ఏపీకి ఎందుకీ గవర్నర్ ?

Written by

ఉన్నత విద్యామండలి మాదేనంటూ ఏపీ ఉద్యోగుల్ని బైటకి నెట్టేస్తే… నో పోలీస్.

ఎన్టీవో భవన్ లో వాటాలేదంటూ ఏపీ పరువును అబిడ్స్ నడిరోడ్డు మీద నిలబెడితే… నో పోలీస్.

సెక్రటేరియట్ లో లంచ్ చేస్తున్న ఉద్యోగుల మీద అమానుషంగా విరుచుకుపడితే… నో పోలీస్.

శివార్లలో దాడులు… బూతులతో నేతలు తెగడితే, అయ్యా ఇదీ పరిస్థితి అంటే… నో పోలీస్.

ఇన్నాళ్లుగా లేవని నోరు గంగిరెద్దంటే మాత్రం లేచింది. ఏం ?

ఇది సినిమా డైలాగ్ కాదు. రియల్ పొలిటికల్ స్టోరీ. గవర్నర్ తీరు ఎలా ఉందో చెప్పుకోవాలంటే ఓ చిన్న చైల్డ్ హుడ్ స్టోరీ చెప్పాలి. రెండిస్తేనే తింటా ! అంటూ మనలో అందరం మారాం చేసుంటాం. ఒకటి పెడితే సరిపోదు రెండు కావాలి లడ్డూలైనా… బిస్కెట్లైనా… చాక్లెట్లైనా ! అమ్మ అలాంటప్పుడు చాలా చాకచక్యంగా ఒక బిస్కెట్ ని రెండు ముక్కలు చేసి చేతిలో పెట్టేది చాలాసార్లు. సంబరపడిపోయే వాళ్లం… మన ఆటలో మనం మునిగిపోయేవాళ్లం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే… మన గవర్నర్ తీరు గురించే. ఉన్న బిస్కెట్ ని రెండు ముక్కలు చేసి అమ్మ ఎంత తెలివిగా, ఒడుపుగా ప్రేమగా పెద్దరికంతో మనల్ని మెప్పించిందో ఇపుడు మన గవర్నర్ అంతకంటే తెలివిగా వ్యవహరించాలి. అలా చేయాలంటే నేర్పు చొరవ ఉండాలి. అన్నిటికీ మించి… రెండు రాష్ట్రాల్ని చూసే రెండు కళ్లూ సమ దృష్టితో ఉండాలి. అలా కాకుండా ఒక పక్క వక్ర దృష్టితో చూసినా వ్యవహారం వక్రిస్తుంది. పరిస్థితి వికటిస్తుంది. ఇప్పుడు జరిగింది అదే !

అసలు గవర్నర్ ని ఎందుకు మార్చాలి. ఒకటి కాదు…ఐదు కారణాలు. ఉమ్మడి నరసింహుడు రెండు రాష్ట్రాల కుమ్ముడుకీ ఎంత కారణం అవుతున్నాడో… ఈఎస్ఎల్ తూకం తెలంగాణవైపే ఎలా మొగ్గిందో చెప్పడానికి ! కొన్నిసార్లు సమస్యలు పరిష్కరించకపోయినా పర్వాలేదు. కానీ రెచ్చగొట్టకూడదు. ఇప్పుడు రాజ్ భవన్ సాక్షిగా జరుగుతున్నది ఇదే !

గవర్నర్ ఏ రాష్ట్రానికి పక్షపాతి ?

ఇది ఎంత తప్పుడు ప్రశ్నో చూడండి. ఇపుడు ఇలాగే మాట్లాడుతున్నారు నాయకులుగానీ జనంగానీ. అంటే గవర్నర్ ఎటో ఒకవైపు మొగ్గుతున్నారన్న ఫీలింగ్ వెళ్లిపోయింది అందరిలోకి. ఇది సరిదిద్దుకోలేని ఫెయిల్యూర్. ఇపుడు కాదు విభజన సమయం నుంచి ఇంతే ! స్వామి భక్తిని చాటుకుంటూ కాంగ్రెస్ అధిష్టానానికి పొలిటికల్ రిపోర్టులిచ్చారు నరసింహన్. ఎన్నికలు దగ్గర పడ్డాక ఇక కాంగ్రెస్ విభజన వైపు మొగ్గు చూపుతోందన్న వాసన తగలగానే తెలంగాణవైపు టర్నింగ్ అందుకున్నారు. ఇచ్చేయండి… మీఇష్టం అంటూ లెక్కే ఒక్కసారిగా తిరగేశారు. కాంగ్రెస్ నాయకులు కూడా డంగైపోయేంతగా పొలిటికల్ లెక్కలు చెప్పి రాజ్ భవన్ రాజకీయం నడిపారు. దాని సైడ్ ఎఫెక్ట్సే ఇప్పుడు కనిపిస్తున్నాయ్.

సెక్షన్ 8-నో రియాక్షన్ 

ఏడాది నుంచి ఏం చేస్తున్నట్టు ? ఇచ్చిన అధికారాల్ని వాడుకోవడం చేతకాదా ? వాడే ఉద్దేశం లేదా ? సమాధానం

ఏదైనా ఏపీకి జరిగేది అన్యాయమే. ఇపుడు గొవడ జరుగుతున్నా… ఆయన చలిచింది లేదు. పైపెచ్చు…అంతా బాగానే ఉందంటూ కలరిచ్చేందుకు తెలంగాణ వాదన భుజానకెత్తుకున్నారు. ట్యాపింగ్ లాంటివి జరగలేదంటూ హోంశాఖకి రిపోర్ట్ ఇచ్చి పలచనైపోయారు. ఆ మర్నాడే ట్యాపింగ్ రిపోర్ట్ కేంద్రం ముందు పెట్టింది ఏపీ. అంటే తన విచక్షణ, ఇంటిలిజెన్స్ తెలివితేటలూ కూడా వదిలేసి తెలంగాణ వాదన ఎత్తుకున్నారనేందుకు ఇది తిరుగులేని రుజువు.

తెలంగాణ టోన్ 

ఏపీ ముఖ్యమంత్రి కాళ్ల మీద పడడం లేదని బాగా మనసులో పెట్టుకున్నారా ? గవర్నర్ ది ఏపీ మీద ఎప్పుడూ సవతి తల్లి పెత్తనమే ! రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసుకోవాలంటే తెలంగాణకి వెంటనే ఓ ఎస్…అనేశారు. ఏపీ మాత్రం ఢిల్లీ లేఖ రాస్తా…రేఖ గీస్తా అంటూ శాస్త్రం చెబుతారు. ఏం… ఏపీ పాలన కూడా అక్కడే …అదే హైద్రాబాద్ లో ఉందిగా? ఆ వెసులుపాటు ఎందుకివ్వరు. సవాలక్ష అవస్థలకి తోడు గవర్నర్ కూడా దెబ్బేశారా అంటూ సరిపెట్టుకోవాలి మనం. సచివాలయం తగువు, ఎన్జీవో గొవడ, శివారు కంప్లైంట్లు ఆయనకి కనిపించ లేదెప్పుడూ !

ప్రొసీడ్ తెలంగాణ ప్రొసీడ్ 

కేసు హడావుడి మొదలు పెట్టాక గవర్నర్ రియాక్షన్ ఇది. ఆయనేమీ మహబూబ్ నగర్ లోనో అదిలాబాద్ లో ఉన్న సామాన్యుడు కాదు తెలంగాణ సర్కారు చేసిన ప్రచారమంతా నమ్మి ఔనవును అనేందుకు. కానీ ఆయన అంత కన్నా ఘోరంవా మారిన తీరు కళ్ల ముందుంది. ఉమ్మడి రాజధాని, ఏసీబీ పరిధి, ముఖ్యమంత్రి-రాజ్యాంగ రక్షణ లాంటి విషయాలేవీ పట్టని సగటు వెగటు రాజకీయం నరసింహన్ ది. అందుకే ఏపీని కారాడుతున్నట్టు కనిపిస్తున్నాయ్ ఆయన చేష్టలు.

కర్మణ్యే వాధికారస్తే 

పని చేయడమే మనచేతిలో ఉంది అంటూ గీతా శ్లోకం చెప్పారంటే ఇక తేల్చుకోవాల్సింది కేంద్రమే అన్నట్టు అనుకోవాలేమో! రాష్ట్రాల మధ్య మంటలు మండిపిస్తున్న కేసు వ్యవహారంలో ఆయన తీరుకి ఇది పరాకాష్ట. వాడుక భాషలో అయితే క్లైమాక్స్. ఐదు కోట్ల ఆంధ్రుల అసంతృప్తికి కూడా ఇదే ముగింపు అయితే బెటరేమో గవర్నర్ విషయంలో!

సెక్షన్ 8 అమల్లోకి వచ్చాక కూడా కర్మని నమ్మితేనో… పొర్లుదండాలు పెట్టుకోవడంలో పొద్దు గడిచిపోతేనో కష్టం. ఏపీ వైపు ఏమీ మొగ్గనవసరం లేదు. మన పని మనం చేసుకోగలం… మన వాదన వినిపించుకొని సాధించుకోగలం. అందుకే ముక్కుసూటిగా మనిషి రాజ్ భవన్ లో రంగ ప్రవేశం చేయాలని కోరుకుంటోంది ఏపీ.
అభి

Comments

comments

Article Tags:
· · · ·
Article Categories:
Anything Everything

Comments

Menu Title