ఏపీకి క్యూ కడుతున్న కంపెనీలు…

Written by

రాజధాని లేదని డీలాపడి… హోదా కూడా వస్తుందోరాదోనని దిగాలుపడుతున్న ఏపీకి ఓ స్వీట్ న్యూస్. అంతకు మించి గ్రేట్ న్యూస్. ప్రపంచం అంతా రిసెషన్ దెబ్బతో నీరసమొచ్చి పడిపోతున్న సమయంలో మనం మాత్రం మహాద్భుతం అనే రేంజ్ లో అడుగులు వేస్తున్నాం. పెట్టుబడుల ఆకర్షణ… కొత్త అవకాశాల అన్వేషణ… ప్రపంచస్థాయి సంస్థ ఏర్పాటు లాంటి విషయాల్లో ఏపీది ఇప్పటికే నేషనల్ రికార్డ్. వరసకట్టిన కంపెనీలే ఆ విషయాన్ని ఢంకా బజాయించి చెబుతున్నాయ్. అందుకే బాధపడక్కర్లేదు. పడ్డాం. దులుపుకొంటూ లేచి నిలడ్డాం. డౌట్ లేదు. ఇక పరిగెట్టడమే ముందుముందు అని చెప్పుకోదగ్గ మేటర్ ఏంటో డీటైల్డ్ గా చూద్దాం !

హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఫాక్స్ కాన్, ఎయిర్ బస్ ఇండస్ట్రీస్, పెప్సీకో, డీఆర్ డీవో, కొబెల్కో, ఎన్ ఎఫ్ సి, బిర్లా సిమెంట్స్, కాకినాడలో రిలయెన్స్ రిఫైనరీ. ఇవి లిస్ట్ లో కొన్ని. వస్తాయని ఆశిస్తున్నవో… వస్తే బావుండు అనుకుంటున్నవో కాదు ఇవి. ఆల్రెడీ అవగాహనా ఒప్పందాల మీద సంతకాలు కూడా అయిపోయి… పనులు ప్రారంభించిన సంస్థలు. రెండు మూడు అయితే తొలి ప్రోడక్ట్ తో బోణీ కూడా కొట్టేశాయ్. వీటన్నిటి విలువా దాదాపు 40 వేల కోట్లు పైగానే ఉంటుందని అంచనా !

ఆంధ్రా అడుగేస్తే అదుర్స్…

ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ ముసుగు తన్నేసింది. ఇలాంటి సమయంలో పుంజుకుంటున్నది, స్కోప్ ఉన్నది ఇన్ ప్రా. ఏపీ కూడా ఇప్పుడే అడుగేస్తున్న రాష్ట్రం కాబట్టి మనకీ కీలకం ఇన్ ఫ్రానే. దీనికితోడు మన వ్యూహాలు కూడా దానికి తగ్గట్టుగానే ఉండడం బ్రహ్మాండంగా క్లిక్కైంది.
అందుకే ఇపుడు పెట్టుబడుల ఫేవరెట్ డెస్టినేషన్ ఏపీ. నిజానికి 18 వేల కోట్ల రెవిన్యూ లోటుతో అల్లాడుతున్న రాష్ట్రానికి ఒకే ఒక్క ఆశ పెట్టుబడే ! దేశీయంగా పరిస్థితి ఎలా ఉన్నా… సీఎం విదేశీ పర్యటనలు ఏపీ ఆశలకి ఆయువు పోసినట్టే కనిపిస్తున్నాయ్. మొబైల్ మేనిఫ్యాక్టరింగ్ సంస్థ జియోమీ దాని ఫలితమే. ఇలాంటి అడుగులు పడితే ఏపీలోకి ఇన్వెస్ట్ మెంట్ రావడమే కాదు… ఉపాధి అవకాశాలూ పెరిగి ఫైనాన్షియల్ గా ర్యాపిడ్ గ్రోత్ సాధ్యమవుతుంది. జియోమీ వరల్డ్ వైడ్ గా స్మార్ట్ ఫోన్ మేకింగ్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉంది. అలాంటి సంస్థ అమాంతం వచ్చేసిందంటే ఏపీ మాగ్నెటిక్ పవర్ ఏంటో అర్థమవుతోంది. రావడమే కాదు ఏపీపై ప్రశంసలు కూడా కురిపించింది. మామూలుగా అయితే కొత్తగా ఓ ప్రాంతానికి వెళ్లి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇలా లాంచ్ చేయాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. ఇక్కడ ఆర్నెల్లు సరిపోయింది. వండ్రఫుల్ అంటున్నారు హ్యూగో బర్రా, జియోమి వైస్ ప్రెసిడెంట్. ఈ జోరు చూసి మేక్ ఇన్ ఇండియాకి మాస్టర్ పీస్ ఎగ్జాంపుల్ ఏపీ అంటూ క్యూ కడుతున్నాయ్ కంపెనీలు. ఇది జస్ట్ బిగినింగ్.

మన పాలసీలు కూడా ఇండస్ట్రీకి బంపర్ బూస్టప్ ఇస్తున్నాయ్. సింగిల్ డెస్క్ క్లియెరెన్స్ సిస్టిమ్ ప్రపంచంలోనే అద్భుతం అంటే ఆశ్చర్యం లేదు. కేవలం 21 రోజుల్లో పారిశ్రామిక అనుమతులు వస్తాయా, ఇంతలా రిసీవ్ చేసుకుంటారా అంటూ ప్రపంచస్థాయి దిగ్గజాలే సర్ ప్రైజ్ అవుతుంటే రేపోమాపో రతన్ టాటా కూడా రాబోతున్నారు. దటీజ్ ఏపీ స్పెషాలిటీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో గుజరాత్ ని దాటి… మహారాష్ట్రని వదులుకొని, కర్ణాటకని కాదని ఏపీ వైపు రావడం అంటే ఇదో బిగ్గెస్ట్ అచీవ్ మెంట్. అన్నీ ఉన్న రాష్ట్రమైతే ఈ పాటికి ఆకాశాన్నంటే హంగామా చేసేసేదే ! మనం ఇంకా అడుగులు వేసే దశలో ఉన్నాం కాబట్టి మిగతా లక్ష్యాలు పేపర్ వెయిట్ లా బరువు పెడుతున్నాయ్ మన మీద. అయినా పర్లేదు. దూసుకుపోతాం అనేందుకు ఇంతకు మించిన ఇండికేషన్ ఇంకేముంటుంది ?

మోడీని సర్ ప్రైజ్ చేస్తున్న ఏపీ స్పీడ్…

ఇప్పటికే పునాదులు పడి యాక్టివిటీ మొదలు పెట్టిన సంస్థలు చాలానే ఉన్నాయ్. లిస్ట్ తీస్తే తెలుస్తుంది… ఏపీ స్పీడ్ ఏం రేంజ్ లో ఉందో. మొన్న ఏప్రిల్ లో శ్రీసిటీలో సీఎం ప్రారంభించిన పెప్సీ కో 1200 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. చేరువలో మరో 980 కోట్ల పెట్టుబడుల పనులు మొదలయ్యాయ్. వాటికి అనుబంధంగా మరో వెయ్యి కోట్లు వచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది ఇప్పటికే ! ఫార్మా దిగ్గజం మైలాన్ ఏపీలో 500 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యింది. ఏప్రిల్ లో పెట్టుబడుల మిషన్ ప్రారంభినప్పుడే ఏపీ ప్రభుత్వం .. కెనడా జపాన్ యూఏఈ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలతో 47 అవగాహనా ఒప్పందాలు చేసుకుంది. వాటి విలువ సుమారు 36 వేల కోట్లు. ఇవన్నీ చెబుతున్నది ఒక్కటే. ఏపీ అంటే హ్యాపెనింగ్ స్టేట్. ఫాస్టెట్ గ్రోయింగ్ స్టేట్. ఇంత దన్ను ఉండబట్టే విశాఖ జెండా పండగ ప్రసంగంలో రెండంకెల గ్రోత్ సాధించబోతున్నామనే మాటొచ్చింది. రాదూ మరి !

మేనిఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రొసెసింగ్, ఇన్ ఫ్రా… ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ సహా అనే రంగాల్లో అవగాహనా ఒప్పందాలు క్రమంగా పట్టాలెక్కుతున్నాయ్.
హెచ్ పీసీఎల్, వేమ్ టెక్నాలజీస్, జైరాజ్ ఇస్పాత్, ఇసుజి లాంటి సంస్థలు చలో ఏపీ అంటూ పనులు మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాయ్. గోంఝూ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ జీఎంఆర్ కొలాబరేషన్ తో కాకినాడలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో బిజీగా ఉంది. గత మేలో మోడీ చైనా వెళ్లినప్పుడు చేసుకున్న ఒప్పందాల్లో 300 కోట్ల డాలర్లు ఏపీలోకొచ్చే పెట్టుబడులున్నాయ్. ఆయన సమక్షమంలోనే సంతకాలూ జరిగాయ్. ఓహో… వాళ్లు మీతో టచ్ లో ఉన్నారా అంటూ ఆశ్చర్యపోయి… సంతోషపడిన విషయం ఏపీలో కొంతమందికే తెలుసు. వచ్చే ఐదేళ్లలో ఈ చైనా పెట్టుబడులతో 5 వేలమందికి ఉపాధి అవకాశాలొస్తాయని అంచనా.

పరిశ్రమలొస్తాయ్. పెట్టుబడులు ఉద్యోగాలు తెస్తాయ్. లోటు భర్తీ, నిర్మాణం ఇంకోపక్క వేగంగా జరిగితే ఏపీ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా పూర్తైనట్టే. అందుకే కంపెనీలు క్యూ కడుతున్న తీరు లుక్కే మార్చబోతోంది. పడిన రాష్ట్రాన్ని పండగ చేసుకోమంటోంది. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఇండస్ట్రీ ిఇరుసుగా ఏపీ గ్రోత్ కారిడార్ లో రయ్య్ ని పరుగులు పెట్టేందుకు ఎంతో సమయం పట్టకపోచ్చు.

– అభి

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title