అమ్మ తోడు అమ్మ పేరు ఎత్తితే ఒట్టు

Written by

చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకోవడంలో పండిపోయిన కాంగ్రెస్లో చిత్రమైన సీన్. అనంతలో వాకింగ్ కొచ్చిన రాహుల్ గాంధీ అమ్మ మాటే ఎత్తలేదు. భయపడ్డాడా ? జనం తిరగబడతారనుకొని జాగ్రత్తపడ్డాడా ? సోనియా ప్రస్తావన లేకుండా రాహుల్ గాంధీ టూర్ చేయడం ఇదే తొలిసారి. రికార్డులు తిరగేయండి… మా అమ్మ చెప్తుంటుంది… అంటూ కోట్ చేస్తాడో ఎక్కడో అక్కడ. సెంటిమెంట్ కోసం. ఈసారి మాత్రం ఆ ప్రస్తావనే తేలేదు. ఇందిర మనవడిని అంటూ నానమ్మని నమ్ముకున్నాడు.

ఏపీలో కనీసం నిలబడేందుకు కాలూచెయ్యి కూడదీసుకుంటున్న కాంగ్రెస్… ఆత్మహత్యల కోరస్ అందుకుంది ఇప్పుడు. బలవన్మరణాలతో ప్రాణాలు తీసుకున్నవాళ్లకి భరోసా ఇస్తానంటూ వచ్చాడు రాహుల్ గాంధీ. ఓ సింపుల్ క్వశ్చన్. ఏపీలో పరిస్థితి మారి ఎన్నాళ్లైంది ? ఏడాది ఎన్ని పంటలేశారు ? ఎంత నష్టమొచ్చింది ? ఆ ఎఫెక్ట్ తో ఎందరు పోయారు ? చావుల లెక్కలు తీయడం అనుకోకండి. వాస్తవాలు ఇలా అడిగితేనే అర్థమవుతాయ్. రైతుకి ఓపిక ఎక్కువ. కనీసం ఏడెనిమిదేళ్లపాటు మార్పు కోసం ఎదురుచూస్తాడు. ఇకరాదు అనుకున్నప్పుడే తనకి తాను శిక్ష విధించుకుంటాడు. అదే ఆత్మహత్య. మరి ఈ ఆత్మహత్యలన్నీ ఎవరి పాపం ? పదేళ్లుగా పెత్తనం చేసిందెవరు ? చితులతో చలిమంటలు కాచుకున్నదెవరు ?

పోనిలే అని వదిలేస్తేనో… అడిగేవాడు లేకపోతేనో ఇలాంటి పిల్లకాకులు చెలరేగిపోతాయ్. కావుకావుమన్న కేకలే రాజకీయం అనుకుంటాయ్. అందుకే అడగాలి. కడిగిపారేయాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాదని ఇప్పుడు పేలుతున్నాడు. మరి విభజన బిల్లులో ఎందుకు పెట్టలేదు ? అభిప్రాయం చెబుతుంటే గొంతు నొక్కి మరీ విడగొట్టి ఏపీని తొంగలో తొక్కినప్పుడు ఎందుకు ఆలోచించలేదు ? ఈ బుద్ధి అప్పుడేమైంది ? నరికిపోగులేసి పామర్శలకొచ్చి పరాచకాలాడే ఇలాంటి వాళ్లని నడిరోడ్డు మీద నిలదీయాలి. పైజమాలేసుకొని కొందరు… ప్లాస్టిక్ నవ్వులతో దిష్టిబొమ్మల ఫోజు దండాలు పెడుతూ ఇంకొందరు రాజకీయ బుడగజంగాల్లా తిరుగుతారు. లేనిపోని డిస్టబెన్స్ క్రియేట్ చేస్తారు. ఏపీకి అవసరమా ఇలాంటి తలనొప్పులు ?

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title