పుష్కర స్నానం చేయు విధానం

Written by

కోటి కిశోరాల వెలుగు గోదావరి
నిండుపున్నమి చల్లదనం గోదావరి
వెండి వెన్నెల పంట గోదావరి
ఇసుక తిన్నెల అందాలు గోదావరి
సప్త సిరుల సరిగమలు గోదావరి
సుమ సుగంధాలు గోదావరి
విహంగాల కిలకిలలు గోదావరి
ప్రకృతి పులకింత గోదావరి
సిరులెన్నో తెచ్చింది గోదావరి
సంపదలు ఇచ్చింది గోదావరి
పాపాలు పోగొట్టు గోదావరి
పుణ్యాల పూబుట్ట గోదావరి
పుడమిపై గలగలా ఉప్పొంగి ప్రవహించు అమృత ఝరి అమ్మ గోదావరి !!!

పోతనామార్త్యులు విష్ణు కథలను ఆంధ్రీక రించుటకై, ఈ పవిత్ర గోదావరి నది ఒడ్డున ఈశ్వరుని ప్రార్థిస్తూ జపం చేస్తుంటే, రామచంద్ర మూర్తి ప్రత్యక్షమైశక్తి నిస్తున్నాను ఆంధ్రీక రించు అన్నారు. అందుకే ఆయన పలికెడిది భాగవతమట పలికించెడివాడురామభద్రుడట అని రాసారు. గంగా గౌతమి గోదావరి తల్లి , పయోధార పరమ శివుని జటా ఝూటము నుండి వచ్చిన తల్లి. గౌతమ మహర్షి వలన వచ్చిన ప్రవాహము గోదావరి. ఇంతటి ప్రాశస్త్యం, పవిత్రం, పుణ్య ప్రదాయిని , జీవ నది అయిన తల్లి గోదావరి లో పుష్కర స్నానం ఆచరించడం యోగాదాయకం.

పుష్కర స్నానం చేయు విధానం:

పరమ శివుని మూడవ కంటి లోని మంట లోనించి ఒక కృఛి పుట్టింది. ఆ కృఛి నాకు ఆకలి వేస్తోంది ఏం తినమంటారు అని పరమ శివుని అడిగింది. అప్పుడు ఆయన ఎవరైతే పుష్కరస్నానం చేసి బయటకు వస్తారో వాళ్ళకు అపారమైన పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం నువ్వు తినెయ్ అన్నారు. ఎవరైతే పుష్కరస్నానం చేసే ముందు నది ఒడ్డున ఉన్న మట్టిని తీసి నదిలోకి విసిరి , నమస్కారం చేసి , మంత్రం చెప్పి , అప్పుడు పుష్కరస్నానం చేస్తారో వాళ్ళని మాత్రం విడచిపెట్టు అని చెప్పారు. కావున పుష్కరస్నానం చేసే ప్రతీ వారు నది లోకి చిటికెడు మట్టి విసిరి ఈ క్రింది మంత్రం చెప్పి స్నానం చెయ్యాలి. లేదంటే వారి పుణ్యాన్ని కృఛి తినేస్తుంది . కావున ప్రతివారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవలసినది అని పూజ్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనంలో చెప్పబడినది.

మంత్రం :
“పిప్ప లాదా త్సముత్పన్న కృత్యే లోక భయంకరి
మృత్తి కాంతే మయా దత్తా మహారార్థం ప్రకల్పయ”

నది ఒడ్డున ఉన్నకొన్నిముఖ్య నగరాలు మరియు పట్టణాలు:
నిర్మల్, ఆదిలాబాద్
బాసర, ఆదిలాబాద్
బట్టాపూర్, నిజామాబాద్
ధర్మపురి, కరీంనగర్
గూడెం గుత్తా, ఆదిలాబాద్
మంథని, కరీంనగర్
కాళేశ్వరం, కరీంనగర్
మంచిర్యాల, ఆదిలాబాద్
భద్రాచలం, ఖమ్మం
యానాం, పాండిచేరి
రాజమండ్రి, ఈస్ట్ గోదావరి
కొవ్వూరు, వెస్ట్ గోదావరి
నర్సాపురం, వెస్ట్ గోదావరి
అంతర్వేది , వెస్ట్ గోదావరి.

మహా పుణ్యాన్ని ప్రసాదించే మహా పుష్కర స్నానం చేయండి, పునీతులుకండి.

సర్వే జనా సుఖినో భవంతు

మీను శ్రీరామ్ .

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title