అమెరికన్ ఏజెన్సీ సర్వే : ఏపీ తొలి హ్యాపినెస్ ఇండెక్స్

Written by

సర్రున లేస్తారు. గమ్మన రియాక్ట్ అవుతారు. సమాధానం చెప్పేవరకూ నిద్రపోరు. కొత్త ప్రయోగాలకి సిద్ధపడడం ఎక్కువ. ఒంటరితనం డిప్రెషన్ చాలా తక్కువ. ఇవన్నీ పెళ్లిచూపుల కోసం రిహార్సెల్స్ కాదు. మన క్వాలిటీసే. పరిస్థితి ఏంటి ? మైండ్ సెట్ మెంటాలిటీ మీద కొలంబియా వర్సిటీ మోడల్ లో చేసిన లేటెస్ట్ స్టడీ ఇది. ఈ మధ్య సీఎం కూడా హ్యాపినెస్ ఇండెక్స్.. ఇండెక్స్ అంటున్నారే.. ఇదే ! ఓరి బాబోయ్ ఇంత టెక్నికల్ మేటర్ ఎందుకంటారా ? చాలా అవసరం. ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ కోసం… బిజినెస్ అవకాశాలు స్టడీ చేసేందుకు అంతర్జాతీయ సమస్థలు తీసిన ఆరా ఇదంతా ! ఇదే మన తలరాతను నిర్ణయించేది. ఇంతకీ మనం హ్యాపీగా ఉన్నట్టా ? లేనట్టా ? అది చెప్పరా అంటారా ? అలాగైతే షార్ట్ కర్ట్ లో చూద్దాం !

పెట్టుబడులు పెట్టేముందు రాజకీయ, భౌగోళిక పరిస్థితులు, ఇన్ ఫ్రాతోపాటు అక్కడ జనం మెంటాలిటీ… యాటిట్యూడ్ లాంటి విషయాలను కూడా మల్టీనేషనల్ కంపెనీలు స్టడీ చేస్తాయ్. ఓ అమెరికన్ ఏజెన్సీ ఈ మధ్య కొత్త ఏపీ టెంపరెంతో ఇలాగే చెక్ చేసింది. మనం ఎక్కడున్నామోస్టేట్ ఏంటో… స్టేటస్ ఏంటో ఇలాగే బైటపడింది. కొన్ని విషయాల్లో అయితే జిల్లాలవారీగా కూడా డీటైల్స్ ఉన్నాయంటున్నారు. ఎంత సంతోషంగా ఉన్నారు? ఎందుకు? పనిచేసే పరిస్థితులు… రిసీవ్ చేసుకునే తీరు… కమ్యూనికేషన్ సామర్థ్యం ఆర్థిక స్తోమత లాంటివన్నీ ఇందులో కవరయ్యాయ్. ఆ మధ్య గ్లోబల్ గా 150 దేశాల్లో లెక్కతీస్తే ఇండియా 117వ ప్లేస్ లో ఉంది. ఇపుడు మన జిల్లాల వారీగా చూసేముందు ఎందుకు ఏమిటి ? ఎలా ? అనే ఈక్వేషన్స్ తేల్చేద్దాం.

ఎవరు చేస్తారు ? ఎలా ?

ప్రజల మానసిక ఆర్థిక సామాజిక పరిస్థితులు అంచనా వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా నెట్ వర్క్ ఉన్న ఏజెన్సీలు కొన్నుంటాయ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అలాంటిదే. ఐక్యరాజ్య సమితి లాంటివి కూడా కొన్నిసార్లు ఇలాంటి లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే. సంప్రదాయాలు, ప్రభుత్వ విధానాల్లాంటివి ఈ సమాచార సేకరణలో చాలా కీలకం. పెట్టుకున్న లక్ష్యాలు.. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇందులో తెలుస్తాయ్. వాటినే SDG – సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్తాం.

ఏపీలో… హ్యాపీలో… ఎవరెక్కడ ?

మన ఏపీ సంగతి చెప్పాలంటే.. జనం మాటల్లో సంతోషం కనిపించిందనేది మొదటి పాయింట్. గోదావరి, క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లో చేస్తున్న పని సంపాదనతో సంబంధం లేకుండా ఆరిందా సమాధానాలొచ్చాయట. అంటే ఏ విషయం మీదైనా మాట్లాడేయడం… ఠక్కున రియాక్ట్ అవ్వడం లాంటివన్నమాట. అవును ఏమైయ్యిందిప్పుడు లాంటి మాటలు ఎక్కువ వినిపించాయ్. అందుకే ఈ నాలుగు జిల్లాల స్ట్రెచ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత సీమ నుంచి దక్షిణ కోస్తా వరకూ. అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది ఈ ప్రాంతం. ఎందుకో అందరికీ దూరంగా ఉన్నామన్న ఫీలింగ్ ప్రకాశం జిల్లాలో వినిపిస్తే… నెల్లూరులో లోకలైజేషన్ ఎక్కువుంది. అంటే స్థానిక పరిస్థితులు అభిప్రాయాల్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయ్. చిత్తూరు, అనంత, కడప, కర్నూలు జిల్లాల్లో నింపాదితనం కనిపించిందని చెబుతోంది రిపోర్ట్. రాజధాని కోస్తా ప్రాంతంలో ఉండడం… విడిపోయినా పోకపోయినా పెద్ద ప్రభావం మాపై పడలేదన్న అభిప్రాయం వచ్చిందిక్కడ. ఇక ఉత్తరాంధ్ర. విశాఖలో లోకలైట్స్ తక్కువ. ఉన్నవాళ్లందరిలో downfallలో ఉన్నామన్న అభిప్రాయం వినిపించింది. తుఫాన్ ఎఫెక్ట్ దీనికి చాలా వరకూ కారణం కావొచ్చు. అయితే ఏపీకి ముంబై లాంటి సిటీ మాది అనే మాట కూడా ఇక్కడొచ్చింది. సామాజిక వెనుకబాటు, ఏం జరుగుతోందో తెలియని అమాయకత్వం మిగతా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉందంటోంది ఈ సర్వే.

కేరళ తర్వాత తమిళనాడు స్థాయిలో ఇంగ్లిష్ మాట్లాడగలిగే సామర్థ్యమున్న ప్రాంతం కోస్తానే అంటోంది సర్వే. తిరుపతి వైజాగ్ బెజవాడ లాంటి నగరాలతోపాటు టౌన్లు ఎక్కువగా ఉండడం దానికి కారణం కావొచ్చంది. కొత్త లేకపోవడం… ప్రపంచంతో కనెక్టివిటీకి సిద్ధంగా ఉండడం వీళ్ల స్పెషాలిటీలంది. కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంతో పోటీపడగల విశాఖ, కాకినాడ, మంగళిగిరి ప్రాంతాలు కీలక ఆర్థిక కేంద్రాలవ్వొచ్చని కూడా ఇండికేషన్ ఇస్తోంది మన తొలి హ్యాపినెస్ ఇండెక్స్. మొత్తానికి నెగెటివ్ ల కన్నా పాజిటివ్ లు ఎక్కువగా ఉండడం.. ఇండెక్స్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్. అందుకే… ఏపీ బీ… హ్యాపీ !

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title