ఉరేయ్ చెప్పండ్రా ఆడికి… ఎక్కడైనా చూపించండ్రా… అలా వదిలేయకండ్రా…

Written by
sakshi

అదిగో అదే చందమామ అని ఆకాశం వైపు చూపుడు వేలు చూపిస్తే… చిన్నాయనకి ఓ డౌటొచ్చింది. అది చందమామ అయితే మిగతా నాలుగు ఏంటని ? వింటున్నవాళ్లకి మొదట్లో అర్థం కాలేదు… మిగతా నాలుగూ ఏంటో ! తెలిసిన మరుక్షణం తెగనవ్వొచ్చింది. పైకి చూపించారు కదా ఆ చూపుడు వేలును చూసి చందమామ అనుకున్నాడు పిచ్చికొండ. అందుకే మిగతా నాలుగు వేళ్ల సంగటేంటని అడిగాడు. ఇక్కడ విషయాలు రెండున్నాయ్. అర్థంచేసుకునేంత బుర్ర లేకపోవడం మొదటిదైతే… ప్రతి దాంట్లోనూ నెగెటివ్ చూడ్డం రెండోది. రాజధాని విషయంలో విపక్షం లాజిక్ అచ్చం ఇలాగే అనిపిస్తోంది.

ప్రభుత్వ భవనాలకి రెండు వేల ఎకరాలు సరిపోతే ఇన్ని వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నట్టు ? ఈ పాయింట్ తో ఓ ఫుల్ పేజీ కొట్టేశారు సండే పూట. అడ్మినిస్ట్రేటివ్ భవనాలు… సెక్రటేరియట్ అసెంబ్లీ లాంటివి కడతారు ముందు. ఆ తర్వాత ముఖ్యమైన బిల్డింగ్ లన్నీ వస్తాయ్. సీడ్ కేపిటల్ అంటే విత్తనం వేయడం లాంటిది. మహా వృక్షంగా ఎదిగేందుకు కావాల్సిన సరంజామా అంతా సర్దుకొని రంగంలోకి దిగితే ఇది తొలి మెట్టు. ఇన్ ఫ్రా కేరిడార్లు, ఐటీ హబ్, ప్రొడక్షన్ ఈవెంట్ మేనేజ్ మెంట్ డిపార్ట్ మెంట్స్, లివింగ్ ఏరియా ఇలా రాజధానిలో సబ్ డివిజిన్స్ 35కిపైగానే ఉన్నాయ్. కోటిమంది జనాభా సహా ఇది ఏపీ ఎపిసెంటర్. ఇవన్నీ వదిలేసి..రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోడానికే ప్రభుత్వం ప్లాన్ చేస్తోందంటూ విషం కక్కడం చూస్తే కోపం కాదు నవ్వొస్తోంది. దొనకొండలోనే రాజధాని అంటూ చుట్టుపక్కల వేలఎకరాలు కొనిపించడం..కడప చుట్టుపక్కల లక్షల ఎకరాల లేఅవుట్లు రెడీ చేసినట్టే అందరూ చేస్తారనుకోవడం దిక్కుమాలినతనం తప్ప మరోటి కాదు.

అసహనం కట్టలు తెంచుకొని… సమయం సందర్భంలేని వాదనలు… పసలేని లాజిక్కులతో రెచ్చిపోయేందుకు పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది విపక్షం. స్విచ్ ఛాలెంజ్ మెథడ్ లో టెండర్లకి వెళ్తాం అని చెప్తోంది ప్రభుత్వం. అందులోనూ రాద్ధాంతమే. స్విస్ ఛాలెంజ్ అంటే … ఓ నిర్ణీత సమయంలో ఏ కంపెనీ అయినా తక్కువకి కోట్ చేయొచ్చు… ఓ సారి టెండర్ వేసిన తర్వాత అంతకంటే తక్కువకి మరో కంపెనీ వేస్తే ఆ కంపెనీయే ఛాన్స్ ఎగరేసుకుపోతుందని లేదు. అప్పటికీ మిగతా వాళ్లకి ఛాన్స్ ఉంటుంది… తక్కువకి పూర్తి చేయగల్గితే. ఇందులో నచ్చిన వాళ్లకి ఇవ్వడమే ప్రశ్నే లేదు. ఇలాంటి పద్ధతిని కూడా తప్పుపట్టేందుకు మరో లొసుగు లాజిక్ అందుకుంది విపక్షం. ప్లాన్ సింగపూర్ ది అయితే మిగతా దేశాలు ఎందుకొస్తాయ్ అని. మేకపాటి బ్రదర్స్ ఒంగోలు హైవే వేస్తే ఏం… జనమంతా తిరగడం లా ? వైసీపీ పార్టీ ఎంపీ వేసిన రోడ్డు ఇదని వదిలేస్తారా ? ఇది కూడా రాజధాని ప్లానింగ్ అవరైనా చేయొచ్చు. ఒకవేళ మనమే చేసుకున్నా మిగతా దేశాలకి ఉండే సందేహాలుంటాయ్. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే… ఎంత సేపూ నెగెటివ్ థింకింగ్, విష ప్రచారాలతో పలచనైపోవడం తప్ప సాధించేదేమీఉండదు. ఎన్నో స్పీడ్ బ్రేకర్లు దాటుతోంది ఏపీ… అందులో ఇలాంటి నెగెటివ్ మైండెండ్ ఫెలోస్ కూడా ఓ చిన్న నలుసనుకోవాలి.

>>

Comments

comments

Article Tags:
· ·
Article Categories:
Anything Everything

Comments

Menu Title