టాలీవుడ్ కి కేసీఆర్ షాక్

Written by

సినీ ఇండస్ట్రీకి సపోర్టు…క్రియేటరు అంటూ కేసీఆర్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్తోంది టాలీవుడ్. కొన్నాళ్లుగా ఈ సీన్ చూస్తున్న వాళ్లకి ఒక్కటే అనిపించేది. అరెరె… ఇన్ని సినిమాలు చూసి ఒక్కడి యాక్షన్ కి పడిపోయారా అనే డౌటొచ్చేది. ఇప్పుడిక అనుమానాలు కాదు… భయాలు కాదు. అసలు కేరెక్టర్ బైటపడుతోంది. క్రియేటర్ కేసీఆర్ టాలీవుడ్ మీద తొలి పంజా విసిరాడు. ఏపీ ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్ కి ఇచ్చిన భూమిని వాపసు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. రేపోమాపో తెగనమ్మి సొమ్ము చేసుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం. హైద్రాబాద్ లో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పాతికేళ్లనాడు ఇచ్చిన భూమిని ఇలా తన్నుకుపోయేసరికి టాలీవుడ్ కి దిమ్మదిగిరి మైండ్ బ్లాంక్ అవ్వడమంటే ఏంటో తెలుస్తోంది.

అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్ కోసం 35 ఎకరాల భూమి కేటాయించింది. అందులో ఓ 15 ఎకరాల భూమిలో ఇప్పటికీ ప్రాజెక్టుల నిర్మాణమేదీ జరగలేదు. ఇగిదో కడతాం…అదిగో కడతాం అంటూ ఇండస్ట్రీ రాజకీయాలతో సాగుతూ వచ్చింది గొడవ. ఇపుడు ఆ భూమి వెనక్కి తీసుకొని 600 కోట్లకి అమ్మేందుకు కేసీఆర్ ప్లాన్ రెడీ చేశారు. ఎకరం 40 కోట్లు విలువ చేసే ల్యాండ్ పుణ్యానికిస్తరా.. సినిమా వాళ్లకి అంటే సౌండ్ లేదు ఇవతల పక్కన. ఇదంతా స్వయంకృతం. ఇన్నాళ్లూ అంతర్గత రాజకీయాలతో భూమి చేతిలో ఉన్నా ఖాళీగా ఉంచారు. పేద కళాకారులకి సాయం చేయాలంటూ ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగారు ఉమ్మడి రాష్ట్రంలో. తీరా ఇపుడు కేసీఆర్ తన్నుకుపోయేసరికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయ్.

ఇండస్ట్రీకి బొమ్మ కనిపించినట్టేనా ?

రాష్ట్రం విడిపోయినా టాలీవుడ్ హైద్రాబాద్ లోనే ఉంటుంది. అంటూ ఏపీకి వచ్చేందుకు మొండికేస్తూ… పైగా ఎదురుదాడి చేస్తున్న సినిమా పెద్దలు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. బాంధవుడు… ఆదుకున్నాడు… అక్కున చేర్చుకున్నాడంటూ దాసరి, మోహన్ బాబు, సురేశ్, రాజేంద్రప్రసాద్ లాంటి వాళ్లంతా ఎంత భజన చేసినా పడాల్సిన దెబ్బ పడిపోయింది. ఉన్నదే లాక్కునే ప్రభుత్వం…కొత్తగా ఇస్తుందని ఆశలు ఎలా పెట్టుకుంటారు ? అందుకే కళ్లు తెరవాలి తెరవాలి అనే ఆలోచనలు నాలుగ్గోడల మధ్య మీటింగ్ లో వినిపిస్తున్నాయ్. మరి ఏం చేయాలి ఎలా చేయాలి… అనే విషయంలో క్లారిటీ వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందేమో !

సినిమా ఇండస్ట్రీ అంటేనే పచ్చగా ఉన్న చోట మేసి… వెచ్చగా ఉన్న చోట కునుకేసే టైపు. రండి రండి అంటూ బుజ్జగించి… నెత్తిన పెట్టుకునే అమాయక బాబులు పనికిరారు వాళ్లకి. కచ్చితంగా తమలాగే ఉండే కేసీఆర్ లాంటి సీఎం ఎదురైతే తెలుస్తుంది అసలు సంగతేంటో ! ఇపుడు సీన్ ఇదే. ఇక ఇప్పటి నుంచి ఏపీ వైపు యాక్టివిటీ పెరిగేందుకు ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు వచ్చివాలిపోతుంది టాలీవుడ్ అని అయితే చెప్పలేం. హైద్రాబాద్ మార్కెట్ ని అంత తేలిగ్గా వదులుకోదు కదా ! కాకపోతే వైజాగ్ చుట్టుపక్కల స్టూడియోలు… భూ కేటాయింపుల కోసం లాబీయింగ్ లాంటివి స్పీడప్ చేసి ఏపీలోనూ పునాదులు వేసుకునేందుకు ప్రయత్నం చేయబోతున్నట్టు సిగ్నల్ ఇస్తోంది టాలీవుడ్. అదేంటో మనోళ్లకి కేసీఆర్ కర్రుకాల్చి వాత పెడితేగానీ బల్బ్ వెలగదు !

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title