కార్మిక సంక్షేమం గురించి జగనా మాట్లాడేది ?

Written by

ఈనాడుతో ఎప్పటికప్పడు పోటీ అంటావు నీవు వాళ్లిచ్చే జీతాలు మాత్రం నేనివ్వనంటావు నీవు ఇదెక్కిడి నీతి నాయనా..? ఇదేం ఘోరం నాయనా..? రామోజీ కార్మికుల సంక్షేమం చూస్తూ ఎదుగుతున్నాడు నీవు ఏ కార్మికుడి సంక్షేమం కోరుతున్నావు..? దళారీల కబంద హస్తాల్లో ఇరుక్కు పోయిన నీకు ప్రభుత్వాని ప్రశ్నించే హక్కుందా..? మునిసిపల్ కార్మికుల జీతాలు పెంచమనే ముందు నీ సాక్షి సిబ్బంది జీతాలు పెంచి చూపించు జగన్…

నీ కోసం, నీ ఇమేజ్ కోసం పని చేస్తున్న నీ సాక్షి ఎంప్లాయిస్ సంక్షేమం నీకు పట్టదా..? ఎవరు ఏం చెప్పినా మేడాం చూసుకుంటుందిగా అంటావ్ ఏది చెప్పినా నాకు తెలియదన్నట్టు అమాయకంగా ఫేస్ పెడతావ్. కేవలం మూడువేల మంది సంక్షేమమే పట్టించుకోని నీవు మూడుకోట్ల మంది సంక్షేమం ఎలా చూస్తావు నీవు..?ఎవడో ఏదో బ్రీఫింగ్ ఇచ్చేస్తే చెప్పడం కాదమ్మా..నీ రియల్ లైఫ్ చూడు ఎంతందంగా ఉందో..రెండేళ్లూగా సాక్షి ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నావు అది నీకు లియదా..? మధ్య దళారులకేమో వేలకు వేలు పెంచేశావ్. వాళ్ళకిచ్చే జీతాలతో మరో 100 మందికి జీవన భృతి కల్పించవచ్చనే ఇంగితాన్ని కూడా లేదా నీకు..? కార్మికులతో రాత్రింబవళ్ళు పని చేయించుకుంటూ వారి సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేశావు. ఇదేనా నీవు చేసే సంక్షేమ పాలన ..?

నీ ఆస్తులను రక్షించుకునే క్రమంలో..మెర్జింగ్ పేరుతో నాలుగైదు యూనిట్లను కలిపి మూడు యూనిట్లుగా ఏకం పాకం చేశావు. కేవలం నీ సంక్షేమమే చూసుకున్నావు గాని ఉద్యోగుల సంక్షేమం ఏనాడైన చూశావా..? అనంతపురం,కడప,కర్నూలు సిబ్బందిని తిరుపతికి తరలించావు…ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ వాళ్లను మంగళగిరి తోలేశావు.. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జనాన్ని రాజమండ్రికి పొమ్మన్నావు అత్తెసరు జీతాలతో అల్లల్లాడుతున్నా వారు బదిలీ చేసిన చోట ఎలా బతుకుతున్నారో పలకరించావా..? చేయలేమని వెళ్ళిపోతామన్న వారినేమైనా ఓదార్చావా..? జీతాలడిగితే పొమ్మంటున్నావు..? ఇప్పటి వరకూ ఎంతమంది మానేశారో నీకు తెలుసా..? ఎందుకు మానేస్తున్నారో తెలుసా..? మానేసిన ఎంత మందికి ఫుల్ అండ్ ఫైనల్ షెటిల్ మెంట్ చేశావు… నీహెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ ఏం చేస్తుంది..? ఇదేనా నీ పారదర్శకత..? ఇదేనా నీ సంక్షేమం..?

ధర్మం నాలుగు పాదాల మీద నడవాలని ఓ వేదిక ఏర్పాటు చేసిన నీవు కేవలం నీ స్వార్ధం కోసం ఎంత మందిని ఉసురు పెడుతున్నావో నీకు తెలుస్తుందా..? ఇదేనా నీ సంక్షేమం..? అర్ధరాత్రి బండికి పంక్చర్ పడితే ఇంటికి ఎలా వెళతారనే ఇంగితం కూడా లేకుండా అడ్డదారుల్లో వచ్చిన నీకున్న పొలాల్లో నీవు డబ్బా షెడ్లను కట్టేశావు వర్షమొస్తే పనిచేసే వీలులేకుండా వుందనే విషయం నీకు తెలియకుండా మేనేజ్ చేస్తూ వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న ఆ దగుల్బాజీలను ఏనాడైనా హెచ్చరించావా..? నీవు తప్పుడు సమాచారాన్నిచ్చే వాళ్లనే నీవు నమ్ముతూ తప్పుడు పనులకే నీవు ఎగబడుతున్నావనేది వాస్తవం కాదా..? ఇదేనా నీ సంక్షేమం..? సీబీఐ దర్యాప్తునుంచి తప్పించుకునే నెపంతో నాలుగైదు యూనిట్లను ఏకం పాకం చేసి ఏమి బావుకున్నావు. వందల కిలో మీటర్లనుండి ఎంత సాహసం చేసి వస్తున్నారో ఏనాడైనా గుర్తించావా..? అయినా అవన్నీ నీకెందుకులే..? ఎంతసేపూ నీ ఎదుగుదలే.. నీకు అధికార వ్యామోహం తప్ప ఏమీ కనబడవు..కార్మికులకు జీతాలు పెంచుతామని నమ్మబలికి నేటికి ఏడాది కావొస్తున్నా పెంచక పోగా దళారులకేమో వేలకు వేలు పెంచి పోషిస్తూ ఉద్యోగులకేమో కేవలం 500 రూపాయలు విదిల్చి చేతులు దులిపేసుకున్న విషయం వాస్తవం కాదా..? ఇదేనా నీ సంక్షేమం..? కార్మిక చట్టం ప్రకారం నీవు పనిచేయించుకుంటున్న కార్మికులకు జీతాలు ఇస్తున్నావా..? కనీస వేతనాలు చెల్లిస్తున్నావా..?ఒక్కసారి ఆలోచించు…నీవైతే చేయవు గాని ఎదుటవాడిని విమర్శించే హక్కు నీకెక్కడుంది..?ఇదేనా నీ సంక్షేమం..?వ్10 నుంచి 11 గంటలు పని చేయించుకుంటూ 3 నుంచి 4వేల రూపాయలిస్తున్న నీవు కార్మికుల హక్కుల గురించి మాట్లాడే హక్కుందా..? ఒక్కసారి అలోచించు లేబరాఫీసరు వస్తే 15 వేల రూపాయలిచ్చే ఒకరిద్దరిని చూపించి అందరికీ అవే జీతాలిస్తున్నట్టు బిల్డప్ ఇస్తావు ఇదేనా నీ సంక్షేమం..? నీ మనసాక్షిగా చెప్పు నీవు ఇచ్చే జీతాలతో నీ సాక్షిలో పనిచేసే సిబ్బంది తృప్తిగా పని చేస్తున్నారని లోకానికి చెప్పగలవా..? ఏడేళ్ల క్రితం ప్రారంభించిన నీవు ఏనాడైనా నీ సాక్షి సిబ్బందితో మనసారా మాట్లాడిన క్షణమేదైనా ఉందా జగన్ బాబూ..? లోకానికి నీతులు చెప్పడమేకాదు కొంచెమైనా నీవు పాటించి ఆ తర్వాతే ఇతరులకు నీతులు చెప్పాలి కదా..? కేవలం సాక్షి పేపరులో పనిచేయాలని చెప్పి ఉద్యోగాలిచ్చే నీవు ఊరులో ఉన్న అన్ని పేపర్లనూ పోగేసుకుని నీవు ప్రింటింగ్ చేస్తూ లాభాలు పొందుతున్నావు.. ఆ రీతిలో ఉద్యోగులకు జీతాలు పెంచకుండా ఉన్న ఉద్యోగులతోనే పనంతా రుద్దిచ్చేస్తూ నానా ఇబ్బందులు ఎలా పెడుతున్నావు..? ఇదేనా నీ సంక్షేమం..ఇలా చెప్పుకుంటూ పోతే నీ చిట్టా చాంతాడంత ఉందిరా బాబూ ముందు నీ ఇంటిని చక్కదిద్దుకో అ తర్వాతే ఎదిరింట్లో నలుసుని తెలుసుకో.. నీవు వేలకు వేలిచ్చి పెంచి పోషించే దళారులు నీకు అవసరమా ఒక్కసారి అలోచించు..? అహర్నిశలు పనిచేసే కార్మికులు నీకు అవసరమా ఆలోచించు..? పదీ పదిహీను మందికి 20 వేలిచ్చి అందరికీ అవే జీతాలిస్తున్నట్టు బిల్డప్ ఇస్తే ఎలా చెప్పమ్మా…? ఇక్కడ కష్ట పడే వాడికి దిక్కులేదు..? నానా కబుర్లు పోగేసి పొట్టగొట్టే వాళ్లకే పెద్ద పీటవేస్తారు ఇది నిజం కాదా..? ఇదేనా నీ సంక్షేమం..? ఇప్పటి కైనా ప్రక్షాళన అవసరమని తెలుసుకో..!

-సాక్షి ఉద్యోగి మనస్సాక్షి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title