బాక్సాఫీస్‌ను దత్తత తీసుకున్న శ్రీమంతుడు

Written by

నేను కొడితే అదోలా ఉంటుందని.. వాళ్లు వీళ్లు చెప్పడమే కానీ నాక్కూడ తెలియదు. బిజినెస్‌మెన్‌లో మహేశ్‌ డైలాగ్‌ ఇది. ఇపుడు శ్రీమంతుడు రిజల్ట్‌ చూస్తుంటే ఇది నిజమేమో అనిపిస్తుంది. బాక్సాఫీస్‌ను శ్రీమంతుడు దత్తత తీసుకున్నట్లు.. ఆడేస్తోంది మూవీ. సీడెడ్‌, నైజామ్‌, ఆంధ్ర, ఓవర్సీస్‌.. ఇలా అన్ని ఏరియాలను దత్తత తీసేసుకుంది. ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులన్నీ ఇపుడు మహేశ్‌ శ్రీమంతుడివే.. జస్ట్‌ నాలుగు రోజుల్లోనే 50 కోట్లు కొట్టేసింది. తుఫాన్‌లా స్టార్టైన మహేశ్‌ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.

ఫస్ట్‌ డేలోనే కాదు.. ఫస్ట్‌ వీకెండ్‌లోనూ సరికొత్త మార్క్‌ సెట్‌ చేసింది శ్రీమంతుడు. మహేశ్‌ బాబు సైకిల్‌ మీద వస్తే ఇంపాక్ట్‌ ఇంతుటుందా..? అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. నైజామ్‌లో నాలుగు రోజులకే 12 కోట్లు వేస్తే.. కోస్తా జిల్లాలో ఆ మార్క్‌ను దాటేసింది సూపర్‌స్టార్‌ మూవీ. కృష్ణా, గుంటూరు, ఈస్ట్‌, వెస్ట్‌ లెక్కలు మతి పోగొడుతున్నాయి. రెండు ఫ్లాపులొచ్చిన తర్వాత వచ్చిన సినిమా ఇలా కాసులు కురిపించగలదా..? అని షాకవుతున్న వారూ ఉన్నారు. శ్రీమంతుడు కలెక్షన్స్‌తో ఫ్యాన్స్‌ కూడా ఖుషీ అవుతున్నారు. మనోడి సినిమా హిట్టైతే.. ఇంపాక్ట్‌ ఇలానే ఉంటుందంటూ కాలరేగస్తున్నారు.

నైజామ్‌, కోస్తా జిల్లాల ఏరియాలు మహేశ్‌కు ఎప్పటి నుంచో పెట్టిన కోటలు. కానీ ఎన్నడూ లేనట్లు సూపర్‌స్టార్‌ మూవీ సీడెడ్‌లో అదరగొడుతుంది. వీకెండ్‌లోనే 5 కోట్లను వెనకేసుకేసింది. ఇక ఓవర్సీస్‌లో కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. అల్‌ ఏరియాస్‌లో అదరగొడుతున్న శ్రీమంతుడు.. అదే ఊపును కంటిన్యూ చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. ఇండస్ట్రీలో నెంబర్‌ టూ ప్లేస్‌ మారుతుందంటున్నారు ట్రేడ్‌ ఎక్స్‌పర్ట్స్‌. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే.. మహేశా..! మజాకా..!

పవన్‌

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title