూరులో కట్టి… నాలుగు రోజులు బెజవాడలో మిగతా రోజులు జిల్లాల రూట్లో ఉండే ఇక వీకెండ్ మాత్రమే హైద్రాబాద్. మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ రావడం పెద్ద బూస్ట్ ఏపీకి. మొబైల్ లాంటి ఇండస్ట్రీనే వర్క్ మొదలు పెట్టేస్తే సర్వీస్ సెక్టర్… ఐటీ లాంటివి ఇక రావడం పెద్దవిషయం కాబోదు. అందుకే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ లో భాగంగా ఇక ఏపీకి బెజవాడే ఎపిసెంటర్ అనిచెప్పేందుకు చర్యలు తీసుకుంటోంది
ముఖ్యమంత్రే వస్తే ఇక ఉద్యోగులు రాకపోవడం లాంటి సమస్యలన్నీ క్రమంగా పరిష్కారమైపోతాయ్. విజయదశమికి నాటికి ఏపీకి విజయ దశ మొదలవుతుంది అనేందుకు ఇవన్నీ సంకేతాలు అనుకోవచ్చేమో !

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title