ద అదర్ సైడ్ ఆఫ్ చంద్రబాబు…

Written by

ముభావంగా ఉండడం ఆయన స్వభావం. ఫార్మల్ గా కనిపించడమే ఆయన దృష్టిలో నార్మల్. పగలబడి నవ్వడం పొలిటిక్స్ లో కుదరదంటారు. తింటూ కనిపించడం కరెక్ట్ కాదంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా డెమక్రసీ ప్రకారం మనం… అంటూ మొదలవుతాయ్ ఆయన మాటలు. ఇవన్నీ చంద్రబాబు కల్టివేట్ చేసుకున్న హేబిట్స్. అటూ ఇటూ కాస్త కూడా బెసక్కపోవడం ఏ పరిస్థితుల్లో అయినా ఒకేలా ఉండాలనుకోవడం తన స్టైల్. అధికారంలో ఉన్నా అదే తీరు… విపక్షంలోనూ అంతే. అమరావతి పర్యటనలోనూ అదే అప్పీల్. దావోస్ లోనూ అంతే ! ఇదంతా ఆయన మేనరిజమ్ అని కొందరంటే, కల్ట్ ఆఫ్ చంద్రబాబు అంటూ చెప్పుకునేవాళ్లు ఇంకొందరు. ఎక్స్ ప్రెషన్ ఎలా ఉన్నా ఆయన విషయంలో ఒకేఒక్క ఫీలింగ్ మాత్రం ఎనానిమస్ గా ఉంటుంది. చంద్రబాబు బోరింగ్.

కాదూ మరి ! ఒకేలా మాట్లాడుతూ… ఒకేలా ఉంటూ… ఒకే షెడ్యూల్ మెయింటైన్ చేస్తూ… పద్ధతి పద్ధతి అంటూ పక్కకి జరక్కుండా ఉంటే ఎవరి కైనా ఇలాంటి ఫీలింగ్ కలగడం సహజం. పైగా ఎగిరిగంతేసే విషయంలో అయినా, కుంగిపోయి లొంగిపోయే విషయంలో అయినా ఆయన తీరు ఒకేలా ఉంటుంది. దీన్ని స్థితప్రజ్ఞత అనే పెద్దమాటలో ఇరికించేసి చేతులు దులిపేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇదంతా ఆయన పంథా ! పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు… కోట్లమంది మనల్ని చూస్తున్నప్పుడు కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసుకుంటాం బ్రదర్… వాటిని ఫాలోకావాల్సి ఉంటుంది. ఒక్కో కొత్త విషయం గ్రహిస్తూ అప్ డేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది అంటారు. వ్యక్తిగత సంభాషణలో కూడా ! దీన్ని బట్టీ ముందు అనుకున్న మాట నిజమే అని ఫిక్స్ అయిపోకండి. ఇదంతా వన్ సైడే !

ద అదర్ సైడ్ ఆఫ్ చంద్రబాబు…

హి ఈజ్ ఏ ఫ్యామిలీ మేన్ యాక్చువల్లీ. వారంలో ఒక్క రోజు కూడా ఫ్యామిలీతో గడపని మనిషి… రోజులో 18 గంటలు ఏదో పనిలో బిజీ అయ్యే మనిషి… ఫంక్షన్లు హంగామాలకి దూరంగా ఉంటాననే మనిషి ప్యామిలీ మేన్ ఎలా అవుతాడు ? అదే కాంట్రాస్ట్. ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి నప్పటి నుంచే కాదు.. వెంకటేశ్వరా వర్సిటీ కేంపస్ లో ఉన్నప్పటి నుంచి చంద్రబాబు కలుపుగోలు మనిషి. ఎన్టీఆర్ కుటుంబంతో కలిశాక… ఉమ్మడి కుటుంబం ఎఫెక్ట్ కూడా బాబు మీద ఉందంటారు. అయితే మంత్రి అయిపోవడం… ఆ తర్వాత సీఎం కావడం లాంటివన్నీ ఆయన యాటిట్యూడ్ లో మార్పులు తెచ్చేశాయ్. అందుకే ఆ బాధ్యతలు భార్య భువనేశ్వరి చూసుకుంటుందని ఆయనే చెబుతారు. ఇప్పటికీ ప్రతి ఆదివారం రెండో పూట ఫ్యామిలీకే అంటారు. యోగా, వర్కవుట్స్, మెంటల్ పీస్, కాంటెంపరరీ డెవలప్ మెంట్స్, వెనిజులాని చావెజ్ అంతలా ఎలా గెలిచాడు… లాంటి డిస్కషన్స్ ఆయన ఫేవరెట్ సజ్బెక్ట్స్. అయితే మొదట చెప్పిన మాటే కరెక్ట్ అని ఫిక్స్ కాకండి.

ప్రతి ఏటా టూర్… టాప్ గేర్..
.

ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా… ఎంత సీఎం అయినా… వెకేషన్ ఆయనకి ఇయర్లీ అకేషన్. ముందు నుంచీ ! సింగపూర్ కో … అమెరికానో లేదంటే యూరోప్ నో ఓ రౌండ్ వేసి వచ్చేస్తారు. కుటుంబసభ్యులంతా ఇందులో ఉంటారు. ఒత్తిళ్లు రాజకీయాలకి దూరంగా టూర్ ఉండాలని ఏడాదిలో ఓ వారం అయినా మనల్ని నమ్ముకున్నవాళ్లకి కేటాయించాలంటారు. వర్క్ కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటున్నాం… అలాంటప్పుడు మనల్ని మనం రీ ఇన్వెంట్ చేసుకునే కాన్సెప్ట్ ని కూడా ఎందుకు ఫాలో కాకూడదు ? అనే కాన్సెప్ట్ ఈ టూర్ కి బేసిస్. ఇపుడు టర్కీని ఎంచుకున్నది కూడా ఇందుకే. ఆసియా మైనర్ గా పాపులర్ అయిన టర్కీ సంప్రదాయ పద్ధతిలో ఆధునిక నిర్మాణాలకి ఫేమస్. ఇపుడు అర్థమైపోయిందిగా టర్కీనే ఎందుకెళ్లారో !

ఎక్కడికెళ్లినా… ప్రతి రోజూ ఏ క్షణంలో అయినా టచ్ లోకొస్తారని దగ్గరగా ఉండేవాళ్లు చెబుతారు. కానీ ఇక్కడుంటే ఎలా ఉంటుందో తెల్సుగా అందుకే పెద్దగా డిస్టర్బ్ చేయలేమంటారు. టూర్ వెళ్లారు కదాని… బెర్ముడా షర్ట్స్ లోనో… రౌండ్ హ్యాట్ తోనో… ఫిష్షింగ్ చేస్తూనో..గోల్ఫ్ ఆడుతూనో చంద్రబాబును చూడాలనుకుంటున్నారా ? అంత ఈజీ కాదు. అసలు అలా ఉండారని అనుకోలేం. పిల్లలు రిలాక్స్ అవుతారు… మనం మాత్రం కాస్త మనసు విప్పి మాట్లాడతామంతే కదా అని తేలిగ్గా చెప్తారు… ఇబ్బందిపడ్తున్న ఇండికేషన్ ఇచ్చే చిరునవ్వుతో ! ఏడాదికోసారి వెళ్లే పర్సనల్ టూర్ వెనక ఇంత స్టోరీ ఉందన్నమాట !

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title