అతిగా ఆవేశపడే సీఎం… ఆలోచనలేని అథికార్లు సుఖపడినట్టు చరిత్రలో లేదు !

Written by

టామ్ హడావుడిగా ఆవేశపడిపోతోంది. కేరెట్, బీట్ రూట్ తరిగేసి కుక్కర్ లో కుక్కేస్తోంది. ఫైనల్ గా, దొరికిందనుకొని కాలి కింద తొక్కిపట్టిన జెర్రీని తీసి అందులో వేశాననుకుంది. కుక్కర్ ఆన్ చేసి… చూడు నా పనితనం అంటూ చేతులు దులిపింది. ఆ తర్వాత ఏమైంది ? కుక్కర్ బ్లాస్ట్ అయ్యింది. టామ్ కి బరస్ట్ అయ్యింది. ఎందుకంటే కాలి కింద జెర్రీ లేదు… టామ్ తోకే ఉంది. ఆ తోక అందులో పెట్టి పులుసు పెట్టింది. అడ్డంగా బుక్కైంది. టామ్ అండ్ జెర్రీ చూసే వాళ్లకి ఇదో హిలేరియస్ ఎపిసోడ్. కాల్ డేటా కేసు కూడా ఇంతే. కడుపు మంటతో… బుక్ చేద్దాం అనుకొని తెలంగాణ ప్రభుత్వం బొక్క బోర్లా పడిందిప్పుడు.
ఎందుకు జెఠ్మలానీలు… లేనిపోని హంగామా… ?
ఎందుకంటే పోయిన పరువు కొంతైనా కాపాడుకోవాలి కదా ! డేటా ఇవ్వాల్సిందేనని బెజవాడ కోర్ట్ బిగించింది. హైద్రాబాద్ లో కోర్టుకెళ్లినా నో రిజల్ట్. ఆ తర్వాత సుప్రీింకి వెళ్లినా డేటా ఇవ్వడంఇవ్వడమే కాకపోతే షరతులు వర్తిస్తాయ్ అంది. .కోడిని కోయడం కోయడమే కాకపోతే అప్పటి వరకూ జాగ్రత్తగా మేపండి అన్నట్టు చెప్పింది. మళ్లీ హైకోర్ట్ కి వెళితే…అక్కడా డైలాగ్ మారింది కానీ సీన్ ఇదే. డేటా అయితే ఇవ్వండి కానీ ఓపెన్
చేయకండి అంది. డేటా ఇచ్చేశాక ఇవాళ కాకపోతే రేపు ఓపెన్ చేస్తారు. దొరికిపోయినట్టే కదా ! అందుకే చివరి నిమిషంలో తెలంగాణ సర్కార్ వాదన మార్చింది. ఈ పడవలో కాలు తీసి ఆ పడవలో వేసింది. కేసులు నమోదు చేశాక సమాచారం కోసం మాత్రమే డేటా తీసుకున్నాం అని చెప్తోందిప్పుడు. మరి నిన్నటి వరకూ ఎందుకు చెప్పలా ? అయినా ట్యాపింగ్ జరగడానికి… కేసు కట్టడానికి మధ్య దాదాపు నెల రోజుల గ్యాప్ ఉంది. కేసు కడతారని ముందే తెలిసి తీసుకున్నారా ? ఓరి ఈళ్ల ఏషాలో !
మరి వాట్ నెక్ట్స్ ?
అడుగు తీసి ఈ పడవలోంచి ఆ పడవలో వేసినా సరే లాభం లేదు. ఏదైనా మునిగేదే ! వేటు పడడం ఖాయం. టెలిఫోన్ వైర్లు మెడకి చుట్టుకోవడం ఖాయం. అయితే ఎంత వాటంగా ఆ తీగల నుంచి తప్పించుకుంటారో చూడాలి. ప్రస్తుతం అయితే పరిస్థితి విషమమే ! అధికార్లపై వేటు పడిందా… అంతకంటే పరువు తక్కువ ఉండదు. రాజకీయం కోసం ఐపీఎస్ ని బలిచేశాడు… ఇదీ ఇక్కడ తీరు అని జాతీయ స్థాయిలో అప్రదిష్టొచ్చిపడుతుంది. లేదు అంతకంటే ముదిరిందో… కేసీఆర్ ముచ్చట తీరుతుంది… అసెంబ్లీ రద్దు చేస్తా చేస్తా అని ఆల్రెడీ ఎమ్మెల్యేల్ని ఆయన బెదిరిస్తున్నాడు కదా !

Comments

comments

Article Categories:
Anything Everything

Comments

Menu Title