తెలంగాణ ఆబోతులు అమరావతిపై రంకెలెందుకేస్తున్నాయ్ ?

Written by

ఓ పక్కనుంచి పరువు పోతూనే ఉన్నా అరువు మాత్రం ఆపడంలేదు మనం. ఏపీకి ఇదే అసలుసిసలు దరిద్రం. నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. కానీ… ఒప్పుకోక తప్పదు. ఏపీ రాజధాని నమూనా మీద పక్క రాష్ట్రం జర్నలిస్టు ఒకాయన గంటూరు ప్రొగ్రెస్సివ్ జర్నిస్టుల మీటింగ్ పేరుతో చేసిన వ్యాఖ్యలతో కడుపుమండి చెబుతున్న మాటలివి. ఏపీ రాజధానిలో తెలుగు ఆత్మ లేదట. తెలుగు సంస్కృతి సంప్రదాయం అమరావతిలో ప్రతిబింబించకపోవడం శోచనీయమట. హవ్వ…!! అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన ఇలాగే రోదిస్తుంటాడు. ఏపీలో పౌరసమాజం క్రియాశీలకంగా లేదని ఓసారి… రాజధాని పేరుతో ఘోరం జరిగిపోతోందంటూ ఇంకోసారి భోరుమంటాడు. వాడుక భాషలో దీన్ని ఏడుపు అనాలి.

తెలుగు కవులు, కళాకారులు సంప్రదాయవాదులకి నమూనా ప్రాధాన్యం లేదంటున్నాడు ఆయన. ఎలా చెప్పగలడు ? అసలు చెప్పడానికి ఆయన ఎవరు ? ఆయన ఎడిటర్ గా పనిచేసే పేపరు పేరులోనే ఆంధ్ర అని ఉన్నా… ఆంధ్రులెవరూ తెలంగాణ సమస్యలు ప్రస్తావించకూడదంటాడు. మరి ఆంధ్ర వ్యవహారాలపై ఆయన ఎలా మాట్లడతాడు ? ఇదే తొలిసారి కాదు కూడా ! ముందు ఆయన మాట్లాడిన మాటల లోతెంతో చూద్దాం ! రాజధానిలో ఉన్నది తెలుగు నేల మీద. తెలుగు వాళ్ల కోసం. అమరావతి అనే పేరు పెట్టడమే ఓ అద్భుతం. చరిత్ర తెలిసిన తెలుగువాడు ఎవడికైనా రోమాలు నిక్కబొడుకునేంత ఉగ్వేదం ఉంది ఆ పేరులో. పైగా ఇప్పుడొచ్చింది రోడ్లు… ల్యాండ్ ఎలాట్మెంట్… ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది అనే వివరాలు మాత్రమే. చౌరాస్తాలు, సర్కిళ్లు తెలుగుదనం అంతా పనులు మొదలయ్యాక వచ్చే విషయాలు. ఇప్పుడే ఏదో ఒకటి ఓ రాయి వేస్తే పడి ఉంటుందిలే అనే ధోరణి ఎందుకు ?

రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టినపుడు ఈ మేథావుల గొంతు తెలంగాణ విషంతో పూడుకు పోయింది. అప్పుడెవరూ ఏపీ విషయం వినిపించ లేదు. హైద్రాబాద్లో ఉద్యమం పేరుతో జరుగుతున్న హడావుడిని మీడియా అడ్డగోలుగా చూపించినప్పుడు, ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు వీళ్లంతా సంతోషించారు. అదే ఏపీ ఆవేదనతో రోడ్డెక్కితే అదేమంత విషయం కొట్టి పారేశారు ఇలాంటి విషపురుగులంతా ! మీడియా హైద్రాబాద్ లో ఉన్న పాపానికి ఐదు కోట్ల ఆంధ్రులకి తీరని ద్రోహం జరిగితే వీళ్లకి బాగానే ఉంటుంది. రైతు ఆత్మహత్యలతో తెలంగాణ అల్లాడిపోతున్నా… కనీస హక్కులు హరించి… విషం కక్కుతున్నా వీళ్లకి ఉత్సవం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏపీ గుడ్డు మీద ఈకలు పీకడానికి మాత్రం క్యూ కట్టేస్తారు ఇలాంటి వాళ్లంతా ! అయినా తగలబెట్టి పోయినవాళ్లు వాళ్లంతా. వాళ్లని తిట్టుకొని ఏం లాభం ? వాళ్లని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటున్న మనవాళ్లకి ఉండాలి. కూలిచ్చి ఎదురు తిట్టించుకోవడం ఎందుకో ఎవడికి వాడే ప్రశ్నించుకోవాలి. ఓఆంధ్రా పాత్రికేయుడు తెలంగాణ నడిబొడ్డున అక్కడి ప్రభుత్వ తీరును ప్రశ్నించమనండి. రేషనల్ గానే వాళ్లలా విషయం కక్కనక్కర్లేదు. అప్పుడు తెలుస్తుంది వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో !

తెలుగు వాళ్లమని చెప్పుకోడానికే ఇష్టపడడం లేదు తెలంగాణ ప్రభుత్వం. ఉద్యమం అంటూ గొంతెత్తిన కవులు కళాకారుల్ని కూరలో కరివేపాకులా పక్కన పడేసింది. వాళ్ల గురించి ప్రశ్నించమనండి. కరుణామయుడు చెప్పినట్టు… మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి. మా మానాన మమ్మల్ని వదిలేయండి. మనం కూడా… ఇప్పటికైనా మారదాం. బుద్ధి తెచ్చుకుందాం. మన ప్రైడ్ మన కేపిటల్… మన ఉత్సాహం… మన ఎమోషన్ ఇదంతా. మన వంటల రుచి ఎవడో నిర్ధారిస్తే ఎందుకు ఊరుకోవాలి. థింక్ లాజికల్లీ !

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title