అన్నగారి కుటుంబంలో బీజేపీ కొత్త ఫిటింగ్

Written by

టామ్ అండ్ జెర్రీల్ని పీస్ కమిటీ రిప్రజెంటేటివ్స్ గా పెట్టి అద్భుతాలు చేస్తామంటే మీరేమంటారు ? పీస్ పీస్ కింద కొట్టుకుంటూ… తీరిక చేసుకొని మరీ తిట్టుకునే వాళ్లు పీస్ ఏం సాధిస్తారని అనుకోమా ? ఇపుడు ఏపీలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఇలాంటి ప్రయోగమే చేస్తోంది, చోద్యం చూడాలని సంబరపడుతోంది. టీడీపీ – బీజేపీ సమన్వయ కమిటీ అని ఓ దాన్ని ఏర్పాటు చేసి… సభ్యుల్లో మొదట పురందేశ్వరి పేరే ప్రకటించింది. మాణిక్యాలరావు లాంటి మణిపూసలు ఇంకొన్నున్నాయ్. పురందేశ్వరి కార్డ్ తో బీజేపీ ఏం చేయాలనుకుంటోందో… ఏం సాధించాలనుకుంటోందో ఇట్టే అర్థమైపోతోంది.

పక్కా కాంగ్రెస్ గేమ్ ప్లానే బీజేపీది కూడా. ఎన్టీఆర్ వారసురాలు, మహిళా సెంటిమెంట్, కమ్మబలం ఇవన్నీ కలిసొస్తాయనే పిచ్చి నమ్మకం. గాలి కలిసొచ్చి గెలిచాక కాంగ్రెస్ ఆ కలర్ ఇచ్చింది. ఇపుడు బీజేపీ ఇంకా చిత్రం. గెలవకపోయినా… భవిష్యత్ వ్యూహాలు దృష్ట్యా అంటూ లోతైన మాటలు చెప్తూ పురందేశ్వరికి ప్రాధాన్యం ఇస్తోంది. ముందుముందు టీడీపీ బీజేపీ చెరోదారి అయిపోతే ఓ కార్డ్ గా వాడుకునే వీలుంటుందనే ఆశ గట్టిగానే ఉన్నట్టుంది. అందుకే జాతీయ కమిటీలో చోటు సహపరిశీలకురాలిగా కర్ణాటకలోనూ కాస్త ప్రయారిటీ ఇచ్చింది. ఇపుడు ఏకంగా సమన్వయ కమిటీలోనే కూర్చోబెట్టింది. ఇక్కడే అర్థమైపోతోంది ఏ రేంజ్ సమన్వయం కోరుకుంటోందో బీజేపీ !

అన్నగారి వారసులందరిలాగే రాజకీయం చిన్నప్పట్నుంచే వంటబట్టిందనుకునే పురందేశ్వరి ఇప్పటికీ అదే మూడ్ లో ఉంటారు. కేంద్రం అద్భుతంగా సాయం చేసింది ఏపీకి అంటారు ఉండుండోసారి. ఏపీలో ఏకంగా 18 పథకాలు ప్రారంభించిందని ఆ మధ్య రాజంపేటలో చెప్పారు కూడా. కేంద్రానికి తెలిస్తే ఉలిక్కిపడే విషయం ఇది. మరిది మీద మంట ఉండొచ్చు… మళ్లీ టీడీపీలోకి రానివ్వలేదన్న ఉక్రోషాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ సొంత ఫీలింగ్స్ కోసం రాష్ట్రాన్ని అడ్డంపెట్టుకోవడం మాత్రం అన్యాయం. తండ్రి ప్రాణం పెట్టి పోరాడిన కాంగ్రెస్ లో కెళ్లి… టీడీపీ మీద విమర్శలు చేయడం… అక్కడ వెలుగు అయిపోయాక బీజేపీ తెప్పలోకి దూకడం లాంటివన్నీ క్రెడిబిలిటీకి సంబంధించిన విషయాలే. చెట్టు పేరు చెప్పి ఎల్లకాలం కాయలు కోసుకోవాలంటే అయ్యేపని కాదు.

Comments

comments

Article Categories:
Anything Everything
Menu Title