అయన రావాలంటే ప్రాణాలు పోవాలి

Written by

జగన్ పరామర్శల మీద ఏపీలో కొత్త టాక్ బయల్దేరింది. ప్రాణాలు పోతేనో విషాదాలు జరిగితేనో మాత్రమే ఆయన కాలు బైటపెడుతున్నారని అంటున్నారు సొంత పార్టీ నాయకులు, జనం కూడా ! అంటే సమస్యలంటే అవే అనుకోవడం వల్ల ఇలా జరుగుతోందా లేదంటే అలవాటైపోయిన ఓదార్పు మూడ్ నుంచి బైటకి రాలేకపోతున్నారా అనేది తెలియక గందరగోళ పడుతున్నారు కూడా ! ఆత్మహత్యల కుటుంబాలంటే సరే. అంతకు ముందు… ఆ తర్వాత కూడా ఆయన టూర్లన్నీ ప్రాణాలు పోగొట్టున్నవాళ్లని పరామర్శించడానికే కేటాయిస్తున్నారు. అంటే ఏపీలో ఆయన కంటికి చిక్కే సమస్యేదీ లేదునుకోవాలా ? లేదంటే ఆయన జనం ప్రాణాలు పోతేనే రియాక్ట్ అవుతారనుకోవాలా అనే కన్ ఫ్యూజన్ వచ్చేస్తోంది చుట్టూ ఉన్నవాళ్లకి కూడా ! కావాలంటే లిస్ట్ చూడండి.

బాణా సంచా పేలుళ్లలో చనిపోయిన వాళ్ల కుటుంబాల్ని పరామర్శించడానికి వెళ్లారు. తమిళనాడులో బిల్డింగ్ కూలి చనిపోయిన వాళ్ల దగ్గరికి వెళ్లారు. ఈ మధ్య కరెంటు షాక్ కొట్టి చనిపోయిన కుటుంబాల్ని పలకరించడానికి వెళ్లారు. మొన్న పుష్కరాల్లో చనిపోయినవాళ్ల కుటుంబాల్ని పరామర్శించారు. ఇపుడు మళ్లీ విష జ్వరాలతో ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లని ఓదార్చడానికి వెళ్లారు. పరామర్శించడం పలకరించడం మంచిదే. కానీ… అన్నీ చాపుల తర్వాత ఉండే సరికి చెప్పుకోడానికి కాస్త ఇబ్బంది అనిపిస్తోందని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. క్రిష్ణా జిల్లా మాజేరులో అయితే ఓ వృద్ధుడు ఆ మాట కూడా అనేశాడు. బతికున్నప్పుడు వస్తే బావుండేది బాబూ… ఇప్పుడొచ్చారు మీరు. ఇన్ని రోజులకి కనిపించామా అని ! ప్రిపేర్ చేసిన డైలాగుల్లో అది లేకపోయే సరికి… చుట్టూ నేతలు ఆయనను సైడ్ చేశారనుకోండి అది వేరే సంగతి.

ప్రేత రాజకీయం పలకరిస్తోంది…

ఎందుకిలా ? జగన్ ప్రాణాలు పోయాక కచ్చితంగా వెళ్లాలనుకుంటారు ? వెళ్తారు ? ఇది వెటకారమో… ఇంకోటో కాదు. కావాలంటే చూుడండి సన్నిహితంగా ఉన్నవాళ్లని కూడా అడగండి. ఇలాంటి ఇష్యూస్ లో ఆయన మిస్ కారు. అలాగని టైమ్ కి కూడా రారు. సపోజ్… బెజవాడలో కరెంట్ షాక్ కొట్టి ఏడుగురు పోయిన ఘటననే తీసుకోండి. మారుమూల ప్రాంతమేం కాదు. అయినా సరే ఆయన రావడానికి వారంపట్టింది. గ్యాస్ లీజేకీ జరిగి ప్రాణాలు పోయినప్పుడూ గోదావరి జిల్లాలో ఆయన ఇలాగే పర్యటించారు. ఇలాంటి టూర్లో లేదంటే ఓదార్పులో తప్ప ఆయన చేసిన ఆందోళన కానీ యాత్ర కానీ ధర్నాకానీ ఇంకే లేదు చూస్కోండి. కావాలంటే డైరీ తిరగేసి కన్ఫామ్ చేసుకోండి. చావులైతే సెంటిమెంట్ పండుతుందని అనుకోవడం వల్లో… లేదంటే అక్కడైతే విమర్శలు ధారాళంగా చేయొచ్చని అనుకోవడం వల్ల జరుగుతోందా ? ఏమో ! కేటాయించామని చెప్పుకున్న సంస్థలు రాని జిల్లాల్లో… లేదంటే భూ సేకరణ పేరుతో రగడ జరుగుతున్న చోట్లో పనులు కాని చోట్లో ఆయన ఉండరు. ప్రభుత్వ వైఫల్యాల్ని వీసమెత్తు కూడా పట్టించుకోరు. తమాషాగా… అవన్నీ కలిసిరాని వ్యవహారాలు అనుకుంటారు. చావులుంటే మాత్రం ఠక్కున వాలిపోతారు. తప్పేముంది లెండి. ఇది బ్యాడంటే బ్యాడ్ కాదు. అదో రకం.

Comments

comments

Article Tags:
· ·
Article Categories:
Anything Everything
Menu Title