కేంద్రం జోక్యం చేసుకోపోతే కేసీఆర్ కి మూడినట్టేనా ?

Written by

ట్యాపింగ్ గొడవ హీట్ పెంచుతోంది సైలెంట్ గా. బెజవాడ కోర్టు తీర్పు సుప్రీం వరకూ వెళ్లి… అక్కడ కూడా ఆమోదముద్ర పడ్డాక పక్క రాష్ట్రంలో ఉక్కపోత ఎక్కువైంది. ఏం చేయాలో తెలియడం లేదు. ఆధారాలున్నాయ్… నంబర్లు కళ్ల ముందు కనిపిస్తున్నాయ్. అసలు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వెళ్లిందంటేనే ట్యాపింగ్ జరిగిందని అర్థం. మరి గోతిలో పడ్డట్టేనా ? హైకోర్ట్ లో వాడీవేడీ వాదనలు జరుగుతున్నాయ్. కోట్లకి కోట్లు పెట్టి రాంజెఠ్మలానీని రంగంలోకి దించింది పక్క రాష్ట్రం. కాల్ డేటా కేసులో. ఇంత హడావుడి జరుగుతోందంటే ఇదంతా దేనికి సంకేతం ? పేలిన డైలాగులన్నీ ఇపుడు ఎటు పోయాయ్ ? బ్రహ్మదేవుడు కూడా కాపడలేడన్న మాట ఇప్పుడు ఎవరికి వర్తిస్తుంది ? అద్దంలో చూస్కుంటే తెలుస్తాయ్ అబద్ధాలు… నిజాలు.

కేంద్రం ఏం చేయబోతోంది ?

పంచాయతీ కేంద్రం కోర్టువరకూ వెళ్లింది. వదలమంటే ఏపీకి కోపం… సర్దుకుపొమ్మంటే తెలంగాణ తలకెక్కదు. ఇదే అదునుగా వాడుకుందాం అనుకుంది బీజేపీ మొదట్లో. కానీ… వ్యవహారం కోర్టులో ఉన్నప్పుడు ఆధారాలు బలంగా ఉన్నాయని హోం శాఖ కూడా నిర్ధారించాక అంపైర్ గా కన్నా ఆడియెన్స్ లో కూర్చోవడమే నయం అనుకుంది కేంద్రం. అందుకే ఇపుడు తెలంగాణకి కొత్త రంథ్రాలు బైట పడుతున్నాయ్. ట్యాపింగ్ ఘోర నేరం. పక్కరాష్ట్రం వ్యవహారాలపై నిఘాపెట్టి… పత్తిత్తు కబుర్లు చెప్పి, సవాళ్లు విసిరి జాతీయ స్థాయిలో రచ్చ చేయాలనుకొని… బొక్కబోర్లా పడ్డాక ఇపుడు తేరుకునేందుకు తంటాలు పడుతోంది. ఇదే స్పీడు కొనసాగితే ట్యాపింగ్ ఉచ్చు టీ మెడకు చుట్టుకోవడం ఖాయం అనిపిస్తోంది.

ట్యాపింగ్ చేస్తే…

ట్యాపింగ్ జరిగింది. ఆదేశాలు అధికారికంగా వచ్చాయ్. వాటిని బైటపెడితే తెలంగాణ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకి దిగే అవకాశం కచ్చితంగా ఉంది. వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయ్ కాబట్టి టెలికాం కంపెనీలు సుప్రీం వరకూ వెళ్లాయ్. అక్కడ కూడా ఇవ్వాల్సిందే అన్నాక ఇక మరో దారి లేదు. ట్యాపింగ్ ఆదేశాలిచ్చిన ఇంటిలిజెన్స్ ఐజీ సెలవులో వెళ్లిపోయారు. మరో ఐపీఎస్ హైడింగ్. ఏసీబీ నోరెత్తడం లేదు. లేఖరు రాసిన ఇద్దరు మంత్రులు ఏమవుతారు ? ఓ కేంద్రమంత్రి ఓ ఎమ్మెల్యే మరో ఎంపీ ఫోన్లే ట్యాప్ చేసిన నేరం ఇపుడు రామ క్రిష్ణ హెడ్గే సీన్ ని చూపిస్తోంది కేసీఆర్ అండ్ కో కి. మరీ మెతక చంద్రబాబు ఏం చేస్తాడిప్పుడు. డెమక్రసీ బ్రదర్ అని చూసీచూడనట్టు పోతారా ? చుట్టబెడతారా ?

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title