ఏపీకి ఓ అమితాబ్ కావాలి !

Written by

ఏపీ సెలెబ్రిటీ సపోర్ట్ కోరుకుంటోంది. మాములుగా కాదు చాలా గాఢంగా ! అవసరాలు చాలా ఉన్నాయ్… ఆకాంక్షలు ఎక్కువున్నాయ్. అందుకోవాలంటే స్టార్ డమ్ కావాలంటూ ప్లాన్ ప్రిపేర్ అవుతోంది. ఇంతకీ ఎందుకు సెలెబ్రిటీల సపోర్ట్ ? అమరావతిలో టెన్ కే రన్ పెడ్తున్నారా ? బెజవాడలో గ్రీనథాన్ లాంటి ఆర్గనైజ్ చేస్తున్నారా అనుకోకండి. సెలెబ్రిటీల సపోర్ట్ కావాల్సింది ఎవేర్ నెస్ కల్పించడం కోసం. ర్యాగింగ్ కి బ్రేక్ వేసేందుకు భారీ స్థాయిలో కేంపైన్ చేయాలని సినీఇండస్ట్రీతో గట్టి సంబంధాలున్న మంత్రి ట్రై చేస్తున్నారట. తన శాఖ పరిధిలో ఇష్యూనే కాబట్టి సీఎం అప్రూవల్ కూడా పెద్ద విషయం కాదని ఆయన లెక్క.

ఇదొక్కటే కాదు. టూరిజంలోనూ భారీ ప్రణాళిక సిద్ధమవుతోంది. రండి చూడండి అన్నట్టు కాకుండా టూరిజాన్ని సీరియస్ గా తీసుకోవాలనేది ప్రభుత్వం ఐడియా. దీనికోసం 300 కోట్లతో భారీ ప్లాన్ కూడా సిద్ధమవుతోంది. బెజవాడ భవానీ ఐలాండ్ మొదలు… పైన పాపికొండలు, ఇటు దిగువన కడప గండికోట లాంటి ప్రాంతాల మీద భారీ ప్లాన్ రెడీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇంత గడ్డుకాలంలోనూ వందల కోట్లు టూరిజం కోసం ఖర్చు చేయాలన్న ఆలోచన వెనక పెద్ద ప్లానే ఉందంటున్నారు. టూరిజం అంటే చూసెళ్లిపోరు. ఇక్కడ పరిస్థితులు, ఆహ్లాదం, అవకాశాలు లాంటివన్నీ ఆ వెంటనే వస్తాయ్. టూరిజంలో టాప్ లో ఉన్న కేరళ గుజరాత్ కర్ణాటక లాంటి రాష్ట్రాలు పెట్టుబడల ఆకర్షణలోనూ ముందున్నాయ్. ఇపుడు అదే రూట్లో వెళ్లాలనేది ఐడియా. పైగా బౌద్ధ క్షేత్రాలకి కొత్త హంగులద్ది చైనా జపాన్ సింగపూర్ లాంటి దేశాల్ని కూడా ఆకట్టుకోవాలనేది ప్లాన్.

దీనికోసమే ఇపుడు గుజరాత్ తరహా వ్యూహం పట్టాలెక్కబోతోంది. రాన్ ఆఫ్ కచ్ అంటూ శాలువా కప్పుకొని గంభీరంగా నడిచొచ్చే అమితాబ్ గుర్తున్నాడు కదా…అదే తరహాలో ఏపీ కూడా అంతే భారీస్థాయిలో త్వరలో టూరిజంతో ప్రపంచాన్ని చుట్టేయాలనుకుటోంది. ఇటు ర్యాగింగ్ లాంటి అవగాహనలు అటు టూరిజం. ఇప్పటికైతే ఈ రెండూ ఫైనలైజ్ అవుతున్నాయ్. మరి హీరోల్ని సంప్రదిస్తారా ? హీరోయిన్లని రంగంలోకి దించుతారా ? ఏం చేస్తారనేది చూడాలి. మొత్తానికి ఏపీకి మ్యాప్ తోపాటు కొన్ని సెలెబ్రిటీ ఫేస్ లు కనిపించబోతున్నాయ్ కేంపైన్ లో !

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title