జగన్ దివాళా తీశాడా ? ఐదు కారణాలు…

Written by

రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి దివాళా తీసే స్థాయిలో ఉన్నాడని చెప్పడానికి ఐదు కారణాలు ఠక్కున చెప్పేయొచ్చు. రాష్ట్రం భవిష్యత్, ఇప్పుడున్న సంకట పరిస్థితి, విభజన తర్వాత ఎదుర్కొంటున్న దుస్థితి లాంటివేమీ పట్టించుకోకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడిన సందర్భాలు చాలా ఉండొచ్చు కానీ. ఏపీకి ఎర్త్ పెట్టే డిమాండ్స్, కామెంట్స్ ఏమేం చేశారో ఓ లుక్ వేద్దాం.

1. టీడీపీ కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోవాలి – జగన్ డిమాండ్

బాసూ కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకుంటే ఆ ఒక్క మొహమాటం కూడా చెడుతుంది. అప్పుడిక కేంద్రంపై ఎంత ఒత్తిడి తెచ్చినా అదంతా రాజకీయం కోటాలోకి పోతుందే తప్ప ఏపీకి ఒరిగేదేం లేదు. అయినా జయ, నితీశ్ లాంటి స్టేచర్ ఉన్న నాయకులతో దోస్తీ కోసం మోడీ ఆత్రపడుతున్నాడని కళ్ల ముందు కనిపిస్తుండగా నీకేదో ఛాన్స్ వస్తుందనుకోవడం రాజకీయ అమాయకత్వం కదా !

2. పట్టి సీమ కడితే ఎగువ రాష్ట్రాలు వాటాకొస్తాయ్… – జగన్

సీమకి నీళ్లివ్వొద్దా ? పోలవరం పూర్తవడానికి నాలుగైదేళ్లు పడుతుంది కదా ఆపేద్దామా? అంటే నీ వైపు నుంచి సమాధానం లేదు. పైగా ఎగువ రాష్ట్రాలకి లేనిపోని ఆలోచనలు రప్పించేంత మూర్ఖంగా మాట్లాడ్డం చూస్తుంటే పాత ముతక జోక్ గుర్తొస్తోంది. ఏవండి ఇంట్లోకి దొంగొచ్చాడు పట్టుకున్నా అని పెళ్లాం చెబితే… కొరుకుతాడేమోనేవ్, జాగ్రత్త అన్నాట్ట మొగుడు. అలా ఉన్నాయ్ భయ్యా నీ మాటలు…

3. ప్రభుత్వం కూలిపోతుందని జ్యోతిష్యులు అంటున్నారు… జగన్

ఇలాంటప్పుడే నువ్ చిచ్చిబుచ్చిలా కనిపిస్తావ్. నాలుగేళ్లు కాళ్లరిగేలా తిరిగినా… జనాన్ని పోగేసి సినిమా క్రేన్ లు పెట్టి టీవీలో చూపించుకున్నా పదేపదే శ్రద్ధాంజలి మాటలు చెప్పుకున్నా వాస్తవాలు మర్చిపోలేదు జనం. దాని ఫలితమే ఇప్పుడు నువ్వున్న పొజిషన్. వాస్తవాన్ని గ్రహించడం మాని మనీమనీ సినిమాలో చిరంజీవి-బాలక్రిష్ణ-నాగార్జున-వెంకటేష్ అని బ్రహ్మీ డైలాగ్ చెప్పినట్టు ఎందుకు బాసూ పదే పదే ఇదే మాట !

4. కేసీఆర్ తో కలిసి పనిచేస్తే తప్పేంటి ? – జగన్

బాస్… రాష్ట్రాన్ని విడకొట్టడానికి ప్రధాన కారకుణ్ని ఇలా సపోర్ట్ చేయడం…అందులోనూ విపక్ష స్థానంలో ఉండి జనం నాడిని పట్టించుకోకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేయడం ఇక నీ విచక్షణకి సంబంధించిన వ్యవహారం. అసలే కడుపు రగిలిపోతున్న ఏపీకి ఇలాంటి మాటలు ఎసిడిటీని పెంచుతాయని నువ్ తెలుసుకోకపోవడం ఆశ్చర్యం !

5. ఓటుకి నోటు కేసులో చంద్రబాబుని ఏ1 చేయాలి… జగన్

పక్క రాష్ట్రం చేస్తున్న రాజకీయాన్ని నువ్ తలకెత్తుకున్నావంటే… కేసీఆర్ కీ నీకూ ఉన్న బంధానికి బర్త్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నట్టే. డీఎన్ఏ టెస్ట్ లో మీ రిలేషన్ ని ప్రూవ్ చేసుకున్నట్టే. ఇలాంటప్పుడే అధికార పక్షం పని సింపుల్ అయిపోతుంది. కేసీఆర్ – జగన్ ఒకటేగా అంటే సరిపోతుంది మిగతా సంగతి జానానికి అర్థమైపోతుంది. ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతాయ్ బ్రదర్… !

 

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title